శివకేశవార్చన:
వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.
గురువారం, నవంబర్ 07, 2024
బుధవారం, నవంబర్ 06, 2024
కార్తీక పురాణం 5వ రోజు
బుధవారం, నవంబర్ 06, 2024
దీపదాన మహాత్య్మం:
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెలరోజులూ పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.
దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమఅని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము.
ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్టుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.
లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట:పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను. దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను.ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధావులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడి దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను.
ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావు కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.
శనివారం, నవంబర్ 02, 2024
కార్తీక పురాణం 1వ రోజు
శనివారం, నవంబర్ 02, 2024
సూతుడు కార్తీక మహా పురాణాన్ని ఇలా చెప్పసాగాడు...
పూర్వం నైమిశారన్యమునకు సూతమహర్షి రాగా ఆయనను శౌనకాది మునులు సత్కరించి, సంతుషుని చేసి కైవల్యదాయకం అయిన కార్తీకమాశ మహాత్మ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతముని. ''శౌనకాదులారా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని ''అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మ పురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిషుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేలావిలాస బాలమణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మ పురాణంలోనూ ఈ కార్తీక మహాత్మ్యమును సవివరంగా ఉన్నది. మన అదృష్టంవల్ల నేతి నుండి కార్తీక మాసం ప్రారంభం. కావున ప్రతిరోజూ నిత్య పారాయణంగా ఈ నెల అంతా కార్తీక పురాణ శ్రవణం చేసుకుందాం. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహాత్యాన్ని వినిపిస్తాను వినండి..'' అంటూ చెప్పసాగాడు.
జనకుడు వశిష్టుని కార్తీక వ్రాత ధర్మములు అడుగుట.. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్నా యోగానికి అవసరమైన ద్రవ్యార్ది అయిన వశిష్ఠ మహర్షి జనకమహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ''హే బ్రహ్మర్షీ! మీకు ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి.. సంవత్సరంలోని సర్వ మాసముల కంటే కూడా కార్తీకమాసం అత్యంత మహిమాన్వితమైనది. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని, చెప్తూ ఉంటారు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత ఎలా కలిగింది.. ఆ వ్రతం ఉత్క్రుష్ట ధర్మం ఏ విధంగా అయింది'' - అని అడుగగా మునిజన విశిష్టుడైన వశిష్టుడు చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు. జనక మహారాజా! పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీలాంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైంది, విన్నంతమాత్రంచేత అన్ని పాపాలనూ అణచివేసేదీ అయిన కార్తీక మహాత్యాన్ని వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నువ్వు అడిగిన సంగతులను చెప్తాను, విను..
కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో.. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమనాడిగా గానీ, శుద్ధ పాడ్యమి నుండి గానీ ప్రారంభించాలి. ముందుగా - ''సర్వపాప హారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే'' ఓ దామోదరా! నా ఈ వ్రతం నిర్విఘ్నంగా పూర్తి చేయుము తండ్రీ'' అని నమచేసిస్కారపూర్వకంగా సంకల్పించుకుని కార్తీక స్నానం ఆచరించాలి.
కార్తీకమండలి సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే, గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాలకు చేరుతుంది. వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశాయాల్లో కూడా విష్ణువు వ్యాపించి వుంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీకమాసంలో నదికి వెళ్ళి హరి ధ్యానయుతుడై కాళ్ళూచేతులూ కడుక్కుని ఆచమనం చేసి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలు వదలాలి.
అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలితో నీటిని చెలికి మూడు దోసిళ్ళ నీళ్ళను గట్టుమీదికి జల్లి తీరం చేరాలి. చేరగానే కట్టుబత్తలను పిండాలి. దీన్నే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని తెల్లటి పొడి మది వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వ పున్ద్రాలను ధరించి, సంధ్యావందనం, గాయత్రీ జపాలను ఆచరించాలి. తర్వాత ఔపోసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తోటలోంచి తెచ్చిన మంచి తాజా పుష్పాలను, శంఖ చక్రదారి అయిన విష్ణువును సాలగ్రామంలో ఉంచి భక్తితో షోడశోపచారాలతో పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణం చదివి గానీ విని గానీ స్వగృహం చేరి దేవతార్చన చేసి భోజనం చేయాలి. ఆపైన ఆచమించి పునః పురాణ కాలక్షేపం చేయాలి. సాయంకాలం కాగానే ఇతర పనులన్నిటినీ విరమించుకుని శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ యథాశక్తి దీపాలను వెలిగించి, దేవుని ఆరాధించి భక్ష్య భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిణి స్తుతించి నమస్కరించుకోవాలి. కార్తీకమాసం అంతా ఇలాగే వ్రతాన్ని చేసినవారు పునరావృత రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితమైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగావయో బేధరహితంగా ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించినా సరే, వాళ్ళు మొక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా! తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా, ఇతరులు చేస్తుండగా చూసి, అసూయారహితుడై ఆనందించేవారికి ఆరోజు చేసిన పాపాలన్నీ విశ్నుక్రుపాగ్నిలో ఆహుతైపోతాయి.
కార్తీక సోమవార వ్రతం:
వశిష్ఠ ఉవాచ: హే జనకమహారాజా! వినినంత మాత్రంచేతనే మనోవాక్కాయకర్మల ద్వారా చేసిన సర్వ పాపాలనూ హరింపచేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విను.. ఈ కార్తీకమాసంలో శివునికి ఇష్టమైన కార్తీక సోమవార వ్రతం ఆచరించేవారు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటారు.కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజయినా సరే స్నాన, జపాడులను ఆచరించినవారు వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాన్ని పొందుతారు. ఈ సోమవారా వ్రాత విధి 6 రకాలుగా ఉంది. 1.ఉపవాసం 2. ఏకభక్తం 3. నక్తం 4.అయాచితం 5.స్నానం 6. తిలాపాపం
ఉపవాసం: చేయగలిగిన వారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా ఉంది, సాయకాలం శివాభిషేకం చేసి, నక్షత్ర దర్శనానంతరం తులసితీర్థం మాత్రమే సేవించాలి.
ఏకభక్తం: సాధ్యం కానివాళ్ళు ఉదయం స్నానజపాదులు యథావిధిగా ముగించి, మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్ధమో తులసి తీర్ధమో తీసుకోవాలి.
నక్తం: పగలంతా ఉపవాసం ఉంది, రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారం కానీ తీసుకోవాలి.
అయాచితం: భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి భోజనం పెడితే మాత్రమే భోజనం చేయాలి. దీన్నే అయాచితం అంటారు.
స్నానం: పైన సూచించిన వాటికి వేటికీ శక్తి లేనివారు సమంత్రక స్నానజపాదులు చేసినట్లయితే సరిపోతుంది.తిలాపాపం:
మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది.
పై ఆరు పద్ధతుల్లో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కానీ, తెలిసి ఉండి కూడా ఏ ఒక్క పద్ధతినీ ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుమ్బీపాక రౌరవాది నరకాలని పొందుతారని ఆర్షవాక్యం. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనాధలు, స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడూ కూడా పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భాగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవారు నమక చమక శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెప్తాను, వినండి.
నిష్టురి కథ: పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి ''నిష్టురి'' అనే కూతురు ఉండేది. ఆమె అందంగా, ఆరోగ్యంగా, విలాసంగా ఉండేది. అయితే సద్గుణాలు మాత్రం లేవు. అనేక దుష్ట గుణాలతో గయ్యాళిగా, కాముకురాలిగా ఉండే ఈ నిష్టురిని ఆమె చెడ్డ గుణాలకారణంగా ''కర్కశ'' అని పిలిచేవారు.
నిష్టురి తండ్రి తన బాధ్యత ప్రకారం కర్కాషను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైణ మిత్రశర్మ అనే వ్యక్తితో పెళ్ళి జరిపించి, చేతులు దులుపుకున్నాడు. మిత్రశర్మ చదువు, సదాచారాలు ఉన్నవాడు. సద్గుణాలు ఉన్నాయి. సరసమూ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు కావడాన కర్కశ ఆడింది ఆటగా, పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ, కొడుతూ ఉండేది. అయినప్పటికీ భార్యపై మనసు చంపుకోలేకపోయాడు. పైగా పరువు పోతుందని ఆలోచించాడు. కర్కశ పెట్టే బాధలన్నీ భరించాడే తప్ప, ఆమెను ఎన్నడూ శిక్షించలేదు. ఆమె ఆఖరికి పర పురుషులతో సంబంధం పెత్తుకుని౮ భర్తను, అతని తల్లితండ్రులను హింస పెట్టేది.
ఒకరోజు ఆమెతో నేస్తం చేసిన ఒక దుర్మార్గుడు ''నీ భర్త కారణంగా మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం'' అంటూ రెచ్చగొట్టగా ఆ రాత్రి కర్కశ భర్త నిద్రిస్తుండగా బండరాతితో తల పగలగొట్టి చంపింది. శవాన్ని తానే మోసుకుని వెళ్ళి ఒక పాడుబడ్డ బావిలో వేసింది.ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె దుర్గుణాలు, దుష్ట స్నేహాలు ఎక్కువ కనుక అత్తమామలు ఆమెను ఏమీ అనకుండా, తామే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. అంతటితో కర్కశ మరీ రెచ్చిపోయింది. కామంతో కన్నుమిన్ను కానక ఎందరో పురుషులతో సంబంధం పెట్టుకుంది. పైగా దాన్నో వ్యాపారం కింద చేయసాగింది. చివరికి ఆమె జబ్బులపాలయింది. పూవు లాంటి శరీరం పుళ్ళతో జుగుప్సాకరంగా తయారైంది.విటులు అసహ్యంతో రావడం తగ్గించారు. సంపాదన పోయింది. అప్పటిదాకా భయపడినవారంతా ఆమెను అసహ్యించుకోసాగారు. ఆ హీనురాలికి జబ్బులే తప్ప బిడ్డలు పుట్టలేదు. చివరికి తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, ఒంటినిండా రోగాలతో వీధిలో దిక్కులేని చావు తెచ్చుకుంది. యమదూతలు ఆమెను నరకానికి తీసికెళ్ళి శిక్షించారు. భర్తను హింసించిన కర్కశకు భయానక నరకం
భర్తను విస్మరించి, పర పురుషులను చేరిన కర్కశ పాపాలకు ఆమెను మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోవాలి. ముళ్ళ గదలతో తల పగిలేట్లు కొట్టారు. రాతిమీద వేసి చితక్కొట్టారు. సీసం చెవుల్లో వేశారు. కుంభీపాక నరకానికి పంపారు. ఆమె చేసినా పాపాలకు గానూ ముందు పది తరాలు, వెనుక పది తరాలు, ఆమెతో కలిసి 21 తరాలవాళ్ళను కుంభీపాక నరకానికి పంపారు. ఆ తర్వాత ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వ సారి కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది.
సోమవార వ్రత ఫలంవల్ల కుక్క కైలాసం చేరుట:
ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుదు పగలు ఉపవాసం ఉండి, శివాభిభిషేకం మొదలైనవి చేసి, నక్షత్ర దర్శనానంతరం నకట స్వీకారానికి సిద్ధపడి, ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆరోజంతా ఆహారం దొరకక పస్తు ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనం వల్ల డానికి పూర్వ స్మృతి కలిగి ''ఓ విప్రుడా! నన్ను రక్షించు'' అంటూ మూలిగింది. ఆ కుక్క మూలుగులు విన్న విప్రుడు కుక్క మాట్లాడటాన్ని చూసి విస్తుపోతూనే ''ఏం తప్పు చేశావు.. నిన్ను నేను ఎలా రక్షించగలను?!'' అనడిగాడు.
అప్పుడు కుక్క ''ఓ బ్రాహ్మణుడా! పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామంతో ఒళ్ళు తెలీక జారత్వానికి ఒడికట్టాను. పతితను,భ్రష్టను అయి, భర్తను కూడా చంపాను. ఆ పాపాలవల్ల నరకానికి వెళ్ళాను...'' అంటూ మొదలుపెట్టి అంతా వివరంగా చెప్పింది.చివరికి నాకు ఇలా పూర్వ జన్మలు ఎందుకు గుర్తొచ్చాయో మాత్రం బోధపడటంలేదు, దయచేసి చెప్పు'' అంది.
బ్రాహ్మణుడు జ్ఞాన చక్షువుతో తెలుసుకుని ''శునకమా! ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకూ పస్తు ఉండి నేను విడిచిన బలి భక్షణం చేశావు కదా. అందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగింది..'' అన్నాడు.
డానికి కుక్క ''కరుణామయుడివైన ఓ బ్రాహ్మణా! నాకు మోక్షం ఎలా సిద్ధిస్తుందో చెప్పు'' అని అడిగింది.
దయాళుడైన భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవార వ్రత ఫలాన్ని ఆ కుక్కకు ధారపోయగా ఆ క్షణమే కుక్క తన శునక దేహాన్ని వదిలి దివ్య స్త్రీ సరీరిని అయి, ప్రకాశ మానహార వస్త్ర్ర విభూషిత అయి, పితృ దేవతా సమంవితయై కైలాసం చేరింది. కనుకనే ఓ జనక మహారాజా! నిస్సంశయంగా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించు'' అంటూ చెప్పాడు వశిష్టుడు.
బుధవారం, జులై 17, 2024
తొలి ఏకాదశి
బుధవారం, జులై 17, 2024
ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం అందరికీ అలవాటు కదండి . మొత్తం సంవత్సరం పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు.
పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం సహజం. శరదృతువు యముడి కోర. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ గా జరుపుకున్నేవారు. ఆనాడు ఉపవాస తొలి ఏకాదశి దీక్ష చేస్తారు.
ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. విష్ణువు పాలకడలి పై శేష తల్పమున పవళిస్తాడు. అదే రోజును తొలి ఏకాదశి గా భావిస్తారు.
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు.
సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఇంత ప్రాముఖ్యము కల శయన ఏకాదశి రోజు విష్ణు సహస్రము పారాయణ చేసెదరు.
అందరికీ ఈ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
శనివారం, ఏప్రిల్ 02, 2022
ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ
శనివారం, ఏప్రిల్ 02, 2022
నమస్కారమండి, అమ్మమ్మ తో నేను చానల్ కి స్వాగతం. ఉగాది పచ్చడి తయారి పండగ వెనక కధ
నేను అమ్మమ్మ ఈ వీడియో లు చేయటానికి చాలా కష్టపడుతున్నాము. మీకు కనకా మా వీడియోలు నచ్చినట్టు అయితే మా చానల్ ని సబ్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహింస్తున్నందుకు మీఅందరికీ మా ధన్యవాధములు.
Hii everyone welcome to our channel ammamma tho nenu
I wish u all a happy ugadi.All of u plz watch full vedio and share ur comments.And also plz tell what u prepared for todays lunch specials,how do u celebrate?
ఆదివారం, మే 03, 2015
బుధవారం, ఏప్రిల్ 29, 2015
అంతర్జాతీయ నృత్య దినోత్సవం
బుధవారం, ఏప్రిల్ 29, 2015
అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1982 లో యునెస్కో సంస్థ అయిన ఎన్.జి.ఓ యొక్క ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ చే ప్రారంభించబడినది. ఈ దినాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29 న జరుపుకుంటారు. ఈ రోజున జరుపుకొనాలనే సూచనను ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యిచ్చినది. 1760 లో ప్రచుచింబడిన ప్రముఖ రచన lettres sur la danse యొక్క రచయిత మరియు ఆధునిక ప్రెంచ్ నృత్యనాటికల సృష్టి కర్త అయిన Jean Georges Noverre (1727-1810) యొక్క జన్మ దినాన్ని పురస్కరించుకొని ఆదినాన్ని అంతర్జాతీయ నృత్య దినంగా ప్రకటించారు.
ప్రతి సంవత్సరం, ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు లేదా నర్తకుడు ప్రపంచవ్యాప్తంగా చెలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించటానికి ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డాన్స్ కమిటీ యొక్క ప్రవేశ పత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్యదర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుతుంది.
UNESCO నిర్వహించిన అంతర్జాతీయ నృత్య దినోత్సవం లో యిప్పటివరకు పాల్గొన్న మరియు సందేశాన్ని అందించిన ప్రముఖులలో మెర్సీ కన్నింగ్‌హం, మారిస్ బెజర్త్ , అక్రం ఖాన్ మరియు అన్నె తెరెసా దె కీర్ స్మేకర్ లు.
ఈ దినం యొక్క లక్ష్యం నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను చేధించడానికి,అన్ని రాజకీయ, సాంస్కృతిక మరియు జాతి అడ్డంకులు అధిగమించడానికి మరియు సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయుట. ప్రపంచ నృత్య కూటమి, మరియు దాని నృత్య కమిటీ ఈ దినాన్ని పారిస్ లోని UNESCO లోనూ మరియు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.
అసలు నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది. ఇది సరే ప్రపంచ ప్రసిద్దమైన నృత్యాలు కొన్ని వున్నాయి. వాటిలో
Belly Dance
అసలు నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికలు మీద ఆదారపడి వుంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది. ఇది సరే ప్రపంచ ప్రసిద్దమైన నృత్యాలు కొన్ని వున్నాయి. వాటిలో
Hip-hop Dance |
Tap Dance |
Yangko Dance |
Kathak |
Gangnam Style
Break Dance or B-boying |
Ballet
Line Dance
Salsa Dance |
గురువారం, ఏప్రిల్ 09, 2015
ఆదివారం, మార్చి 16, 2014
పూర్ణిమ విశేష శక్తితో కూడిన హోలీ
ఆదివారం, మార్చి 16, 2014
ఫాల్గుణ శుధ్ధ పూర్ణిమ విశేష శక్తితో కూడినది. ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి.
శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.
ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦.
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.
హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు.
నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦!
ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!!
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే రంగుల పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా ప్రకాసిస్తాయి, అక్కడ వివిధ రకాల రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇదే ఈ పండుగ విశేషము.
హిరణ్యకశ్యపుడి పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, యూరప్ మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.
వసంత కాలంలో వాతవరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
తడి రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది. వీటి వల్ల అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. అలాంటి వ్యాధులు రాకుండా వుండాలి అంటే రసాయన రంగులను ఉపయోగించకుండా వుంటే మంచిది.
ఇది వసంతోత్సవ పండుగ. హోలీ పండుగ కృష్ణుడు కూడా జరుపుకున్నాడు అంటారు. ఈ పండుగ గురించి నేను కొంచెమే తెలుసుకున్నాను అని నాకు అనిపిస్తోంది.
అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు.
లేబుళ్లు:
ఆటలు,
కధలు,
కమామిషులు,
పండగలు,
మన దేశం - సంస్కృతి - సాంప్రదాయం,
Greeetings,
greetings
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)