Blogger Widgets

బుధవారం, నవంబర్ 06, 2013

ఎక్కువ లేదా తక్కువ మాట్లాడితే మంచిదా?

బుధవారం, నవంబర్ 06, 2013

మనకు కధలు వినటం అంటే చాలా ఇష్టం కదా! నాకు అయితే చాలా ఇష్టం. నాకు తెలిసిన మంచిది , చాలా చిన్నకధ మీకు షేర్ చేస్తున్నా చదవండి.   
అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, ఎక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?”
గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సూటికా అందరూ మెచ్చేదిగా వుండాలి,  అంతేకాదు అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాడు సంతోషంగా వెళ్ళాడు. చిన్న కధ అయినా చాలా మంచి విషయం వుంది కదా. 

చల్లరే హరిపై జాజరజాజ


శంకరాభరణం

చల్లరే హరిపై జాజరజాజ
చల్లఁగా సరసపు జాజరజాజ. IIపల్లవిII

సతతపు వలపుల జాజరజాజ 
చతురలమాటల జాజరజాజ 
సతమగు నవ్వుల జాజరజాజ 
జతనపు సిగ్గుల జాజరజాజ. IIచల్లII

సముకపు కొసరుల జాజరజాజ 
సమరతికరఁగుల జాజరజాజ 
జమళి తమకముల జాజరజాజ 
సమయని యాసల జాజరజాజ. IIచల్లII 

జడియని పంతపు జాజరజాజ 
సడఁగుల చేఁతల జాజరజాజ 
జడిగొనుచెమటల జాజరజాజ 
జడగొను పెనఁగుల జాజరజాజ. IIచల్లII

చలముల వొట్ల జాజరజాజ 
సలిగెలపగటుల జాజరజాజ 
చలువల వినయపు జాజరజాజ 
సళుపుల చూపుల జాజరజాజ. IIచల్లII 

సంగడి మూఁకల జాజరజాజ 
జంగిలి మతకపు జాజరజాజ 
సంగాత మమరిన జాజరజాజ 
సంగతి యెరికల జాజరజాజ. IIచల్లII

సారపు మోవుల జాజరజాజ 
సారెకుఁ బొలసేటి జాజరజాజ 
సౌరుచి మెచ్చుల జాజరజాజ 
జారతనంబుల జాజరజాజ. IIచల్లII


సందడి కొలువుల జాజరజాజ 
సందుల వొత్తుల జాజరజాజ 
చందురు పాటల జాజరజాజ 
సందె చీఁకటుల జాజరజాజ. IIచల్లII


చాలుకొను సతుల జాజరజాజ 
జాలివిరహముల జాజరజాజ 
చాలామరిగిన జాజరజాజ 
చౌలూరించే జాజరజాజ. IIచల్లII


చనుఁగవ గురుతుల జాజరజాజ 
చనవుల కొసరుల జాజరజాజ 
యెనసెను శ్రీవేంకటేశ్వరుఁ డీతని 

చనుమానంబుల జాజరజాజ. IIచల్లII 

మంగళవారం, నవంబర్ 05, 2013

భగిని హస్త భోజనం

మంగళవారం, నవంబర్ 05, 2013

దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ అంటారు .
ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర  మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న  వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి  ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు.  వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు.  దీనికి ఒక కదా వుంది.  ఆ కద ఏంటి అంటే.  యముడు యమునా సోదర సోదరిమణులు.  వారు కలసి పెరిగారు.  యమున ఒక అందమైన యువరాజును  వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది.  అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు.  కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు.  ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే.  యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది.  ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని.  ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది.  యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది. 
ఇది దీపావళి తరువాత  రెండు రోజులుకు వచ్చింది.  ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు.  అది చూసి యముడు  చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు.  వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు.  యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు.  నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు.  ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది.  అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు. 
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు.  యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది.  అది ఏమిటంటే అన్నదమ్ములు  కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు. 



కృష్ణుడు నరకాసురుడును 
చంపిన తరువాత తన సోదరి సుభద్రను కలవటానికి వెళ్లారు. సుభద్ర హారతి ఇచ్చి ఇంటిలోనికి స్వాగతం పలికి నుదుటిపైన ఒక తిలక్ ఉంచడం ద్వారా సంప్రదాయ విధంగా వుంచారు.

సోమవారం, నవంబర్ 04, 2013

గోవర్ధనోద్ధరణం

సోమవారం, నవంబర్ 04, 2013


ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు  మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.
కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.
దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు.  దానితో ఇంద్రునికి కోపం వచ్చి వడగళ్ళ వర్షాన్ని కురిపిస్తాడు.  ప్రజలందరు చాలా భయపడతారు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది .  దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.తన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే విధంగా అనుగ్రహిస్తాడు.ఈ విధంగా ఇంద్రుని గర్వభంగం చేస్తాడు.
ప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.
గోవర్ధనోద్ధరణం

పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.
ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.దానికి గుర్తుగానే ఈరోజు ఈ పండుగ చేసుకుంటారు. ఆవు పేడతో పర్వతాకారాన్ని పెట్టి దానికి పూలతో, శ్రీకృష్ణ అష్టోత్తర నామాలతో పూజ చేస్తారు. ఈరోజు గోక్రీడనమనే ఉత్సవం కూడా చేస్తారు. గోవు సర్వదేవతామయం అన్నది హిందువుల నమ్మకం. అందుకే ఈ రోజు గోవులను, దూడలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలు, పువ్వుల దండలతో అలంకరించి వాటికిష్టమైన పచ్చగడ్డిని ఆహారంగా పెట్టి పూజిస్తారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)