Blogger Widgets

Sunday, February 04, 2018

రామచరిత మానస, 12, భగవదనుగ్రహము

Sunday, February 04, 2018

దో - జడ చేతన గున దోషమయ , బిస్వ కీన్హ కరతార |
        సంత హంస గున గుహహిC పయ , పరిహరి బారి బికార || 6 ||
భగవంతుడు చేతనాచేతనరూపమైన విశ్వాసమునందు మంచిచెడులను  సృష్టించెను.  హంస పాలను గ్రహించి నీటిని వదలినట్లే సాధువులు గుణములను గ్రహించి , దోషములను దూరముగా పరిహరించెదరు. 

చౌ - అస బిబేక జబ దేఇ బిదాతా | తబ తజి దోష గునహిC మను రాతా ||
        కాల సుబాఉ కరమ బరిఆఈC |  భలెఉ ప్రకృతి బస చుకఇ భలాఈC || 1  ||
        సో సుధారి హరిజన జిమి లేహిC |  దలి దుఖ దోష బిమల జసు దేహీC||
        ఖలఉ కరహిC భల పాఇ సుసంగూ | మిటఇ న మలిన సుభాఉ అభంగూ || 2 ||
        లఖి సుభేష జగ బంచక జేఊ | బేష ప్రతాప పూజిఅహిC తేఊ ||
        ఉఘరహిC అంత న హోఇ నిబాహూ |  కాలనేమి జిమి రావన రాహూ || 3 ||
        కిఎహుC కుబేషు సాధు సనమానూ | జిమి జగ జామవంత  హనుమానూ ||
        హాని కుసంగ సుసంగతి లాహూ | లోకహుC బేద బిదిత సబ కాహూ || 4 ||
        గగన చఢఇ రజ పవన ప్రసంగా | కీచహిC  మిలఇ నీచ జల సంగా  ||
        సాధు అసాధు సదన సుక సారీC| సుమిరహిC రామ దేహిC గని గారీC||  5  ||
        ధుమ కుసంగతి కారిఖ హోఈ |  లిఖిఅ పురాన మంజు మసి సోఈ ||
         సోఇ జల అనల అనిల సంఘాతా | హోఇ జలద జగ జీవన దాతా ||   6  ||

భగవదనుగ్రహమున విచక్షణాశక్తిని కల్గివున్నవారు చెడును విసర్జించి,  మంచిని మాత్రమే గ్రహించుదురు.  ఒక్కొక్కప్పుడు మంచివారుసైతము మాయామోహితులై కాలము , స్వభావము , కర్మల ప్రభావముచే సన్మార్గము నుండి వైదొలుగుదురు.  భగవద్బాక్తులు ఈ పొరపాటును తెలుసుకుని , వాటిని సవరించుకొందురు.  దుఃఖదోషములును అధిగమించి నిర్మలమైనయాశమును  పొందుదురు .  అలాగే దుష్టులుగూడ ఒక్కొక్కసారి సత్సాంగత్యప్రభావమున సత్కర్మలను ఆచరింతురు .  కానీ వారి దుష్టస్వభావములు మాత్రము మారవు .  కపట వేషధారులైన ధూర్తులు మొదట గౌరవింపబడినను కాలక్రమమున వారివారి నిజస్వరూపము బట్టబయలగును .  కాలనేమి , రావణుడు , రాహువు మొదలుగు వారివృత్తాంతములు ఇందుకు ప్రబల నిదర్శనము .  సజ్జనుల , రూపములు, వేషములు ఎట్లనన్న వారు హనుమద్జాంబవతాదులువాలె అందరిచే గౌరవింపబడుదురు .  దుష్టసహవాసము ప్రమాదకరం .  సజ్జనమైత్రి వరప్రసాదం .  ఇది లోకవిదితము , వేదప్రామాణికము . వాయు సాంగత్యమున పైకెగురు ధూళి ఉన్నతస్థితికి చేరును.  అదియే పతనోన్ముఖంగా సాగిపోవు నీటితో కూడినప్పుడు బురదై అధోగతిపాలగును .  సజ్జనులఇండ్లలో పెరిగిన చిలుకలు , గోర్వంకలు , రామనామము జపించును .  దుర్జనుల ఇండ్లలోని చిలుకలు దుర్భాషలాడును .  పొగ మాలినములతో కల్సినచొ నల్లబారును .  కానీ సిరాగా మారినచో పవిత్ర పురాణములును వ్రాయవచ్చును .  ఆ పోగయే- నీరు , అగ్ని , గాలితో కలిసి , మేఘముగా , మారినపుడు , వర్షజలముల ద్వార జీవులకు ప్రాణదాత యగును.  

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers