Blogger Widgets

శనివారం, మే 09, 2015

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా

శనివారం, మే 09, 2015

కలియుగ ప్రత్యక్ష దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తరించిన పరమ భగవత్ భక్తుడు, తోలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు.   ఈయన జన్మదినము నేడే.  15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లితండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులకు వారి  తపః ఫలితంగా వేంకటేశుని దివ్య అనుగ్రహం వలన జన్మించినాడు అన్నమయ్య .  క్రీ. శ 1408 వ సంవత్సరం లో మే నెల 9 వ తారీకున జన్మించారు.  మనం తెలుసుకున్న  తెలుగులో మొట్టమొదటి పదాలు అన్నమయ్యవే.  
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డ గోరుముద్దలు తినిపిస్తూ పాడుతున్న పాట 
 " చందమామ రావో జాబిల్లి రావో , మంచి 
    కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో"   
ఆహా ఎంత అద్బుతంగా వుందండి ఈ పాట అంతే కాదు నిదిరించే వేళ  అమ్మ పాడిన జోల పాట 
"జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో"
ఆయన ఏ పాట రాసిన పూర్తిగా అనుభూతి పొంది రాసిన పాటలు లో ఒకటి అన్నమయ్య స్వయంగా అనుభూతి పొందిన పాటలు. చిన్ని కృష్ణుని గురించి ఆలోచిస్తూ మేలుకొలుపు పాట ఒకటి ఇదిగో 

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె 
గోవిందుడయింక మేలుకొనవయ్యా 
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి 
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా || 

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా 
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య 
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య || 

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.    

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.
నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా ! 

ఎంత అద్బుతంగా రాసారండి.  అన్నమయ్య జన్మదినము రోజు ఇంత మంచి పాటను పంచుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా వుంది.  అన్నమయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 

శుక్రవారం, మే 08, 2015

రామ నామ

శుక్రవారం, మే 08, 2015


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
రామనామము సకల పాపహరమనీ, మోక్షప్రదమనీ చాలామంది నమ్మకము . "రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమ: శివాయ" నుండి "మ" అనే  బీజాక్షరము, మరియు  అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి "రా" అనే  బీజాక్షరము పొందుపరచబడి ఉన్నయని ఆధ్యాత్మిక వేత్తలు  వివరణ.  ఒక్కసారి  "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించుననీ  శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.  దీనిని గూర్చి పెద్దలు  చెప్పిన వివరణ ఏమిటంటే .  రామ పదంలో మొదటి అక్షరం "రా" ఇది య,ర,ల,వల్లో "ర" రెండవ అక్షరం.  రామలో రెండవ అక్షరం "మ".  ఇది ప,ఫ,బ,భ,మ వర్గములో "మ" ఐదవ అక్షరం.  సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత ఐదుని గుణిస్తే 2 x 5 = 10 అవుతుంది . అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10 x  10 = 100 అవుతుంది. ఇప్పుడు మూడవ రామ శబ్దా న్ని పది చేత వందని గుణిస్తే 10 x 100 = 1000 అవుతుంది .  ఇలా  "శ్రీ రామ , రామ , రామ ఇతి " అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది .  అని మహా శివుడు పార్వతి దేవికి చెప్పాడు.
ఇంకా రామ నామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగా మారుతాడు, రామ నామం వల్ల శబరి, గుహుడు, హనుమ, సీతామాత, ఇలా ఎందరో పునీతులు అయ్యారు . ఇంకా "రా"అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి. అంటే మనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి అన్నమాట. ఇక "మా" పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి. బైటికి పోయిన పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనా చెప్పవచ్చును . వశిష్టుడు "ఓం నమో నారాయణాయ" అన్న అష్టాక్షరి మంత్రం నుండీ " రా" అన్న అక్షరాన్ని, "నమశ్శివాయ" అన్న పంచాక్షరి మంత్రం లోంచి "మ" అన్న అక్షరాన్ని గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు, అష్టాక్షరిమంత్రము + పంచాక్షరి మం త్రము ఒకేసారి  జపించినట్లవుతుంది .
రామ చంద్రుడు తన సైన్యముతో సీత ను చేరటానికి లంకానగరంపై దండెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు  సముద్రంపై వానరసేన రాళ్ళతో వారథిని నిర్మిస్తున్నారు.  అప్పుడు ప్రతీ రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేను రాయి వేస్తే'  అది ఏమి అవుతుంది అనే ఆలోచన కలిగింది. అప్పుడు శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు  ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రామ నామం కు ఉన్న గొప్పతనం ఎంత వుందో కదా.  శ్రీ రాముని కంటే రామనామ గొప్పదే అనిపిస్తోంది. 
రామ నామ మహిమను చెప్పటానికి ఇంకా చాలా కధలు వున్నాయి .  వాటి గురించి ఇంకోసారి పోస్ట్ చేస్తాను . 

సోమవారం, మే 04, 2015

త్యాగయ్య "నౌకా చరితం"

సోమవారం, మే 04, 2015

త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్యత్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి. ఈ రోజు త్యాగరాజ వారి 248 వ జయంతి  సందర్బంగా 

నాద బ్రహ్మ త్యాగరాజు రచించిన  ఎందరో మహానుభావులు అందరికీ వందనములు, మరియు  తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర  పాదపద్మాలను చేరుకోవాలన్న కోరికతో దర్శన సమయం కాని వేళ  త్యాగరాజ స్వామి స్వామి దగ్గర నిలుచొని పాడిన పాట  త్యాగరాజు @ తెరతీయగరాదా … బహుళ జనాదరణ పొందిన కీర్తన. త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.  వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', కృష్ణ లీలలే ప్రధాన ఇతివృత్తం గా తీసుకొని ’నౌకా చరితం ‘’ తెలుగు లోనే నాట్యరూపకాలను కూడా రచించాడు

పల్లవి:
ఓడను జరిపే ముచ్చట
గనరే వనితలారా నేడూ

అనుపల్లవి :
ఆడవారు యమున కాడ కృష్ణుని కూడి
ఆడుచు పాడుచునందరూజూడగ

చరణములు :
కొందరు హరికీర్తనములు పాడ
కొందరానందమున ముద్దులాడ
కొందరు యమునా దేవిని వేడ
కొందరి ముత్యపు సరులసియాడ

కొందరు తడబడ పాలిండ్లు కదల
కొందరి బంగరు వల్వలు వదల
కొందరి కుతిలాలకములు మెదల
కొందరు పల్కుచు కృష్ణుని కథల

కొందరు త్యాగరాజ సఖుడేయనగ
కొందరి కస్తూరి బొట్తు కరగగ
కొందరి కొప్పుల విరులు జరగ
కొందరి కంకణములు ఘల్లనగ

ఆదివారం, మే 03, 2015

Visible illusion (Count the Number of Animals)

ఆదివారం, మే 03, 2015


My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)