Blogger Widgets

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

శనివారం, ఫిబ్రవరి 03, 2024

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

శనివారం, జనవరి 27, 2024

చిన్నకథ పెద్దనీతి Story Telling

శనివారం, జనవరి 27, 2024

శనివారం, జూన్ 12, 2021

ఇమ్యునిటీ బూస్టర్ బన్ (Immunity booster bun)

శనివారం, జూన్ 12, 2021

                      

నమస్కారం.అందరికీ డయాబెటిక్ చాలెంజర్ చానల్ కి స్వాగతం. వర్షాకాలం వచ్చింది కదండి. డయాబెటిక్ వారికి ఇమ్యునిటి తక్కువగా వుంటుంది కదండి. వారికి ఇమ్యునిటి పెంచుకోటంకోసం ఒక మంచి రిసిపి చెప్పానండి. అది ఇప్పటివరకు ఎవరైనా చేసారో లేదో నాకు తెలియదుకానీ. నేను స్వయంగా చేసాను. చాలా రుచిగా వుంది. మీరు కూడా చేసి రుచి చూడండి. మీ అభిప్రాయం నాతో పంచుకోండి మరి. Please watch my blog also http://laharicom.blogspot.com/ -~-~~-~~~-~~-~- Please watch: "(212) నిముషాలలో తయారుచేసుకునే సుపర్ వెజిటేబుల్ ఫ్రై........😋😋😋😋😋(Instant stirfry with vegetable) " https://www.youtube.com/watch?v=WXwzg...

బుధవారం, జనవరి 24, 2018

రామచరిత మానస

బుధవారం, జనవరి 24, 2018

ఈరోజు రధసప్తమి చాలా మంచి రోజు కదా ! అందుకే ఈరోజు నుండి కొంచెం కొంచెంగా రామచరిత మానస చదువుకుందాం అనిపించింది , నాతో పాటుగా మీకు కూడా అందిస్తున్నాను. ముందుగా మనం రామచరితమానస చదివేముందు. మనకు రామచరిత మానస ను మనకు అందించిన కవివరేణ్యులు గురించి తెలుసుకుందాం వారికి ముందుగా నమస్కారములు తెలుపుకుందాం.
గోస్వామి తులసీదాసు ఉత్తరప్రదేశ్‌ బాండా జిల్లా రాజ్‌ పూర్‌లో ఆత్మారాం దుబే మరియు హుల్సీ దేవి దంపతులకు జన్మించాడు. రామాయణాన్ని సంస్కృతంలో విరచించిన వాల్మీకి యొక్క అవతారమే తులసీదాసు అని అంటారు. భక్తి, కావ్య రచన, తాదాత్మ్యత, భాష వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు తులసీదాసు తన జీవితాన్ని రామభక్తికి అంకితం చేశాడు. గోస్వామి తులసీదాసు అవధ ప్రాంత కవి, తత్వవేత్త. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీప ప్రాంతాలను అప్పట్లో అవధ దేశంగా పిలిచేవారు. తులసీదాసు జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు.
రామచరిత మానస్:
వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరితమానస్‌గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని దశరథనందనుడైన శ్రీరాముని రాజ్య రాజధాని అయోధ్యలో చేపట్టాడు. గ్రంథం పూర్తికావటానికి రెండు సంవత్సరాల ఏడు నెలల సమయం పట్టింది. అయితే ఈ గ్రంథంలోని ఎక్కువ భాగం రచనను తులసీదాసు వారణాసిలో చేశాడు.ఆయన తదనంతరం వారణాసిలో "తులసీ ఘాట్" ఏర్పడింది. తులసీదాసు ఇతర రచనల్లో దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు. రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటివి ఉన్నాయి.
అవసాన సమయంలో ఆఖరికి వారణాశిలో స్థిరపడ్డాడు. అక్కడే క్రీ.శ.1623లో తన తనువు చాలించాడు. అభినవ వాల్మీకి, భక్తశిరోమణి అయిన తులసీదాస కవులకు నమస్కారములు.
ఈరోజు నుండి రామచరితమానస .................._/\_
సత్యం శివమ్ సుందరం శ్రీ గణేశాయనమః శ్రీ జానకీవల్లబో విజయతే శ్రీరామచరిత మానసము
ప్రధమ సోపానం
బాలకాండము
మంగళాచరణం
శ్లోకం: వర్ణానామర్ధసంఘానాం రసానాం ఛాందసామపి
మంగళానాం చ కర్తారౌ వందే వాణీవినాయకౌ||
భవానీశంకరౌ వందే శ్రద్దావిశ్వాసరూపిణౌ
యాభ్యామ్ వినా న పశ్యంతి సిద్ధాః స్వాంతఃస్థమీశ్వరమ్||

వందే బోధమయం నిత్యం గురుం శంకరరూపిణమ్
యమాశ్రితో హి వక్రో2పి చంద్రాః సర్వత్ర వంద్యతే||
సీతారామగుణగ్రామపుణ్యారణ్య విహారిణౌ
వందే విసుద్ధవిజ్ఞానౌ కవీశ్వరాకపీశ్వరౌ ||

ఉద్భవస్థితిసంహారకారిణీం క్లేశహారిణీం
సర్వశ్రేయస్కరీం సీతాం నతో౭హం రామవల్లబామ్ ||

|| స్వస్తి || _/\_

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)