Blogger Widgets

సోమవారం, మార్చి 23, 2015

ముగ్గురు హీరోలకు వందనం.

సోమవారం, మార్చి 23, 2015

 
నిజమైన ఈ ముగ్గురు హీరోలకు (భగత్ సింగ్, సుఖ్ దేవ్ థాపర్హరి శివరాం రాజ్ గురు) వందనం 
భగత్ సింగ్  (సెప్టెంబరు 281907 –మార్చి 231931స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు.భారత స్వాతంత్ర్యోద్యమమునకు పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులల్లో ఆయన ఒకరు. ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'. చరిత్రకారుడు కె.ఎన్. పనిక్కర్ ప్రకారం భగత్ సింగ్,భారతదేశంలో ఆరంభ మార్కిస్టు గా పేరుపొందాడు.
సుఖ్ దేవ్ థాపర్ (15 మే 1907 - మార్చి 23, 1931) భారత స్వాతంత్ర్య సమర, ఉద్యమకారుడు. ఇతను భగత్ సింగ్ మరియు రాజ్‌గురు ల సహచరునిగా ప్రసిధ్ధి.  
హరి శివరాం రాజ్ గురు (ఆగష్టు 241908 - మార్చి 231931) భారత స్వాతంత్ర ఉద్యమ, ఉద్యమకారుడు. మహారాష్ట్ర లోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. ఇతను భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల సహచరునిగా ప్రసిధ్ధి. 
జె. పి. సండర్ 
1928లో భారత్‌లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ సభ్యుడిగా ఒక్క భారతీయుడిని కూడా నియమించకపోవడంతో భారత రాజకీయ పార్టీలు దానిని బహిష్కరించాయి. ఫలితంగా దేశవ్యాప్తంగా పలు నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 30 అక్టోబరు 1928న కమిషన్ లాహోర్‌‌ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాలా లజ్‌పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు.1 సెప్టెం, 2011 - 1929లో లాహోర్‌లో జరిగిన ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న 64 ఏళ్ల వృద్ధుడు లాలా లజపతిరాయ్‌పై సాండర్స్ అనే బ్రిటిష్ అధికారి పాశవికంగా లాఠీచార్జి  చేసారు  దాంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హతమార్చడానికి విప్లవకారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్ మరియ సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. స్కాట్‌ను గుర్తించిన జై పాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ J. P. సాండర్స్కనిపించినప్పుడు సింగ్‌కు జై పాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. దాంతో పోలీసుల కంట పడకుండా ఉండటానికి భగత్ లాహోర్‌ పారిపోయాడు. గుర్తు పట్టకుండా ఉండటానికి గడ్డాన్ని గీసుకోవడం, వెండ్రుకలు కత్తిరించుకోవడం ద్వారా సిక్కు మత విశ్వాసాల ఉల్లంఘనకు సింగ్ పాల్పడ్డాడు. 
1928 లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్ లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు గాను భారత స్వాతంత్ర్యోద్యమంలో కృషి చేసిన ఈ ముగ్గురు విప్లవకారులు (భగత్ సింగ్ , రాజ్ గురు, సుఖ్ దేవ్) లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 సమయానికి ఉరి తీశారు. అప్పటి నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరి శిక్ష అమలు జరపడం జరిగేది కాదు. వారి మృత దేహాలను రహస్యంగా, జైలు వెనుక గోడలు పగులగొట్టి తీసికొని వెళ్ళిసట్లెజ్ నది తీరాన హుస్సేన్‌వాలా అనే ఊరిలో దహనం చేశారు. మృత దేహాను చూసిన ప్రజలలో అలజడిని ఎదుర్కోకుండా ఇలా చేశారు.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)