Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 04, 2012

కార్తీక పురాణం 21వ రోజు

మంగళవారం, డిసెంబర్ 04, 2012

పురంజయుడు కార్తీక ప్రభావము నెరు౦గుట
ఈవిధముగా యుద్దమునకు సిద్దమైవచ్చిన పురంజయునకు, కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ద జరిగింది. ఆ యుద్దములో రధికుడు రధికునితోను, అశ్వసైనికుడు అశ్వ సైనికునితోను, గజ సైనికుడు గజ సైనికునితోను, పదాతులు పదాతి సైనికులతోను, మల్లులు, మల్ల యుద్ద నిపుణులతోను ఖడ్గ, గద, బాణ, పరశువు మొదలగు ఆయుధాలు ధరించి, ఒండొరులడీకొనుచు హుంకరించుకొనుచు, సింహనాదములు చేసికొనుచు, శూరత్వవీరత్వములను జూపుకోనుచు, భేరీ దుందుభులు వాయించుకొనుచు, శంఖములను పురించుకొనుచు, ఉభయ సైన్యములును విజయకంక్షులై పోరాడిరి. ఆ రణభూమి నెందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొ౦డెములు, తొండలు, తలలు, చేతులు, - హాహా కారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలె పడియున్న ఏనుగుల, గుఱ్ఱముల కళేబరాల దృశ్యములే ఆ మహా యుద్దమును వీరత్వముజూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్దము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలురసైన్యము చాలా నష్టమై పోయెను. అయినను, మూడు అక్షౌహిణులున్న పురంజయుని సైన్యము నెల్ల అతిసాహసముతో, పట్టుదలతో ఓడించినది. పెద్దసైన్యమునన్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గ మున శత్రువుల కంట పడకుండా తన గృహానికి పారి పోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దు:ఖించుచుండెను ఆసమయములో వశిష్టులు వచ్చి పురంజయుని ఊరడించి "రాజా! మున్నొక సారి నీవద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చెస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైననూ సన్మార్గుడవయి వుండుమని హెచ్చరించితిని. అప్పుడు నామాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తునుడ వైవున్నందుననే యీయుద్దమును ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించితిని. ఇప్పటికైనా నామాటలాలకింపుము. జయాపజయాలు దైవాదానములని యెఱ్ఱి ౦గియు, నీవు చింతతో కృంగిపోవుటయేల? శత్రురాజులను యుద్దములో జయించి, నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపుకలదేవి, నాహితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన, స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి, భగవన్నామస్మరణమును చేయుచు నాట్యము చేయుము. ఇట్లోనర్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతియేగాదు, శ్రీమన్నారాయణుని సేవించుటవలన శ్రీ హరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువలను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక, రేపు అట్లు చేసిన యెడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్టసహవాసము చేయుట చేతగదానికి అపజయము కలిగినది? గానలెమ్ము. శ్రీహరి నీమదిలో దలచి నేను తెలియజేసినటులచెయు" మని హితోపదేశము చేసెను.


శ్లో// అపవిత్ర: పవిత్ర వానానావ స్దాన్గతోపివా
య: స్మరేతుడరీకాక్షం స బాహ్యాభంతరశుచి||

సోమవారం, డిసెంబర్ 03, 2012

కార్తీక పురాణం 20వ రోజు

సోమవారం, డిసెంబర్ 03, 2012

పురంజయుడు దురాచారుడాగుట:
జనక మహారాజు, చతుర్మాస్య వ్రతప్రభావము వినిన పిమ్మట వశిష్టునితో " గురువర్యా! కార్తీకమాస మహాత్మ్యమును యింకను వినవలయునునెడి కోరిక కల్గుచున్నది. ఈ వ్రత మహాత్మ్యమునందింకను విశేషములు గలవా! యను సంశయము గూడా కలుగుచున్నది. ఐనా సంశయ నివారణ కొరకు మరిన్ని వుదాహరణలు వినిపించి నన్ను కృతార్దునిగాజేయు" డనెను. అ మాటలకు వశిష్టులవారు మందహాసముతో " ఓ రాజా! కార్తీకమాస మహాత్మ్యము గురించి అగస్త్యమహాముని, అత్రిమునికి జరిగిన ప్రసంగ మొకటి కలదు. దానిని వివరించెదరు ఆలకించు" మని అ కథా విధానమును యిట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి" ఓ అత్రిమహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమహాత్మ్యమును నీకు ఆ ములాగ్రమున తెలియును, కాన దానిని నాకు వివరింపుము" అని కోరెను. అంత "ఓ అత్రి మహామునీ! నీవు విష్ణువు అంశయందు బుట్టినావు. కార్తీకమాస మహాత్మ్యము నీకు ఆ మూలాగ్రముగా తెలియును, కాన దానిని నాకు వివరింపుము " అని కోరెను. అంత అత్రిమహముని "కుంభసంభవా! నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రితికరముగుటచే నుత్తమమయినది. కార్తీకమాసముతో సమానముగ మాసము. వేదముతో సమానమగు శాస్త్రము. ఆరోగ్యసంపదకు సాటియగు సంపదలేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటెవేరు దేవుడులేడు. ఏ మానవుడైనను కార్తీకమాసమును నదిలో స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందుకొక యితిహాసము వినుము. త్రేతాయుగామును పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్యానగరమును రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివిపట్టభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి యాపదలు రాకుండ పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశచేతను, రాజ్యాధికార గర్వముచెతను జ్ఞానహినుడై దుష్ట బుద్ది గలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహణ మాన్యములు లాగుకొని, పరమలోభియై, చొరులను జేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగమువాటా తీసికోనుచు ప్రజలను భితావహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్య ములు నలుదిక్కులా వ్యాపించెను. ఈవార్త కాంభోజరాజును నాయకునిగా చేసుకోని రధ, గజ, తురగ, పదాతి సైన్య బలా న్వితులైర హస్యమార్గము వెంటవచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్భ౦ధముచేసి యుద్దమునకు సిద్దపడిరి.
అయోధ్యా నగరమును ముట్టడి౦చిన సంగతిని చారులవలన తెలిసికోనిన పురంజయుడు తానుకూడా సర్వ సన్నద్దుడై యుండెను. అయినను యెదుటిపక్షము వారధి కబలాన్వితులుగా నుండుటయితాను బలహినుడుగా నుండుటయు విచారించియే మాత్రము భితిచెందక శాస్త్రసమన్విత మైన రథమెక్కి సైన్యాధపతులను పూరికొల్పి, చతురంగబల సమేతమైన సైన్యముతో యుద్ద సన్నద్దుడైన వారిని యెదుర్కొన భేరి మ్రోగించి, సింహనాదము గావించుచు మేఘములు గర్జించునట్లు హు౦కరించి శత్రు సైన్యములు పైబడెను.

ఆదివారం, డిసెంబర్ 02, 2012

కార్తీక పురాణం 19వ రోజు

ఆదివారం, డిసెంబర్ 02, 2012

చతుర్మా స్య వ్రత ప్రభావ నిరూపణ 
ఈ విధముగా నైమిశారణ్య మందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞాన సిద్దుడను ఒక మహా యోగి " ఓ దీనబాంధవా! వేదవేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వి తీయుడవని, సూర్య చంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, సర్వ౦తర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింప బడు వాడవని, నిత్యుదవని, నిరాకారుడవని సర్వజనుల చే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నికివేమా హృదయ పూర్వక నమస్కారములు సకల ప్రాణి కోటికి ఆధారభూతుడవగు ఓ నంద నందా! మా స్వాగతమును స్వికరింపుము. నీ దర్శన బాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైన వి. ఓ దయామయా! మే మి సంసారబందము నుండి బైటపడలే కుంటి మి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్న నీ దివ్య దర్శనముబడ యజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషికేశా!నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి " జ్ఞాన సిద్దా! నీసోత్ర వచనమునకు నేనెంత యు సంత సించితిని. నీకిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞాన సిద్దుడు " ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగ వలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీపాద పద్మముల పైనా ధ్యానముండుట నటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కర లేదు " అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు " ఓ జ్ఞాన సిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొకవారము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈలోక మందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మి దేవి సహితముగా పాలసముద్ర మున శేషశయ్య పై పవళింతును.  తిరిగి కార్తీక మాసమున శుద్ద ద్వాద శివరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రితికరము. ఈ వ్రతముచేయు వారాలకు సకల పాపములు నశించి, నా సన్నీధకి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చెయనివారు నరకకూపమునుబడుదురు. ఇతరులచేత కూడా ఆచరింపచేయవలయును. దీని మహాత్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసిన వారి కి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు భాధలుండవు. దినికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణ శుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జిoచవలయును. నాయందు భక్తీ గలవారిని పరీక్షించుటకై నే నిట్లు నిద్రవ్యజమున శయనింతును. ఇప్పుడు నీవోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్త శ్రద్దలతో పరించిన వారు నాసన్నీధకి నిశ్చయముగా వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధంచి శ్రీమహాలక్ష్మితో గూడి పాలాసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళిoచెను. వశిష్టుడు జనక మహారాజుతో " రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్దా మొదలగు మునులకు చాతుర్యస్యవ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వ్రత్తంతమును అంగీరసుడు ధనలోభనకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషభేదముల లేదు, అన్ని జాతులవరును చేయవచ్చును. శ్రీ మన్నారయునని ఉపదేశము ప్రకారము ముని పుంగవు లందరూ యీ చాతుర్యాస్యవ్రత ఆచరించి దన్యులై వైకుంఠమున కరిగిరి.

శనివారం, డిసెంబర్ 01, 2012

కార్తీక పురాణం 18వ రోజు

శనివారం, డిసెంబర్ 01, 2012

" ఓ ముని చంద్రా! మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తిరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడ నైతిని. తండ్రి- గురువు-అన్న-దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితా ము వలెనే కదా మీబోటి పుణ్య పురుషుల సాంగథ్యము తటి స్థిం చేను. లేనిచో నెను మహా పాపినయి మహా రణ్య ములో ఒక మొద్దు బారిన చెట్టు ని యుండగా, తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీ కారణ్యములో తర తరాలుగా చెట్టు రూపమున  వుండవలసినదే  కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూనా ఫల ప్రదయియగు యీ కార్తీక మాస మెక్కడ! నాకు పాపత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించు టెక్కడ? యివి యన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మనవుడెట్లు అను సరించ వలయునో, దాని ఫల మెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.
" ఓ ధనలోభా! నీడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధ మైనట్టివి కాన, వివరించెదను శ్రద్దగా అలకిన్పుము ప్రతి మనుజుడు ఆ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞాన శున్యుడగు చున్నాడు. ఈ భేదము శరీరమునాకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్మర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించు చున్నవి. సత్కర్మ  నాచరించి వాటి ఫలము పరమేశ్వ రార్పిత మనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతి వాడో, ఎటువంతి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణో దయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధ మగుఉన్. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించు చుండగాను విషక మాసములో సూర్యుడు మేష రాశిలో ప్రవేశించు చుండగాను, మాఘ మాసములో సూర్యుడు మకర రాశి యందుండ గాను అనగా ణి మూడు మాసముల యంద యిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము  చేయవలెను. అతుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్య చంద్రా గ్రహణ సమయములండును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతః  కాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్య సమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మ బ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించ రించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమన తీ ర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేదని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంట మునకు పోవుదురు." అని అంగీరసుడు చెప్పగా విని మరల ధన లోభు దితుల ప్రశ్నించెను.
ఓ ముని శ్రేష్టా! చతుర్మా స్య వ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత డని నాచరించ వలెను? ఇది వర కెవ్వ యిన ణి వ్రతమును ఆచరించి యున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి?  విధానమేట్టిది? సవిస్తర౦గా విశదికరింపు'డని కోరెను. అందులకు అంగీ రసుడి టుల చెప్పెను.
" ఓయీ! వినుము చతుర్మా స్య వ్రతమనగా సతి మహా విష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పల సముద్రమున శేషుని పాన్పు పై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును. ఆ నలుగు మాసములకే చతుర్మా స్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి' శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థాన ఏకాదశి ' అనియు, ఏ వ్రతమునకు, చతుర్మా స్య వ్రాతమనియు పేరు ఈ నలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన,  దన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పుణ్య ఫలము కలుగును. ఈ సంగతి శ్రీ మహా విష్ణువు వలన తెలిసి కొంటిని  కాన,  ఆ సంగతులు నీకు తెలియచేయు చున్నాను".
తొల్లికృత యుగంబున వైకుంట మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింప బడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్షి దేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి అడ్మ నేత్రు౦ డను, చతు ర్బాహు౦ డును, కోటి సూర్య ప్రకాశ మాముండును అగు శ్రీ మన్నారాయ ణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడి యుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏవి ఏమియు తెలియ నివాని వలె మంద హాసముతో నిట్లనెను." నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారి వైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్క ర్మా నుష్టా నములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? ప్రపంచమున నే అరిష్ట ములు లేక యున్నవి కదా? ' అని కుశల ప్రశ్న లడిగెను. అంత నారదుడు శ్రీ హరికీ అది లక్ష్మి కీ నమస్కరించి " ఓ దేవా! ఈ జగంబున ని  వేరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపు మనుటచే విన్నవించు చుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు- మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తు లగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడ దనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తి గాక మునుపే  మధ్యలో మని వేయుచున్నారు. కొందరు సదచారులుగా, మరి కొందరు అహంకార సాహితులుగా, పర నిండా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యత్ముల నొనర్చి  రక్షింపు'మని ప్రార్ధించెను. జగన్నా టక సూత్ర ధారు డ యిన శ్రీ మన్నారాయణుడు కలవార పది లక్ష్మి దేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణా రూపంతో ఒంటరిగా తిరుగు  చుండెను. ప్రపంచ మంటను తన దయా వ లోకమున వీక్షించి రక్షించు చున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించు చుండెను. పుణ్య నదులు, పుణ్య శ్రమములు తిరుగు చుండెను. ఆ విధముగా తిరుగు చున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యె గ తాళి చేయు చుండిరి. కొందరు " యీ ముసలి వానితో మనకేమి పని" యని ఊరకు౦డిరి కొందరు గర్విష్టులైరి మరి కొందరు కమార్తులై శ్రీ హరిణి కన్నేతి యైనను చుడకుండిరి. విరందిరిని భక్త వత్స లుడగు శ్రీ హరి గాంచి " విరి నేతలు తరింప జెతునా? " యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణా రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలా ద్యలం కార యుతుడై నిజ రూపమును ధరించి, లక్ష్మి దేవితో డను, భక్తులతో డను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్య మునకు వెడలెను. ఆ వనమందు తపస్తు చేసుకోను చున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరు దెం చిన  సచ్చిదానంద స్వరుపుడగు శ్రీ మన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మి నారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.

శ్లో|| శాంత కారం! భజగా శయనం ! పద్మ నాభం! సురేశం!
విశ్వా కారం! గగన సదృశం ! మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మి కాంతం ! కమల నయనం! యోగి హృద్ద్యాన గమ్యం!
వందే విష్ణు! భవ భయ హారం! సర్వ లోకైక నాథం||

శ్లో|| లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీ రంగ దామేశ్వరీం
దాసి భూత సమస్త దేవా వనితాం లోకైక దీపంకురాం
త్వాం త్రైలోక్య  కుటుంబిని౦ శర సిజాం వందే ముకుంద ప్రియం|| 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)