Blogger Widgets

Sunday, December 22, 2013

సంఖ్యా మాంత్రికుడి జయంతి

Sunday, December 22, 2013

ఈ రోజు మన భారతదేశం గర్వించదగ్గ సంఖ్యా మాంత్రికుడు,  శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం.  ఈ సందర్బముగా మనం ఆయనని గుర్తుచేసుకుందాం. రామానుజన్ శుద్ధ గణితం లోను నెంబర్ థీరి ముఖ్యమైన పరిశోదనలు  శ్రీనివాస రామానుజన్ 22/12/1887 లో శ్రీనివాస అయ్యంగార్, కోమలత్తమ్మాళ్ పుణ్యదంపతులకు తమిళనాడులోని ' ఈ రోడ్ ' లో జన్మించెను. తన తండ్రి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేసేవాడు. అతని తండ్రి సంపాదించే జీతంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉండేది. రామానుజన్ చిన్నతనం నుండే విశిష్ట లక్షణాలు కలిగి వుండేవాడు. పెద్ద పెద్ద లెక్కలని కూడా కాగితం, పెన్సిలు వాడకుండా మనసులోనే చెయ్యగల అసామాన్య నైపుణ్యం కలిగివున్నాడు.  అతను చిన్నవయసులోనే ప్రముఖమైన  ఆయిలర్ సూత్రాన్ని (exp(ix) = cos(x) + i sin(x) ) రామానుజన్ కనుక్కున్నాడు.  చిన్నతనమునుమ్డే అద్భుత ప్రతిభను ప్రదర్శించేవారు రామానుజన్.  జార్జ్ కార్ అనే వ్యక్తి రాసిన ఓ అవిశేషమైన గణిత పుస్తకం రామానుజన్ కి ఆధునిక గణితానికి మొట్టమొదటి పరిచయ గ్రంథం అయ్యింది. అంత వరకు బడి చదువుల్లో తిప్పలు పడుతూ, కాలేజిలో చేరడానికి ప్రవేశ పరీక్షల్లో డింకీలు కొట్టిన రామానుజన్, ఈ పుస్తకాన్ని సునాయాసంగా అవపోసన పట్టాడు. అక్కడితో ఆగక పుస్తకంలో లేని కొత్త సుత్రాలని కనిపెట్టసాగాడు. తన అసమాన ప్రతిభాపాటవాలు రామానుజన్ కి హై స్కూలు స్థాయిలో ప్రత్యేక పారితోషకాన్ని తెచ్చిపెట్టాయి. 
రామానుజన్ మద్రాసులోని పోర్ట్ ట్రస్ట్ లో ఓ చిన్నగుమాస్తా ఉద్యోగం సంపాదించాడు. జీతం కూడా బాగా తక్కువ. జీతం తక్కువైనా ఈ ఉద్యోగం వల్ల తనకి అత్యంత ప్రియమైన గణితంలో మునిగిపోవడానికి బోలెడంత తీరిక దొరికేది. తనకు దొరికిన తీరిక సమయంను పూర్తిగా సంఖ్యా మేజిక్ చేయటానికి ఉపయోగించుకున్నారు.  నిరంతరం సంఖ్యా ప్రయోగములు చేసేవారు. ఈ దశలోనే రామానుజన్ తను కొత్తగా కనుక్కొన్న కొన్ని గణిత ఫలితాలని ముగ్గురు ప్రఖ్యాత బ్రిటిష్ గణితవేత్తలకి పంపాడు. పెద్దగా చదువుకోని ఎవరో అనామక భారతీయ గుమాస్తా రాసిన ఆ ఉత్తరాన్ని, వారిలో ఇద్దరు గణితవేత్తలు చూసీచూడకుండానే చెత్త బుట్టలో పారేశారు. మూడవ గణితవేత్త మాత్రం ఆ పొరబాటు చెయ్యలేదు.    ఫిబ్రవరి 28, 1918లో రామానుజన్ ని ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీగా ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరం అక్టోబర్ లో ఈయనకు ఫెలో ఆఫ్ ది ట్రినిటీ కాలేజ్ గా ఎన్నుకున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఈయన బీజ గణితంలో సాధించిన సమీకరణాల వల్ల యూలర్, జాకోబి వంటి గొప్ప శాస్త్రజ్ఞుల కోవలోకి చేరాడని కేంబ్రిడ్జిలో ఎంతో మంది చెప్పుకునేవారు. క్షయ సోకడంతో రామానుజన్ ఇంగ్లాండు నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేశాడు. ఏప్రిల్ 26, 1920న చనిపోయేనాటి వరకు గణితంలో నిత్యం చిత్రవిచిత్రమైన అంశాలను ఆవిష్కరిస్తూ వుండేవాడు. ఈయనకు ఎనలేని దైవచింతన వుండేది. దైవం, శూన్యం, అనంతం ఇలాంటి అంశాల మీద ఉపన్యాసాలు కూడా ఇచ్చేవాడు. శ్రీనివాస రామానుజన్‌ అనగానే గుర్తుకొచ్చేది 32 ఏళ్లలోనే పేదరికాన్ని, ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు గడించిన ఓ 'సహజ గణితశాస్త్ర మేధావి'. ఈయన జీవితచరిత్ర యువ మేధావులకు ఎంతో స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఈ స్ఫూర్తి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిలో విజయాల్ని సాధించాలనే పట్టుదలను పెంచుతుంది. 
 శ్రీనివాస రామానుజన్ జన్మదినము సందర్భముగా ఈరోజును జాతీయ గణితదినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సందర్భముగా అందరికి జాతీయ గణితదినోత్సవ శుభాకాంక్షలు.

1 comment:

  1. 名片小屋,各式各樣名片設計案例與名片印刷品案例,不僅如此還有名片印刷各種製作規格自動線上計算下單與多種美術紙張可挑選,全台獨一無二。

    ReplyDelete

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers