Blogger Widgets

Monday, February 12, 2018

రామచరిత మానస, 20 శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి గుణగానమొనర్చెదను .

Monday, February 12, 2018

దో - సారద సేస మహేస బిధి , ఆగమ నిగమ పురాన |
        నేతి నేతి కహి జాసు గున , కరహిC నిరంతర గాన || 12 ||
వాగ్దేవియు , శేషుడు , పరమశివుడు పరమేష్ఠియు , వేదశాస్త్రపురాణములు శ్రీరామచంద్రుని గుణములను నిరంతరము గానముచేయుచు పూర్తిగా వర్ణింపబడును, కానీ అతని అనంతగుణములను వర్ణింపజాలక నేతి నేతి ( న + ఇతి , న + ఇతి ) అనుచు గానము చేయుచుండెను .  
చౌ - సబ జానత ప్రభు ప్రభుతా సోఈ | తదపి కహేC బిను రహా న కోఈ ||
తహాC భేద అస కారన రాఖా | భజన ప్రభాఉ భాCతి బహు భాషా || 1 ||
ఏక అనీహ అరూప అనామా | అజ సచ్చితానంద పర ధామా ||
బ్యాపక బిస్వరూప భగవానా | తెహిC ధరి దేహ చరిత కృత నానా || 2 ||
సో కేవల భగతన హిత లాగీ | పరమ కృపాల ప్రనత అనురాగీ ||
జెహి జన పర మమతా అతి ఛోహో | జెహిC కరునా కరి కీన్హీన కోహూ || 3 ||
గఈ బహోర గరీబ నెవాజూ | సరల సబల సాహీబ రాఘురాజు ||
బుధ బరనహిC హరి జస అస జానీ | కరహిC పునీత సుఫల నిజ బానీ || 4 ||
తెహిC బల మైC రఘుపతి గున గాథా | కహిహఉC  నాఇ రామ పద మాధా ||
మునిస్హ ప్రథమ హరి కీరతి గాఇ | తెహిC మగ చలత సుగమ మొహి భాఈ || 5 ||
శ్రీరాముని వైభవమును వర్ణింపనలవికానిదని ఎఱింగియు ఎవ్వరును వర్ణించుట మానలేదు  ఆయనభజనప్రభావమును వేదములు అనేకవిధములుగా తెల్సినవి .  ఏ కొద్దిపాటి గుణగానమైనను మానవులను భవసాగరమునుండి తరింపచేయును .  పరమేశ్వరుడొక్కడే . అతడు నిష్కాముడు , నిరాకారుడు , జన్మనామములేనివాడు , సచ్చితానంద స్వరూపుడు , పరంధాముడు , విశ్వవ్యాప్తి , విశ్వరూపుడు . అయినను దివ్యశరీరము ధరించి , పెక్కుఅవతారము ద్వారా తనలీలలను ప్రకటించును .  భగవంతుడు పరామకృపాళువు, శరణాగతివత్సలుడు , కావున భక్త సంరక్షణమునకై వారి శ్రేయస్సుముకొరకై  తన ఈలీలలును ప్రదర్శించుచుండును .  తన కరుణాదృష్టిని అయాచితముగానే  భక్తులపై ఆయనకు కల కృపావాత్సల్యము అపారము .  ఒక్కోసారి కృపజూపినవారిపై ఎన్నడును ఆయన కోపగింపడు .  భక్తులు నష్టపోయినదానిని లభ్యమగునట్లు చేయును .  అనగా భక్తులయోగక్షేమములను వహించుచుండువాడతడే .  అతడు దీనబందువు , సరళస్వభావుడు ,  సర్వశక్తిమంతుడు , అందరికిప్రభువు .  దీనిని ఎరింగియే బుద్ధిమంతులు శ్రీహరియసమును కీర్తించుచు తమవాక్కులను పునీత మొనర్చుకొనుచు జీవితములను సఫలముచేసికొనుచుందురు .  ఈకారణమునే శ్రీరామునిపాదకమలములకు శిరసా ప్రణమిల్లి ,ఆయన గుణగానమొనర్చెదను .  పూర్వము వ్యాస వాల్మీకాది మహర్షులు , శ్రీహరివైభవములను వర్ణించిరి .  వారిమార్గమును అనుసరించుటయే నాకును సులభము.      

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers