Blogger Widgets

Wednesday, May 14, 2014

అన్నమయ్య జయంతి

Wednesday, May 14, 2014

అప్పని వరప్రసాది అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు . 
గురుదేవ స్తుతి 

శ్రీమత్వదీయ చరితామృత మన్నయార్య 
పీత్వాపినైవ సుహితా మనుజా భవేయుః 
త్వం వేంకటాచలపతే నివ భక్తి సారం 
శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే నమో నమస్తే 

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తన జీవితాన్ని తరింపచేసుకున్న పరమ భక్తాగ్రేశ్వరుడు , తొలితెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు శ్రీ తాళపాక  అన్నమయ్య.   15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లిదండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులు.   తాళ్ళపాక గ్రామం లో అన్నమయ్య వంశీయులు నందవరీక  బ్రాహ్మణ కుటుంబములో క్రీ.శ . 1408 లో వైశాఖమాసం లో, విశాఖ నక్షత్రంలో మంచి గ్రహస్తితిలో జన్మించారు.  
తెలుగులో మనకు తెలిసినంత వరకు మొట్టమొదటి తెలుగుపదాలు అన్నమయ్యవె.   అన్నమయ్య ఆలపించిన తెలుగు పదాలు పండితులకు అటు పామరులకు అందరికి అర్ధమయ్యే విధంగా వుంటుంది.  ఆయన అత్యాధునిక స్వాతంత్ర్యభావాలు కలవాడు . సమాజాని అతిసూక్ష్మద్రుష్టి తో పరిశీలించి జనబాహుళ్యంలో వున్నా జానపదాన్ని గ్రహించాడు.  అన్నమయ్య పదాలు దేనికదే ప్ర్యతేకతను కలిగివుంటాయి. భక్తి , వైరాగ్యాలలోనే కాకుండా నాటి సాంఘీక రాజకీయ,సామాజిక స్థితిగతులకు కూడా అద్దంపట్టయి అనుటలో ఎటువంటి సందేహం లెదు.  అన్నమయ్య  పదాలు తెలుగువారికి తరగని నిధులు.  తెలుగు తనానికి పెట్టనికోటలు.  తెలుగువారి హృదయాలమునకు చెరగని ముద్రలుగా వున్నాయి.  ఆయన పదమే తెలుగుపాటకు జీవం.    అన్నమయ్య అనేక సంకీర్తనలు తో పాటు సంస్కృతములో వేంకటాచల మహాత్మ్యం, సంకీర్తన లక్షణం, తెలుగు ద్విపద రామాయణం, 12 శతకాలు వ్రాసినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వర శతకం ప్రసిద్ది పొందినది.  అన్నమయ్య ఇతర రచన లెన్ని చేసినా ఇతర భాషలలో ఎన్ని ప్రభందాలు  రాసినా సుప్రసిద్దముగా నిలిచినవి సంకీర్తనలే.  నిత్యము స్వామిని తన సంకీర్తనలతో ఆరాధింఛి తరించిన అన్నమయ్య క్రీ.శ . 1503 లో ఫాల్గుణ బహుళ  ద్వాదశి దినమున స్వామిలో లీనమైనాడు.  ఈ తిధిని పురస్కరించుకొని తాళపాక వారు 
"దినము ద్వాదశి నేడు తీర్థదివసము నీకు
జనకు(డ అన్నమాచార్యు(డ విచ్చేయవే

అనంతగరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘననారదాది భాగవతులతో
దనుజ మర్దనుండైన దైవశిఖామణితోడ
వెనుకొని యారగించ విచ్చేయవే

వైకుంఠాన నుండి యాళువారలలోపల నుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంతతోడ నున్న శ్రీవేంకటేశు(గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే

సంకీర్తనముతోడ సనకాదులెల్ల(బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభు(డు నీవు
నంకెల మాయీంటి విందు లారగించవే"
అని ఆరాధించారు.  అన్నమయ్యను అప్పని వరప్రసాదిగా కీర్తించి తరించారు.

Friday, May 02, 2014

ధనలక్ష్మి రూపేణ పాలయమాం

Friday, May 02, 2014


ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి! దుందుభినాదసుపార్ణమయే!!
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ! శంఖ నినాద సువాద్యనుతే!1
వేదపురాణేతిహాససుపూజిత! వైదిక మార్గ ప్రదర్శయుతే!!
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాం
 వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. సూర్య చంద్రులిరువురూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజు . ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని , ఈ రోజు మొత్తం శుభకరం కనుక వేరే ముహూర్తం కోసం వెతక వలసిన పనిలేదని హిందువులు నమ్ముతారు. వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.
ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు  ఉప్పును కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువే  కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని భావన.  వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. 
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృతమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ నమ్మకం. ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానం లో గడుపుతారు. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహం పై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.వేద వ్యాసుడు చెపుతుండగా, విఘ్ననాయకుడైన వినాయకుడు అక్షయ తృతీయ నాడే మహాభారత కథను లిఖించే మహత్కార్యాన్ని ప్రారంభించాడని చెపుతారు. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని పుట్టినరోజు కూడా ఈ రోజే . వనవాసంలో ఉన్న పాండవులు శ్రీ కృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజూ కూడా ఇదే. అందుకే ఈనాడు భగవంతునికి అర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ, కొనుగోలు చేసినది ఏదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. ఈ రోజు వేకువ జామునే లేచి, మహా విష్ణు అవతారాలనూ, లక్ష్మీ దేవినీ పూవులతో, తులసీ దళాలతో అర్చిస్తారు. శ్రద్ధాసక్తులున్నవారు లక్ష్మీ కుబేర హోమాన్ని చేయించుకుంటారు. అన్నదానాలు నిర్వహిస్తారు.
అక్షయ తృతీయ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు. 

పరశురాముడు జయంతి

శ్రీ మహావిష్ణువు ఆరవ అవతారమైనవాడు  జమదగ్ని కుమారుడు పరశురాముడు జన్మించాడు. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు,జామదగ్ని అని కూడా అంటారు.పరశురాముడు మహాభారత రామాయణ భారత పురాణ సన్నివేశాలు కీలకమైన పాత్రలు పోషించారు. 
ఈరోజు పరశురాముడు జయంతి. కావునా పరశురాముని జన్మవృత్తాంతం
కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. 
జమదగ్ని ,రేణుకాదేవి ల చివరి కొడుకు పరశురాముడు. జమదగ్ని చాలా కోపం గలవాడు. అతని భార్య రేణుక తనపతిభక్తితో రోజు నదికి వెళ్ళి తనే స్వయంగా మట్టి కుండచేసి ఇంటికి నీళ్ళుతెచ్చేది. ఒకరోజు రేణుకాదేవి చిత్రరధుడనే రాజును చూసింది. ఆరోజు ఆమె నీళ్ళుతేవటానికి కుండ తయారు చేసినా కుండ తయారుకాలేదు. నీళ్ళు తేలేకపోయింది. ఏమి జరిగింది అని దివ్యదృష్టితోచూడగా రేణుక చిత్రరధుని చూడటంవల్లే పాత్రతయారుకాలేదని గ్రహించి తనపుతృలును పిలిచి తల్లిని నరకమన్నాడు. వారందరు తమవల్లకాదన్నారు. అప్పుడు చివరి కొడుకు పరశురాముడు సరే అని తన తల్లిని నరికి వేశాడు. తండ్రి చెప్పిన మాట చేసినందుకు ఒకకోరిక కోరమనగా తనతల్లిని తిరిగి బ్రతికించమన్నాడు పరశురాముడు.  తండ్రిమాట జవదాటని కొడుకు.పరశురాముడు. తనతల్లికి ఆ గతిపట్టించింది రాజులు కావున పరశురాముడు రాజులుమీదకోపం పెంచుకొని వారిని నాశనంచేయటం మొదలుపెట్టాడు. పరశురాముని పేరు భార్గవరాముడు. (పరశు= గొడ్డలి ) పరశుతో రాజులు ను నరకుతున్నాడుకావునా పరశు రాముడు అని పేరు వచ్చింది. అప్పట్లో పరశురాముడునుండి  రక్షించుకోవటానికి రాజులు అందరు చేతులుకు గాజులు వేసుకొని దాచుకునేవారు.కొందరు గొప్పరాజుల్ పుత్రులును భూదేవి తనలో దాచుకొని రక్షించింది.

రామాయణం లో ప్రభావం
సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి, రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను, రాముని శాంత వచనాలనూ పట్టంచుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తి కొట్టై మని చెప్పి తాను మహేంద్రగిరిపై తపస్సు చేసికోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.

మహాభారతం లో ప్రభావం
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.

కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

My Blog Lovers