Blogger Widgets

Monday, February 05, 2018

రామచరిత మానస, 13, సమస్త ప్రాణకోటికి ప్రణమిల్లుదును .

Monday, February 05, 2018

దో - గ్రహ భేషజ జల పవన పట , పాఇ కుజోగ సుజోగ  |
       హోహిC కుబస్తు సుబస్తు జగ , లఖహిC సులచ్ఛన లోగ || 7 క ||
        సమ ప్రకాస తమ పాఖ దుహుC , నామ భేద బిధి కీన్హ |
        ససి సోషక పోషక సముఝీ, జగ జస అపజస దీన్హ || 7 ఖ ||
        జడ చేతన జగ జీవ జత , సకల రామమయ జాని |
        బందఉC సబకే పద కమల , సదా జోరి జుగ పాని  || 7 గ ||
        దేవ దనుజ నర నాగ ఖగ , ప్రేత పితర గంధర్బ |
        బందఉC  కిన్నెర రజనిచర, కృపా కరహు అబ సర్బ  || 7 ఘ  ||
గ్రహములు, ఔషధులు, జలములు , వాయువు, వస్త్రములు ఇవి అన్నియును వాటి వాటి సహచర్యములను బట్టి మంచి , లేక చెడుగా భావింపబడుచుండును.  విజ్ఞులైన వారు ఈ లోకసత్యములను ఎఱుంగ గలరు.  శుక్ల , కృష్ణపక్షములయందు వెన్నెల , చీకటి సమంగానే వుండును. కానీ విధాత వాటికి వేరువేరు పేర్లును పెట్టెను .  లోకము చంద్రునికళలవృద్ధికి తోట్పడు శుక్లపక్షమును ప్రకాశించును .  క్షీణదశకు ఆకరమగు కృష్ణపక్షమును  ఏవగించుకొనును .  విశ్వమునందలి చేతనాచేతన పదార్ధములన్నియును శ్రీరామమయములు .  కావున నేను వాటిచరణకమలములకు చేతులుజోడించి మ్రొక్కెదను .  దేవతలు, దైత్యులు, మానవులు, నాగులు, పక్షులు, ప్రేతలు, పితరులు, గంధర్వ, కిన్నెర, రాక్షసులు మొదలుగు సమస్త ప్రాణకోటికి ప్రణమిల్లుదును .  తదనుగ్రహము నాకు లభించుగాక.        

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers