Blogger Widgets

శుక్రవారం, నవంబర్ 08, 2013

అలమేలు మంగ శ్రీహరి హృదయలక్ష్మి గా

శుక్రవారం, నవంబర్ 08, 2013

జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి అలమేలు మంగ శ్రీహరి హృదయలక్ష్మి గా ఆవిర్భవించిన రోజు నేడే.
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మి అనే అలర్‌మేర్‌మంగ కార్తీక శుక్ల పంచమి శుభముహూర్తాన తిరుచానూరులోని పద్మసరోవరంలో స్వర్ణకమలంలో ఆవిర్భవించి శ్రీనివాసుని అంతరంగమైంది. అలమేలు మంగ లేదా పద్మావతి, కలియుగంలో వేంకటేశ్వరుని దేవేరిగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. 
అమ్మవారి అవతరణ దినమైన కార్తీక శుద్ధ పంచమి త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడట. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి కొల్హాపూర్ వెళ్ళిందట. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడట. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి శుక్రవారం, నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువపూదండలతో స్వామివారిని వరించింది. కనుకలక్ష్మీ దేవియే పద్మములో జనించిన పద్మావతి లేదా అలమేలు మంగ - (తమిళంలో "అలర్" అనగా పువ్వు. "మేల్" అనగా పైన. "మంగై" అనగా అందమైన స్త్రీ - "అలమేలు" అనగా "పద్మంలో ప్రకాశించున సుందరి")ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడట. 
అలమేలు మంగ శ్రీహరి హృదయలక్ష్మి గా
అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు చేతులు వరద అభయ ముద్రలలో ఉంటాయి. ఇట్టి లక్ష్మీదేవియే "పద్మావతి" లేదా "అలమేలు మంగ" అనీ, అమెయే తిరుమల కొండపై శ్రీవారి మూర్తి వక్షస్థలంపై ఉన్న హృదయలక్ష్మి అనీ, ఆమెయే తిరుచానూరు ఆలయంలో వెలసిన అలమేలు మంగ అనీ భావించవచ్చును. అన్నమయ్య సంకీర్తనలలో అలమేలు మంగను శ్రీమహాలక్ష్మిగా పదే పదే వర్ణించాడు. 
 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని
నీరజాలయకు నీరాజనం

జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు
నెలకొన్న కప్పురపు నీరాజనం
అలివేణి తురుమునకు హస్తకమలంబులకు
నిలువుమాణిక్యముల నీరాజనం

చరణ కిసలయములకు సకియరంభోరులకు
నిరతమగు ముత్తేల నీరాజనం
అరిది జఘనంబునకు అతివనిజనాభికిని
నిరతి నానావర్ణ నీరాజనం

పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై
నెగడు సతికళలకును నీరాజనం
జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల
నిగుడు నిజ శోభనపు నీరాజనం
 

ప: అమ్మమ్మ యేమమ్మ అలమేల్మంగ నాచారమ్మ
తమ్మి యింట నలరుకొమ్మా వోయమ్మా

చ: నీరిలోనాఁదల్లడించి నీకే తలవంచి
నీరికిందాఁ బులకించి నీ రమణుండు
గోరికొనఁ జెమరించిఁ గోపమేపచరించి
సారెకు నీయల కిట్టె చాలించవమ్మా

చ: నీకుఁగానె చెయిజాఁచి నిండాఁ గోపమురేఁచి
మేకొని నీవిరహాన మేను వెంచేని
యీకడాకడి సతుల హృదయమే పెరరేఁచీ
నాకు మడిచియ్యనైనా నానతియ్యవమ్మా

చ: చక్కఁదనములె పెంచి నకలముఁగాలదంచి
నిక్కపు వేంకటేశుండు నీకె పొంచేని
మక్కువతో నలమేల్ మంగనాచారమ్మా నీ
యక్కున నాతని నిట్టె అలరించవమ్మా



వచ్చెను అలమేలుమంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ

బంగారు చేదివిటీలు పూని
శృంగారవతులు వేవేలురాగా
రంగైన వింజారమరలు వీవ
మాంగల్యలీల సొంపగు జవరాలు

పలుకుల తేనియ లొలుక చెంత
చిలుకలు కలకల పలుక రవల
గిలుకు పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలక

రంభాది సతులెల్ల చేరి యెదుట
గంభీర గతులను మీర నటనా
రంభములను మేలుకోరి కొలువ
అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి


 ఈరోజును జ్ఞాన పంచమి అని కూడా అంటారు. 

1 కామెంట్‌:

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)