Blogger Widgets

Wednesday, November 20, 2013

విశ్వవ్యాప్త బాలల దినోత్సవం

Wednesday, November 20, 2013

నవంబర్ నెల అనగానే బాలల దినోత్సవం, అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు, బాలల హక్కుల దినోత్సవం.ఇలా నెల మొత్తంమీదా బాలలకు పండుగ రోజులే. ! ఇందులో భాగంగా ఈరోజు అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం, ప్రపంచ బాలల దినోత్సవాన్ని పిల్లలంతా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.  
బాలల హక్కులపై ఉద్యమాలు చేపడుతున్నామని చెప్పుకుంటున్న స్వచ్చంద సంస్ధలు బాలలను అడ్డుపెట్టుకొని లక్షలాది రూపాయలు స్వదేశి, విదేశి నిధులు దుర్వినియోగపరుస్తున్నారే తప్ప వీరి హక్కులు కాపాడేందుకు ఏ ఒక్కరూ చిత్తశుద్ది, అంకిత భావంతో పనిచేయడం లేదనే అరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి.
బాల కార్మిక చట్టాలు, బాలల హక్కుల చట్టాలు కొంత మందికి చుట్టంగానే కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా బాలలు ఎక్కువగా ప్రమాదకరమైన పనుల్లో కనిపించడం అలా పనుల్లో పెట్టుకున్న వారిపై కేసుల నమోదులు చేస్తారు.  
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటుంటారు. అయితే 1959కి ముందు అక్టోబర్ నెలలో బాలల దినోత్సవాన్ని జరుపుకునేవారు. ఐక్యరాజ్యసమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954లో ప్రపంచమంతటా నిర్వహించారు.1959 నవంబర్ 20న బాలల హక్కుల ప్రకటనను ఐరాస సర్వసభ్య సభ రూపొందించిన సందర్భంగా బాలల దినోత్సవాన్ని ప్రపంచ మంతటా జరుపుకోవాలని నిర్ణయించారు. 1989లో పిల్లల హక్కులపై నవంబర్ 14న ఓ బిల్లును ఐరాస ఆమోదించింది. ఈ బిల్లును ఆమోదిస్తూ 191 దేశాలు సంతకాలు పెట్టాయి కూడా.పిల్లలు తమ భావాలను, సమాచారాన్ని పంచుకోవడాన్ని, పరస్పర అవగాహనను పెంచుకోవడాన్ని ప్రోత్సహించేందుకు గాను ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ బాలల దినోత్సవానికి రూపకల్పన చేసింది. ప్రపంచమంతటా పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకోసం పలు చర్యలు చేపట్టడం ఈ దినోత్సవం లక్ష్యం.చాలా దేశాలు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సూచించిన నవంబర్ 20 న ప్రపంచ బాలల దినోత్సవంగా పాటిస్తునారు.  అందరికి  విశ్వవ్యాప్త బాలల దినోత్సవం  శుభాకాంక్షలు. 

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers