Blogger Widgets

Thursday, December 21, 2017

పక్షులు కిలకిల రవములు వినబడుట లేదా

Thursday, December 21, 2017
నిన్న ఉత్తిష్ట అను చిన్న గోపికను మేలుకోల్పిరి. మరి నేడు.
వేద పఠనము కు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః  ఓమ్" అని ప్రారంభిస్తారు.  నిన్న గోపికలు మెల్కొలుపుట తో మన ధనుర్మాస వ్రతం ప్రారంభము అయ్యింది.  అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు.  పక్షులు శ్రీ గురుమూర్తులు.  అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి.  తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి. 
ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు కోసం చిత్ర ఫలితం
పాశురము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.


తాత్పర్యము:భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి.  ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి.  నీ చెవికి సోకటం లేదా ?  
ఓ నాయకురాలా!  అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు.  లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా?  నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు    తెరువవలేనని మేల్కొల్పుతున్నారు. 


విశేషార్ధము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు  పేశిన పేచ్చరవం కేట్టిలైయో:
కీచు కీచు మని అంతటను భరద్వాజ పక్షులు కలిసికొని పల్కుచున్న మాటల ధ్వని వినలేదా. అని గోపికలు,   తెల్లవారినది అని తెల్పుతున్నారు.  భరద్వాజ పక్షులు లేచి కీచు కీచు అనగానే ఆలోపాలి కాంత అది తెల్లవారుటకు గుర్తుగా అనుకోవటం లేదు.  తెల్లవారుటకు ముందు లేచి శబ్దము చేయుచున్నవని భావిస్తున్నది.
పేయ్ ప్పెణ్ణే:
పిచ్చిపిల్లా! అని అధిక్షేపించుచున్నారు.  భగవంతుని అనుభవించుటే ప్రదానమనుకొని వేరే భక్తులతో కలవకుండా ఏకాంతముగా అనుభవించుట పిచ్చితనమే.  అంటే ఏమిచెయ్యాలో తెలియకపోవుట.  వెనుక పాశురములో 'పిళ్ళాయ్' ఓ పిల్లా అన్నారు  ఆమెకి ఈ వ్రతము కొత్త అవటంవల్ల.  ఇక్కడ ఈమెను 'పెణ్' అంటే స్త్రీ అంటున్నారు అంటే భగవద్ అనుబవము కల స్త్రీ నే కానీ పిచ్చిది. అంటే భగవదానుభావం ఎలాపొందాలో తెలియనిది.  తాను ఒక్కతే కాక పదిమంది తో కలసి అనుభవించుట వివకము.  ఆ వివేకము లేనితనము పిచ్చితనమే అని వారి భావము.  లోపల ఉన్నామె పక్షులు కిలకిల లు తెల్లవారుట కాదు.  మీరే పిచ్చివారు తెల్లారింది అనుకుంటునారు అన్నది.
అప్పుడు బయటి గోపికలు వేరొక గుర్తు చెబుతున్నారు.
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు :
మెడలోని తాళిబొట్టు అచ్చుబొట్టు గలగల మనుచున్నవి చేతులూపుచూ, తలలోని పూలు జారుటచే మంచి సువాసన కల కేశపాశము కల గోపయువతులు, కవ్వముతో చిలుకుచుండగా బయల్వేడిన పెరుగు శబ్దము వినలేదా?  అని అడుగుతున్నారు.
శ్రీ కృష్ణుడు పుట్టిన తరువాత వ్రేపల్లెలో పాడి ఎక్కువైనది. గోపవనితలు పొద్దున్నే లేచి మంచిగా తయ్యారు అయ్యి పెరుగు చిలుకుతారు.  పెరుగును కవ్వముతో త్రిప్పుట వాళ్ళ వారి నగలు శబ్దము చాలా వస్తోంది.  కవ్వము త్రిప్పి త్రిప్పి అలసిపోవుట కొప్పువీడినది.  వారు చిలుకుతున్నప్పుడు క్షీరసాగరమదనము గురించి చెప్పుకుంటున్నారు అడినీవు వినలేదా అంటున్నారు.  గోపికలు పెరుగు చిలుకుతున్నప్పుడు పాట పాడుతున్నారు, వారి ఆభరణాల ధ్వని, చిలికే పెరుగు శబ్దము మూడు ధ్వనులు వినబడుతున్నాయి.  
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్!:
నాయకురాలా! అని సంభోదిస్తున్నారు.  నీ అనుభవము మాకూ కూడా పంచుటకు తగినదానావు.  ఏకాంతాముగా అనుభావిస్తున్నావు అది తగదు.  పిచ్చిపిల్లా! అని సంభోదించుటకు నాయకురాలా! అని సంభోదించుటకు భావములో తేడాలేదు.  మమ్ములను నీవు ముందు వుంది నడిపించు.  శ్రీ కృష్ణుని చేర్చగల నీవు ఇలా ఉండకూడదని భావం.
నారాయణన్ మూర్త్తి కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో:
ఇక భగవద్గుణములను కీర్తించి ఆమెను వెలుపలికి తీసుకొని రావలెను అని భావించి, ముందుగా పరమాత్మ వాత్సల్యమును సూచించు 'నారాయణన్' నారాయణుని కీర్తించినారు. ఇలా నారాయణుని కీర్తించుట నీకు వినబడుటలేదా?  మూర్తి -కేవలము అంతర్యామి అయినటువంటి వాడు మనకోసం కనిపించుట వీలుగా చర్మ చక్షువులు దాల్చిన సులభుడు. అంతే కాదు మనలను శత్రువుల నుండి, తన శ్రమను కూడా లక్ష్యము చేయని కేసవుని చూడగలము. అతనికి మంగళము పాడెదము.  అయన గుణాలు విని లేవకుండా ఎలా పండుకొంటివి అమ్మా!
ఇలా చెప్పి ద్వారా రంద్రములలో నుండి బయటికి ప్రసరించు తేజస్సు చూసి.
తేశం ఉడైయాయ్!:
తేజశ్సాలినీ! అని సంబోదిస్తున్నారు.  పిచ్చిపిల్లా, నాయకురాలా! తేజశ్సాలినీ! అని మూడు విధాల పిలిచారు.  భగవద్ అనుభవం కల్గి భ్రహ్మ తేజస్సు నీలో కనిపిసూవుండగా లేదనుట తగదు.  ఆ అనుభవం నీవు ఒక్కదానివే అనుభావిస్తున్నావ్ అలా తగదమ్మా! ఏమ్మమ్మా! పిచ్చా అని వీరడుగుతున్నారు.
తిఱ:
తలుపు తెరువుము.  నీ తేజస్సు ను చూచి మేమందరం కూడా అనుభవించునట్లు తలుపు తెరువు అని అభ్యర్దిస్తున్నారు. భగవదానుభావం అందరితో పంచుకుంటే వృద్ది చెందుతుంది అని చెప్పుచున్నారు.
ఇలా రెండవ గోపవనితను కూడా నిదుర మేల్కొల్పినారు గోపికలు.
జై శ్రీ మన్నారాయణ్

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers