Species: Pavo cristatus (blues) and Pavo muticus (Java greens)
Subspecies for P. muticus: P.m. muticus | P.m. spicifer | P.m. imperator
మరి మన భారత ప్రభుత్వం వారు 1963వ సంవత్సరం జనవరి 31 న నెమలి ని మన జాతీయ పక్షి గా గుర్తించారు. నెమలి చాలా అందమైన ఈకలు కలిగి వుంటుంది. శ్రీ కృష్ణుడు తన శిరస్సు మీద నెమలి ఈకను అలంకరిమ్చుకునేవారు. సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా నెమలి వుంటుంది కదా నేను ఫొటోస్ లో చూసాను. మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక బాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
మబ్బులు పట్టాగానే నెమలి తన అందాన్ని మరింత బాగా చూపి నాట్యం ఆడుతుంది. అంత అందంగా వున్నా మన జాతీయ పక్షి అయిన నెమలి జాతి అంతరించి పోకుండా కాపాడ వలసిన బాధ్యతా మనందరికీ వుంది. దయచేసి నెమలి ని చంపవద్దు దాని అందాన్ని చూసి ఆనందిచుదాం.
మన జాతీయ గీతం జనగణమన ను రవీంద్ర నాద ఠాగూర్ రచించారు. ఈ గీతాన్ని బెంగాలి లో రచించారు. 1911 లో మొదటి సారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్య సభ గుర్తించి స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణీ కూడా టాగోరే సృష్టించాడు. ఈ రోజు న మన జాతీయ గీతం గురించి తెలుసుకోవటానికి నేను సంతోషిస్తున్నాను. ప్రపంచంలో అత్యుత్తమ జాతీయ గీతంగా జనగణమన ను యునెస్కో ప్రకటించింది.
జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహె
గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు. చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము. తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను. తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను . ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా ........... గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరనముచే తామూ పోంద కోరిన ఫలమును వివరించుచున్నారు. కూడారై వెల్లుమ్ శీర్ గోవిందా, ఉన్ఱనై ప్పాడి పఱైకొండు యామ్ పెరుసమ్మానమ్ నాడు పుకరం పరిశినాళ్ నన్ఱాక శూడగమే తోళ్ వళైయే తోడే శెవి పువ్వే పాడగమే యెన్ఱనైయ పల్కలనుమ్ యామణివోమ్ ఆడైయడుప్పోం అతన్ పిన్నే పాల్ శోఱు మూడనెయ్ పెయ్దు మురంగైవరివార కూడి ఇరుందు కుళిరుంద్-ఏలోర్ ఎంబావాయ్
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.
శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు . వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోకదానిని కాంక్షించారు కదా? మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను. వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు. అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసినపరికరములు అర్ధించుచున్నారు. ఈ పాశురములో
ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము.
ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి.
సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు
ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమదసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళ ములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని , తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధ పడి మంగళము పాడిరి.
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము . రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము .
శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .
వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము.
ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము.
ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము.
అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.
గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకు పర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునా మంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు.
గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు.
భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.
అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను. ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరికవిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ !
నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.
గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
అంగణ్ మా ఞాలత్తరశర్, అబిమాన
పంగమాయ్ వందు నిన్ పళ్ళికట్టిల్ కీరే శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్
కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే
శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో
తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్
అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్
ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము.
సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.
గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి! మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను. ఈ విధముగా శ్రీ కృష్ణుని మేలుకోల్పుతున్నారు.
శ్రీదేవి తో కలసి ఉన్న యన్న నారాయుణుఢే పరతత్వము. శ్రీ మాన్నారాయునుడే ఉపేయము . అనగా మోక్ష ఛాయా గలవారి చే పొంద బడువాడు. శ్రీ దేవి అంసే నీలాదేవి . ఈ పాసురమునను గూడా శ్రీ , శ్రీయః పతుల యతారమగు నీలాదేవి శ్రీ క్రిష్ణులను మేలుకోల్పుతున్నారు .
ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో !
బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.
తాత్పర్యము: ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.
Best Known As: Inventor of the raised-point writing system for the blind
Louis Braille was a French musician and educator who developed the now-famous raised-point writing system for the blind that bears his name. Braille became blind as a result of an eye injury at the age of three. Despite his impairment, he went to a regular school, then earned acceptance to a state school for the blind. By the time he was 15 years old he had perfected a system of embossed dots that could be used to translate text through the sense of touch. He first published his system in 1829, but it wasn't until the last years of his life that it became to be widely accepted. A musician and teacher of the blind, Braille suffered bouts of ill health throughout most of his adult life, probably because of tuberculosis. After his death the "braille" system was promoted by his former students and friends, and by 1854 his home nation of France had officially adopted it. It spread internationally and is now the most widely-used system for teaching the written word to the blind.
గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్ తాత్పర్యము : ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము. అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.