Blogger Widgets

శనివారం, అక్టోబర్ 20, 2012

ఆరవరోజు దుర్గామాత

శనివారం, అక్టోబర్ 20, 2012

దుర్గామాత


నవరాత్రులలో అమ్మవారు ఈ రోజు దుర్గామాతగా మనకు దర్శనము ఇస్తారు. మహిషాసురుని వధించుటకు అమ్మ అష్టమి రోజు కాళీ మాత దుర్గాదేవిగా కనిపిస్తారు.ఈ దుర్గాఅవతారంలో అమ్మ మహిషాసురినితో భయంకరమైన యుద్దంచేస్తారు.ఈమె అరుణ వర్ణ వస్త్ర దారిఅయి సింహవాహనము కలిగి సర్వఅయుధ దారియై రాక్షసులనుండి మనలను రక్షించుటకు వున్నట్టు దర్శనము ఇస్తున్నది.
ఈమెకి ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షింతలు, ఎర్రని వస్త్రాలు , దనిమ్మ పండ్లు వంటివి సమర్పించి . అమ్మ కరుణ మనపై కురిపించుకోవచ్చు.

శ్రీ దుర్గ అష్టోత్తర శతనామ స్తోత్రం  

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 4 ||
దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||
కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||
ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||
నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||



నవదుర్గలలో ఆరవరోజు  కాత్యాయిని మాత. "కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును. 
కాత్యాయని దేవి మంత్రం:
చంద్రహాసోజ్వలకరా శార్దులపర వాహనా l 
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినిll 
ఈనాడు ఈమెకు కేసరి బాత్ నివేదన అర్పిస్తారు .

శుక్రవారం, అక్టోబర్ 19, 2012

ఐదవ రోజున సరస్వతి

శుక్రవారం, అక్టోబర్ 19, 2012

దసరా నవరాత్రులలో ఐదవ రోజున మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.

సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు.

సరస్వతీ వందన మంత్రం:
యా కుందేందు తుషార హార-ధవళా,
యా శుభ్ర-వస్త్రా'వ్రిత
యా వీణా-వర-దండ-మండితకర,
యా శ్వేత పద్మా'సన
యా బ్రహ్మా'చ్యుత శంకరః ప్రభ్రితిభిర్ దేవై-సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేష జాడ్యా-పహా.
తెలుగు లో అనువాదం: పద్మము, చంద్రుడు, ఉదయపు పుష్పాల వంటి తెలుపుదనం కలిగినది;
వీణని చేత ధరించి, తెల్లని పద్మాసనం మీద కూర్చున్నది;
బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులతోపాటు దేవతలందరితోను నిత్యం పూజించబడేది;
ఓ తల్లి నా మానసిక జడత్వాన్ని తొలగించు

శుక్లాం బ్రహ్మ విచార సార పరమ మద్యం జగద్వ్యాపిని,
హస్తే స్ఫతిక్ మాలికం కమలం పద్మాసనే సంస్తితం .
వందేతం పరమేశ్వరీ భగవతీ.....
సా మాం పాతు సరస్వతీ భగవతీ బుద్ధి ప్రదం శరదాం.

సరస్వతి మహామంత్రం 
కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.'


స్కందమాత స్తుతి

'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు
.

ఏ దయా మీ దయా మా మీద లేదా?

మా అమ్మమ్మ వాళ్ళు స్కూల్ కి వెళ్ళే రోజులలో వాళ్ళు మరియు ఉపాధ్యాయులు కలసి ఈ పండుగ రోజులలో  పిల్లలచేత రంగు రంగు కాగితాలు, రంగురంగు పువ్వులుతో  చుట్టిన విల్లంబులు చేయించి బాణం చివరిభాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకొని వెళుతూ! బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదువరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు.... అంటు పాటలు పాడిస్తూ వుండే వారు.  వారు ఇచ్చే చిరుకానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు. అలాంటి వేడుకలు ఇప్పుడు లేవు కదా! ప్చ్  :(  వుంటే బలేవుండేది. 

ఈ దసరా పండగ ఉత్సవాలలో నేటికి ఆచరించుచున్నది ఒకటి మాత్రం వుంది అది ఏమిటి అంటే అదే "శ్రీ రామ చంద్ర లీల ఉత్సవాలు" పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి "రాక్షస పీడ వదిలందని" భావిస్తూ బాణాసంచాలతో వారి బొమ్మలను తగుల పెడతారు.

మనకు ఎన్ని పండగలో కదా వాటిలో ఈ దసరా పండగ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది .  బలే సరదాక సంతోషంగా  వుంటుంది. ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే చాలా happy గా వుంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మాకు సెలవులు ఎక్కువగా వస్తాయి అందుకే.  మా అమ్మగారు వాళ్ళు ఈ దసరా పండగకి వాళ్ళ అమ్మమ్మా, ఊళ్ళకి వెళ్ళేవారట. అక్కడ ఆ ఊళ్ళల్లో దసరాలు బానే చేసేవారు. పొద్దున్నే, విల్లంబులు ధరించి దసరా పద్యాలు పాడుతూ ఉపాధ్యాయుల వెంట పిల్లలు హడావుడీ చేస్తే, పులి వేషాలు, పులి డాన్సు, హరికధలు, బుర్రకధలు, కోలాటాలతో సాయంత్రము వరకు చాలా బాగా జరిగేవిట. అలాంటి పండగ విధానం మా అమ్మకూడా చూసింది నేనే చూడలేకపోయాను.  ఎందుకంటే అలాంటివి ఇప్పుడు లేవుకదా.  అవి విన్టువుంటే బలే అనిపిస్తోంది నాకు.  మనకు దసరా సందడే తెలియదు మరి.  ఇక అప్పటి రోజుల్లో పిల్లలు పాడిన దసరా పద్యాలు మరియు  పాటలు అమ్మమ్మ నాకు రాసి ఇచ్చింది అవి మీకు కూడా share చేస్తాను చూడండి.   మీకు నాలా తెలియకపోతే తెలుసుకోండి.  ఒకవేళ మీకు తెలుసా ఒకసారి ఆ రోజులు ను ఒకసారి గుర్తు చేసుకొని.  అప్పటి మీ అనుభవాలు నాపోస్ట్ లో కామెంట్ రూపంలో బ్లాగ్ మిత్రులతో షేర్ చేయండి. 

దసరా పద్య మరియు పాటలు.

అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
 
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
చేతిలో లేదనక, ఇవ్వలేమనక
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!
 
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా
 “అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” . అని పాటలు  పాడుకుంటూ బడి పిల్లలు వాళ్ళ ఉపాద్యాయులతో వారి ఇంటికి వెళ్లి పద్యాలూ పాటలు పాడేవారు.  అప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వారికి  పప్పు బెల్లాలు, మరమరాలు కలిపి ఇచ్చేవారు.   కొందరు వారికి గిఫ్ట్స్, బుక్స్ మొదలగున్నవి ఇచ్చేవారట.  ఈ పండగను  పూర్వం స్కూల్ పిల్లలు బాగా చేసుకున్నారు కదా .  నేను కూడా అప్పుడు పుట్టివుంటే ఎంతబాగుండునో అనిపిస్తోంది.  మీకు కూడా అనిపిస్తోందా! లేదా !.



గురువారం, అక్టోబర్ 18, 2012

నాల్గవరోజు శ్రీ మహాలక్ష్మి దేవి

గురువారం, అక్టోబర్ 18, 2012


శ్రీ మహాలక్ష్మి దేవి: దసరా నవరాత్రులలో నాల్గవరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ.  సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.

శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్


 
నమస్తేతు మహామాయే శ్రీపీఠే సురపూజితే
శంకచక్ర గదా హస్తే మహలక్ష్మి నమోస్తుతే

నమస్తే గరుడారూడే డోలా సురభయంకరి
సర్వపాపహరే దేవి మహలక్ష్మి నమోస్తుతే

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్టభయంకరి
సర్వదుఖహరే దేవి మహలక్ష్మి నమోస్తుతే

సిద్ధిబుద్ధిప్రదేదేవి భక్తిముక్తి ప్రదాయిని
మంత్రమూర్తే సదా దేవి మహలక్ష్మి నమోస్తుతే

ఆద్యంతరహితే దేవి అదిలక్ష్మి మహేశ్వరీ
యోగజ్ఞే యోగసంభూతే మహలక్ష్మి నమోస్తుతే

స్తూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే
మహాపాపహరే దేవి మహలక్ష్మి నమోస్తుతే

పాశాంకుశధరే దేవి పరబ్రహ్మస్వరూపిణి
పరమేశి జగన్మాత మహలక్ష్మి నమోస్తుతే

శ్వేతాంభరధరే దేవి నానాలంకారభూషితే
జగస్తితే జగన్మాతః మహలక్ష్మి నమోస్తుతే

మహలక్ష్మష్టకం స్తోత్రం యఃపఠే భక్తిమాన్నరః
సర్వసిద్ది మవాప్నోప్తి రాజ్యం ప్రాప్నోప్తి సర్వదా

ఏకకాలే పఠేనిత్యం మహాపాప వినాశనం
ద్వికాలం యఃపఠేనిత్యం ధనధాన్యం సమన్వితం
త్రికాలం యఃపఠేనిత్యం మహాశత్రు వినాశనం
మహాలక్ష్మిర్భవేనిత్యం ప్రపన్నా మమ సర్వదా
ఇతి ఇంద్రకృత శ్రీమహాలక్ష్మ్యష్టకం సంపూర్ణం  

కూష్మాంఢ : నాలుగవ రోజు నవదుర్గలలో కూష్మాండమాతగా  అలంకరిస్తారు. ఈమె మంచిగా దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.  'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.  భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును.
 
కూష్మాంఢ దేవి స్తుతి: 

సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ
 ఈ రోజు అమ్మవారికి చేసే అన్నం ప్రసాదాన్ని నూనెతో కాక నేతితో పోపు పెట్టి నేతి అన్నం నైవేద్యం పెడతారు .




My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)