Blogger Widgets

సోమవారం, డిసెంబర్ 09, 2013

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం

సోమవారం, డిసెంబర్ 09, 2013

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 9 న జరుపుకుంటారు. దీనిని 2003 అక్టోబరు 31 న ఐక్యరాజ్యసమితి నిర్వహించిన :అవినీతి వ్యతిరేక సదస్సు" ద్వారా ఈ రోజును నిర్ణయించారు.  అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు చాలా ఎక్కువగా  దిగజారుతాయి. అన్ని రంగాల్లోను దారిద్రము  అస్థిరత చాలా పెరిగిపోతాయి. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారి తీస్తుంది. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థలు, అంతర్జాల వ్యవస్థ, ఎన్జీవోలు, మీడియా, వ్యక్తులు కలసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది. 
అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, స్టాక్ మార్కెట్‌ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి. మన దేశము యొక్క రూపాయి మారక విలువ రోజు రోజుకు దిగజారిపోతున్నది.  ప్రజలు వారి హక్కులను కాపాడుకోటానికి కోర్టులను మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించడం, ఇంటర్నెట్‌, టీవీ, ప్రింట్‌ మీడియాను ఆశ్రయించడం, సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరడం వంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకైనా తగ్గించవచ్చు. యాంటీ కరెప్షన్‌ సంస్థలు ఏర్పాటు చేయడం, రాజకీయ పక్షాలకు నిధులు అందించడం లో, పాలనావ్యవహారాల్లో పారదర్శకత పెంచడం, ప్రతిభ, సామర్థ్యం లాంటి అంశాల కారణంగా నియామకాలు, ప్రమోషన్లు చేపట్టడం లాంటి చర్యలు తీసుకోవాలని ఈ రంగంలో నిపుణులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లావా దేవీలను గుర్తించడం, వివిధ దేశాలు పరస్పరం సహకరించు కోవడం, అన్ని రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లాంటి వాటి ద్వారా అవినీతిని కొంతమేరకు తగ్గించవచ్చు. అవినీతి పాల్పడినవారు ఎంతటి వారినైనా కఠినంగా శిక్షించాలి.  అవినీతికి పాల్పడిన రాజకీయనాయకులకు పూర్తిగా రాజకీయాలనుండి తొలగించాలి.  ఎన్నికల రాజకీయ వ్యవస్థలో అవినీతి తొలగించేందుకు సంస్కరణలు చేపట్టాలి. ప్రతీ కార్యాలయంలో సేవల వివరాలు అవి పొందే విధి విధానాలు ఏ పని ఎన్నిరోజుల్లో చేస్తారో వివరించే ఫిజికల్‌ చార్టర్‌లు చాలా శాఖల్లో ప్రకటించారు. వీటిని సక్రమంగా అమలుజరిగేలా కార్యాచరణ ఉండాలి. పారదర్శకతకోసం సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం ప్రజలకు తెలుసుకునే వీలు కలిగింది. దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే అవినీతి దూరమవుతుంది. కేంద్రీకృత పాలన అవినీతికి మూలమైంది. దీనికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. జవాబుదారీతనంతో స్థానిక ప్రభుత్వాలు సాధించాలి. మనదేశాన్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతీఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతిన బూనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాదు అవినీతి గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి.  ప్రతీ స్కూల్ లోను అవినీతి గురించి వివరించాలి.  చిన్నప్పటినుండి నీతి అంటే అవినీతి అంటే ఏమిటో తప్పు ఒప్పు తేడా తెలియచేసి వారిని మంచి మార్గంలో నడిచేటట్టు చెయ్యాలి.  నేటి బాలలే రేపటి భావి పౌరులు కదా అప్పుడు దేశ భావిష్యత్తు బాగుంటుంది.  అవినీతి వల్ల మొత్తం వ్యవస్థ అంతా దెబ్బ తింటుంది.  అలా జరగాకుండా కాపాడుకోవలసిన భాద్యత ప్రతీ పౌరుని కర్తవ్యంగా భావించాలి. ఈరోజు అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం శుభాకాంక్షలు . 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)