Blogger Widgets

శుక్రవారం, జూన్ 29, 2012

తోలి ఏకాదశి

శుక్రవారం, జూన్ 29, 2012

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని  తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.

పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు.  ఆనాడు  ఉపవాస  తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.  విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు.  అదే తోలి ఏకాదశి.

సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.  ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు.  అందరికీ ఈ తోలి ఏకాదశి శుభాకాంక్షలు.

ఆదివారం, జూన్ 24, 2012

Catch me on Harivillu.

ఆదివారం, జూన్ 24, 2012


Hey friends catch me live today (Sunday) show

with your little RJ Sree Vaishnavi

from 9:30am to 11:00 am

only on RadioJoshLive

Masth Maza Masth Music :) 

My show Name is Harivillu

Fun with me

If you want to talk with me plz call these numbers  

Skype id: radiojoshlive

US: 914-214-7574

UK: 20-3286-9594

AUS: 28003-4546

Local Number: 040-4200-2003

Thank You Very Much.

శనివారం, జూన్ 23, 2012

Array Of Letters.

శనివారం, జూన్ 23, 2012


What is represented by this array of letters?
R       R
A
Y        Y

గురువారం, జూన్ 21, 2012

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు

గురువారం, జూన్ 21, 2012

ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.  సంగీతము అన్నది ఒక అద్భుతము.  ఈ సంగీతము అన్నది ప్రకృతి నుండి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. "పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః" అన్నారు పెద్దలు. కానీ పశువులకన్నా, శిశువుల కన్నా పక్షులకు గానం గురించి బాగా తెలుసు అని ప్రకృతి నిరూపిస్తోంది.   సంగీతముకు రాళ్ళు కరుగుతాయిట ,  పశువులు , పక్షులు, మరియు చిన్ని శిశువులు కూడా రెస్పాండ్ అవుతాయి అంటారు.  సంగీతానికి అంత మహత్యము వుందిట .  
భగవంతుడు కూడా సంగీత ప్రియుడు అని మనకు కూడా తెలుస్తుంది.  ఎలా అంటారా శివుని చేతిలో డమరుకము సంగీత సాదనం, కృష్ణుని చేతిలో మురళి,  నారద తుంబురుడులు సంగీత విద్వాంసులు, మరియు మనం చదువులు తల్లిగా పూజలు చేసే అమ్మ  సరస్వతిమాత చేతిలోని కచ్ఛపి (వీణ).  వీటిని బట్టి బాగావంతుడు కూడా సంగీతము అంటే ఇష్టం అని తెలుస్తోంది కదండీ.   
మనము నిత్యమూ వినే కోకిల అరుపులో వుంది సంగీతము.  పాటల పల్లకిలోన, చిగురాకు సవ్వడిలోన, నిరంతరము వసంతమే సంగీతము, గుప్పెడు గుండెలలోన , గుడిగంటల సందడిలోన ప్రతీక్షణం నిరంతరం స్వరార్చనే సంగీతము, వెన్నేలలో పొంగే గోదావరి సంగీతము.  ఎంత దూరమైనా చిరుగాలిలోన అనుబందం పెంచే రాగం సంగీతము.  ఇలాంటి సంగీతము గురించి చెప్పటం ఎవరి తరంకాదు.  ప్రపంచ  సంగీత దినోత్సవ శుభాకాంక్షలు.  ఈ పాట  నాకు చాలా నచ్చింది ఘంటసాల గారు పాడిన ఈ పాట  చూడండి. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)