Blogger Widgets

Tuesday, December 17, 2013

ఓంగి ఉలగళంద

Tuesday, December 17, 2013

లోకములో విషయాలు విడుచుట, స్వీకరించుట ఒకేరీతిగావుండును. అవి మనకర్మలను అనుసరించి పట్టినాను దుఃఖమును పొందుదురు . వదిలినాను దుఃఖమును పొందుదురు .బార్యా,బిడ్డలు ఉన్ననూ దుఃఖమే ! వదిలినాను దుఃఖమే ! దానికి కారణము వానివల్ల కల్గిన సుఖము గాని దుఃఖముగాని విషయమువల్ల జనించునవి కాకపోవుటఏ! కావునా పట్టుట విడుచుట రెండు సమానమే ! కావున భాగావద్విశాయము సహజానందము , అదే పరమానందము అని తెలిసి ఇతరములు విడిచి వేయుదురు. ఆ విషయాలు తెలిసే ఈ వ్రతములో ఏమిచేయవలేనో రెండవ పాశురములో వివరించారు.

మరి వ్రతనియమాలు తెలుసుకున్నారు కదా
మరి ఆ వ్రతఫలితములు ఎలావుండాలనుకున్నరంటే ?
మూడవ పాశురములో వివరించారు.


ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము: బలిచక్రవర్తి ఇచ్చిన దానము నంది ఆకాసమువరకు పెరిగి మూడు లోకములను తన పాదములసు కొలిచిన పురుషోత్తముడగు పరందాముని దివ్యగానమును పాడి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలెను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళిపడుచుండగా, కలువపూలులో మనోహరములగు తుమ్మెదలు నిద్రపోతుండగా, సస్యములు సమ్రుద్దిగా ఉండవలెను. పాలు పితుకుటకు కొట్టములొ దూరి స్థిరముగా కూర్చొని పొదుగునంటగానే పాలు కుండలు నిండునట్లు చేపు సమౄద్దిగా గోవులకు ఉండవలెను. లేదు అనే శబ్ధము లేని సంపద దేశమంతా నిండవలెను.
అని మూడవ పాశురము అర్ధము . అయితే గోపికలు ఈ వ్రతము చేయుట వల్ల ఎటువంటి ఫలితాలు పొందుదురో తెలిపారు . ఈ రోజు మన అమ్మ (ఆండాళ్) శ్రీ పరందాముని వామన అవతారము ను కొలచింధి. ఆ పురుషోత్తముడు ఒకసారి చేపవలే , మరోసారి తాబేలుగా, మరొకమారు వరాహమూర్థిగా, ఇంకోసారి నరసిం హముగా , మరొకమారు పరిపూర్ణ మానవ మూర్థిగా అవతరించి మనలను నిరంతరమూ కాపాడుచున్నడు.
భగవంథుడు సర్వ వ్యాప్థి అని చెప్పుటకు ఈ విధముగా చెప్పినధి అమ్మ. భగవంతుడు ఎంతగా ఎదిగాడంటె బ్రహ్మ కడిగిన మొదటి పాదము , బలిచక్రవర్థి కడిగిన రెండో పాదము ఒకసారె చేరాయి . అంటె ఆయన సర్వ వ్యాప్తము అని తెలిసింధి. ఈ విధముగా వున్న స్వామి బలిచక్రవర్థి తలమీద ముడోపాదాన్ని మోపి బలికి రసా తలమును ప్రసాధించారు. ఇది అంతా నారాయణ తత్వముగా అమ్మ వివరించింధి.
లోకము సుఖముగా వుండుటకు ఈ వ్రతము మంచిదని వివరించింధి. మూడు కాలాలు వానలు కురిసి పంటలు బాగాపండి . గోవులు పాలు చెపుముట్టుకొనగానే పాలతో కుండలు నిండిపోవాలని . మన దేశము సస్య స్యామలముగా వుండాలని గోపికలతో వివరించింధి.
గోపికలు ఏకొరికా లేక దేశము సౌభాగ్యము వంకతో ఈ వ్రతముతో శ్రీ కృష్ణుని సేవ చెసుకొని వారి జీవితము దన్యత
చే కూర్చుకోవలె అని ఫలము కోరుతూ ఈ వ్రతము చెయుటకు నిర్నయించుకొనిరి .
ఈ పాశురములో చెప్పిధి ఎమిటంటే ఈ వ్రతము చెయుట వలన బాహ్యముగా సస్య సమృద్ధి ని కలిగించును. అంతరంగమున ఆత్మ ఙాన పరిపూర్తిని ఆచార్య సమృద్ధిని ప్రసాధించును.
జై శ్రీ మన్నారాయణ్ .

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers