ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము. ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక. గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చేయుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
పాశురము: వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్ అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్ శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్ ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్. తాత్పర్యము: ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది. ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.
మార్గ శీర్ష మాసమున గోపికలు తమ పెద్దల అనుమతి పై వర్షము నకై చేసిన వ్రతమే ఈ ధనుర్మాస వ్రతము . పెద్దల సంతృప్తికి తామూ స్నానము ఆచంరింతుమనియు, ఆ వ్రతమునకు పర అను వాద్యము కావలేననియు, బయలుదేరి శ్రీ కృష్ణుని చేరి , ఆ పర నిచ్చి తమకావ్రతమును పుర్తిచేయించి, దాని ఫలముగా అలంకారములను , పరమాన్న భోజనమును చేయింపుమని శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. కాని వారి హృదయగతమగు అభిప్రాయము మాత్రము అది కాదు . శ్రీ కృష్ణునితో కలసి మరి ఎడబాటు లేకుండా వానికి కింకర్యము చేయవలెనని కాంక్షిస్తున్నారు. స్నానమను చోట భగవదత్ప్రాప్తి యనియు పరయను చోట భగవత్ కైంకర్యము అనేది పరమ పురుషార్దము అని అభిప్రాయము వచ్చునట్లు వారిమ్తవరకు మాట్లాడుతున్నారు. ప్రధానంగా తెలుసుకోవలసినవి రెండు విషయాలున్నవి ఇరవైఎనిమిది , ఇరవై తొమ్మిదో పాశురాలలో వివరించి వ్రతమును పుత్ర్తి చేస్తున్నారు. ముప్పైవ పాసురములో ఫలశ్రుతి.
మొదటి పాసురమున గోపికలు ఈ వ్రతమును ప్రారంభించారు.
అయితే గోపికలు ఈ పాసురములో తమ హృదయము నావిష్కరిమ్చి తమ వ్రతమును సమాప్తము చేసి మనము కూడా తరించవలెనని ఈ పాశురములో స్పష్టముగా వివరించినారు.
బాగా తెల్లవారకముందే నీ వున్న చోటికి మేము వచ్చి నిన్ను సేవించి, బంగారు తామరపువ్వులవలె సుందరములు, స్పృహణీయములు అయిన చరణములకు మంగళము పాడుటకు ఫ్రయోజనమును వినుము, పశువులను మేపి, అవి మేసిన తరువాతనే తాము భుజించెడి గోపకులమున పుట్టిన నీవు మేము చేయు అంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండుట తగదు. నేడు నీనుండి పఱను పుచ్చుకొని పోవుటకు వచ్చినవారముకాము. ఏనాటికిని ఏడేడు జన్మలకును నీతో విడరాని బంధుత్వము కలవారమే కావలెను. నీకే సేవలు చేయువారము కావలెను. మాకు ఇతరములయిన కోరికలేవియు లేకుండునట్లు చేయుము.
గోపికలు శ్రీ కృష్ణునితో అన్నారు మేము మార్గ శీర్ష స్నానము చేయవలెనని వచ్చాము . మాకు మా వ్రతమునకు కావలసిన పరికరములు అడిగారు. ఆ వ్రతము చేసిన తర్వాత తామూ పొందవలసిన ఆభరణములను, వస్త్రములను, భోగములను ప్రార్దిమ్చినారు .
శ్రీ కృష్ణునకు వారు హృదయము తెలియును. ఇదంతయు లుకిక వ్రత గాధ కాదు. వీరు కోరునవి లుకిక వ్రతోపకరనములు కావు. ఆముష్మిక ఫలమునండుతకే వీరు కోరుచున్నారు. కాని వీరి నోటివేమ్తనే దానిని చెప్పిమ్చవలెను అని తలంచి ఇట్లు అడిగినారు.
ఓ గోపికలారా ! మీరు కోరినవన్నియు చాలా చక్కగా వున్నాయి. మీరు " పరిశీలించి కృపచేయమని" అనిఅన్నారు.
కదా పరిశీలించినా మీ అభిప్రాయమేమో నాకు తోచటంలేదు. వ్రతము చేసి మహత్తరమైన అలంకరనములను భోగములను అందవలెనన్నా దానికొక అదికారము ఉండాలి కదా? ఫలమునాశించిన మీరు ఆ ఫలాప్రాప్తికి ఏదోఒక యత్నము కుడా చేసి యుండాలి కదా? మా కది కావాలని అన్నంత మాత్రమున నేను ఇచ్చుటకు వీలుకాదు. దానికి తగిన యోగ్యతా మీకున్న ఇవ్వగలను. కావున మీకున్న అధికారము అనగా మీ యోగ్యతా ఎట్టిదో వివరించుము. ఫలమును అందగోరు వారు దానికి సాధనమునుగూడ సంపాదిమ్పవలేనుగాడా? మీరు అట్టి సాధనమును దేనినైనా ఆర్జించినారా ?
ఇట్లు అడుగగానే గోపికలు తమ హృదయము విప్పి చెప్పుచున్నారు .
గోపికలు కామ్క్షిమ్చునది పరమ పుశార్ధముఅగు నారంట భగవత్ పురక భవత్కైమ్కర్యము. దానికి వరేమియు యోగ్య తను సంపాదించుకొని రాలేదు . పరమాత్మే ఉపాయముగా నమ్మిన వారు, వాటి కంటే వేరే ఉపాయము తాము పొందుటకు ప్రతిభందకములని తెలుసుకున్నవారు. కర్మలు చేసి, జ్ఞానము సంపాదించి, భక్తి తో ఉపాసించి పరమాత్మను పొందాలని తలంపు వీరికి లేదు. వాడె వానిని పొందించ వలెనని నమ్మినవారు. అందుచే ఇట్లు భగవానుడే యుపాయమని నమ్మకము కలవారు. భగవానుని ముందు ఏమి విజ్ఞాపనము చేయవలెనో ఆమాటలను గోపికలు ఈ పాసురమున వివరిచుచున్నారు .
తాత్పర్యము: పశువుల వెంట వానిని మేపుటకై అడవికిపోయి. అచటనే శుచినియమములు లేక తిని, జీవిమ్చియుమ్డుతయే ప్రయోజనముగా తిని, తిరిగెడివారము. ఏమియు జ్ఞానములేని మాగోప వంశమున మాతో సజాతీయుడవై నీవు జన్మిచిన పుణ్యమే మాకున్న పుణ్యము . మాకెన్ని లోపాలున్నా తీర్చగాల్గినట్లు ఏ లోపము లేని వాడవు కదా నీవు. గోవిందా! ఓ స్వామీ ! నీతో మాకుగల సంబంధము పోగొట్టుకోన వీలుకాదు . లోక మర్యాదనేరుగని పిల్లలము. అందుచే ప్రేమవలన నిన్ను చిన్న పేరు పెట్టి పిలచినాము. దానికి కోపము తెచ్చుకొని మమ్ములననుగ్రహింపక ఉండకుము. మాకు ఆపేక్షితమగు పరను పరను ఇవ్వుము.
గోపికలు తామూ ఆచరించబోవు మార్గ శీర్ష వ్రతమునకు కావలసిన పరికరములను వెనుకటి పాసురమున విన్నవిమ్చినారు. అందు వారడిగిన ద్రవ్యములు సులభాములేయైననాను వారు కోరిన వారు కోరిన గునముఅలు గల ద్రవ్యము దుర్లభాములు. అందుచే శ్రీ కృష్ణ పరమాత్మ వీరి హృదయము వస్తువులను గోరుట కాదు , నన్నే కోరి వీరీ వస్తువులను కోరినారు. అనుకొనెను.పాచజన్యమును పోలిన శంఖములను కోరారు. మరి అల్లాంటి శంఖము దొరకదు. ఆ శంఖము శ్రీ కృష్ణుని వీడదు. అందుచే శ్రీ కృష్ణుడే శంఖధరుడై తమతో నుండవలెనని వారు కోరారు. చల్లా పెద్ద పర కావలెనని గోపికలు కోరారు . శ్రీ కృష్ణుడు త్రివిక్రమావతారమున జాంబవంతుడు త్రివిక్రముని విజయమును చాటుచు వాయించిన పరయోకటి కలదు. శ్రీ కృష్ణ రుపముననున్న నేను కుంభ నృత్యము చేయునప్పుడు కట్టుకొని వాయించిన పర చాల పెద్ద పర. ఈ మూడింటిని ఇచ్చెదనని శ్రీ కృష్ణుడు గోపికలకు చెప్పెను. మంగళా శాసనము చేయువారు కావలెనని కోరిరి. మంగళా శాసనము చేయువారెచట నున్న పరమాత్మయే వారి వెంట నుండునని వీరీ అభిప్రాయము. తమ దేవేరియగు శ్రీ మహాలక్ష్మి నే మంగళ దీపముగా వారితో ఉండునట్లు అంగీకరించెను . జెండా గరుత్మంతుడు . వారికి గరుడునికుడా ఒసగుటకు శ్రీ కృష్ణుడు సమ్మతించెను. తరువాత చాందినీగా అనంతునే పంపనంగీకరించెను. మధురా నగరమున జన్మించి వ్రేపల్లెకు వచ్చిన ఆ రాత్రి వర్షమున శ్రీ కృష్ణునకు మేలు కట్టుగా తన పడగలనుపయోగించిన మహానీయుడు కదా! అనంతుడు, పడగ, ఆసనము, వస్త్రము, పాదుకలు, తలగడ, చత్రము, చాందిని మొదలగున్నవి విధముల సర్వేస్వరునకు తన శరీరమును భిన్న భిన్న రుపములుగాకుర్చి యుపయోగపడి తనచేతలచే శేషుడు అను పేరు పొందిన మహనీయుడు. వీరు కూడా శేషత్వమునే కోరుతున్నవారగుటచే , శేషునే వారికి చాందినిగా ఇచ్చెను . ఇలా పరికరములన్నీ సమకూరినవి కదా ! ఇక మీ వ్రతమునకు ఫలమేమో వివరించమని స్వామీ కోరగా . గోపికలు ఈ పాసురమున ఈ వ్రతాచరణముచే తామూ పోందకోరిన ఫలమును వివరించుచున్నారు. ఈ పాసురము విశేషమైనది నేటి నివేదన చక్కెరపోంగళి ఆరగింపుగాఇస్తారు. గోపికలు ఈ పాసురము రోజు 108 గిన్నెలు చెక్కరపొంగలి నెయ్యి ఎక్కువ వేసి మోచేతి నుండి కారునట్లు వేసిచేస్తారు. ఎందుకుఅంటే 26 రోజులు వీరు నెయ్యి వాడలేదు కదా. అందువల్ల ఈ పాసురము రోజు మంచిగా చెక్కెర పొంగలి నివేదిస్తారు.
తనతో కూడని శత్రువులను జయిమ్చేది కళ్యాణ గుణ సంపదగల గోవిందా ! నిన్ను కీర్తించి వ్రతసాధనమగు పర అను వాద్యమును పొంది పొందదలచిన ఘన సన్మానము లోకులందరు పొగడెడి తీరులో నుండును. చేతులుకు గాజులు మొదలుగు ఆభరణములు , బాహువులకు డందకదియములు , చెవి క్రిందు భాగమున దాలెచేది దుద్దు, పై భాగమున పెట్టుకొనే కర్ణపువ్వులు, కాలి అందెలు మొదలుగు అనేక ఆభరణాలు మేము ధరించాలి. తరువాత మంచి చీరలను దాల్చి వుండాలి. దాని తరువాత పాలు అన్నము మున్నగున్నవి నెయ్యి పోసి ఆ మధుర పదార్ధము మోచేతి వెంబడి కారునట్లు నీతో కలసి కూర్చొని చల్లగా హాయిగా భుజిమ్చవలెను. గోపికలు తమ వ్రత ఫలమును ఇందులో వివరించారు.
శ్రీ కృష్ణ పరమాత్మ గోపికల మాటలకు పరమానందము తో వారిని చుచుతూ ఉండిపోయాడు. వారి పాసురము పాసురము మండలమును, నేత్ర ములను , వక్షస్థలమును , నడుమును చూచుచు ఇతర స్పృహ లేనంతగా వ్యామోహముతో పరవశమై ఉన్నాడు .వారి మాటలు విని మరి కొన్ని వినాలన్న కోరికతో ఒక ప్రశ్న అడిగెను " గోపికలారా ! నన్నే కోరి వచ్చాము అని చెప్పారు . మరలా నీకిష్టమైనచో పర అను వాద్యమును ఇమ్మని అంటున్నారు. నన్నే కలియవలేనని కోరిక ఉన్నవారు వేరోక దానిని కాంక్షించారు కదా? మీరు పర అడుగుటలో ఉద్దేశ్యము ఏమి? మీ కోరిక విషయములో నాకు సందేహముకలుగుతున్నది. అని శ్రీ కృష్ణుడు వారిని ప్రశ్నించెను. వారు దానికి భగవద్ ప్రీతి కొరకు మా పెద్దలు ధనుర్మాస వ్రతము చెయ్యమన్నారు. మేము పెద్దల యెడ ఉపకారబుద్ధితో ఈ వ్రతము ఆచరించ బూనినాము. అని గోపికలు చెప్పారు.
అంత శ్రీ కృష్ణ పరమాత్మ సరే కానిండు. అయితే ఆవ్రతము ఏమి ? దానికి ప్రమాణము ఏమి ? దానికి కావలిసిన పదార్ధాలు ఏమి ? అవి ఎన్ని కావాలి? వివరాలు తెలపండి. అని అడిగెను. అంత గోపికలు ఈ వ్రతమునకు కావలసిన పరికరములు అర్ధించుచున్నారు. ఈ పాశురములో
తాత్పర్యము: ఆశ్రిత వ్యామోహముకలవాడా! ఇంద్ర నీలము అను మణిని పోలిన కాంతియు, స్వభావమును కలవాడా! అఘటిత ఘటనా సామర్ధ్యముచే చిన్న మర్రియాకుపై అమరి పరుండువాడా ! మేము మార్గశీర్ష స్నానము చేయగోరి దానికి కావలసిన పరికరాలు అర్ధించి నీ వద్దకు వచ్చితిమి . ఆ స్నాన వ్రతమును మా పూర్వులు శిష్టులు ఆచరించినారు. నీవు విన్నచో దానికి కావలసిన పరికరాలు విన్నవించేదము. ఈ భూమండలమంతను వణుకుచున్నట్లు శబ్ధము చేయు , పాలవలె తెల్లనైన , నీ పాంచజన్యమనబడే శంఖమును పోలిన శంఖములు కావలెను. విశాలమగు చాలా పెద్ద "పర " అను వాద్యము కావాలి మంగళ గానము చేయు భాగవతులు కావాలి. మంగళ దీపములు కావాలి. ధ్వజములు కావాలి. మేలుకట్లు కావాలి. పై పరికరములు ను క్రుపచేయుము అని గోపికలు శ్రీ కృష్ణుని ప్రార్ధించిరి. సర్వ శ క్తిమంతుడవై మాకోరకు శ్రీ కృష్ణుడు వై సులభుడవైన నీవు మాపై దయ చూపి మా వ్రతమునకు కావలసిన పరికరములు నోసగుమని గోపికలు ఈ ప్రాసురమున ప్రార్ధించినారు
గోపికలు ఈ విధముగా మంగళము పాడుతుఉంటే శ్రీ కృష్ణ పరమాత్మ వారి ప్రేమకు , వాగ్వైభవనమునకు చాలా సంతోష్మ్చి " ఓ గోపికలారా! మీకు జన్మసిద్దాముగా మా యందుగల ప్రీతిచే మంగళము నాకాక్షించుచున్నారు . చాలా సంతోషమే , కానీ ఈ రాత్రివేళ మంచులో నడచి శ్రమ పడి వచ్చారు . చాలా శ్రమ అయ్యింది. కేవలము మంగళ శాసనము కాంక్షతోనే యున్నట్లు చెప్పుతున్నారు . కానీ దానికంటే వేరొక ప్రయోజనము లేదా? ఉన్నచో చెప్పండి. తప్పక నేరవేర్చుతాను. అనెను . నీగుణ కీర్తనము చేయుచూ వచ్చుటచే మంచు , రాత్రి , మొదలగున్నవి మాకు ఇబ్బందిని కలిగించవు. మాకు ప్రధాన ప్రయోజనము నీకు మంగళము పాడుతయే. లోకులకై వ్రతమోనర్చుటకుపర నొసంగిన ఒసగుము. మేము మీ స్వరూపమును మా స్వరూపమును తెలిసిన వారమే. కావునామంగళా శాసనమే ప్రధాన ప్రయోజనము అని తెలియచేయుచు శ్రీ కృష్ణ అవతార రహస్యమును తామెరుగుదుము అని దానిని ఈ పాశురములో వివరించినా మన గోపికలు. గోపికలు ఈ పాశురములో శ్రీ కృష్ణుని జన్మ రహస్యమును కీర్తించుచు దానివలన శ్రమ తీరి ఆనందించుచున్నారు. అని చెప్పుచున్నారు.
తాత్పర్యము: భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి , శంఖచక్రగధాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవి కుమారుడవై జన్మించి , శ్రీ కృష్ణుని లీలలను పరిపూర్ణముగా అనుభవించి, కట్టను కొట్టను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభావముగల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పెరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్ట భావముతో నున్న కంసుని అభిప్రాయమును వ్యతముచేసి వానికడుపులో చ్చిచ్చువై నిన్ను చంపవలెనని తలచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినాము . పర అను వాద్యము నిచ్చిన ఇమ్ము . సాక్షాత్తు లక్ష్మీ దేవే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును , నీ వీర చరిత్రమును , కీర్తించి శ్రమను విడిచి పెట్టి సంతోషించు. భగవానుని పాడుటకు సాధనానుస్టానము చేయుచున్నప్పుడు చాలా శ్రమలు కలుగును. ఆ శ్రమలు శ్రమగా కాక ఆనందముగా ఉండాలి. దానికి నామసంకీర్తనమే సాధనము అని గోపికలు ఇందులో వివరించారు.
ప్రస్తుతము గోపికలు మంచి దశకు చేరి ప్రేమ దసలోనున్న వారగుటచే తమకు కలిగిన అమంగళములను అతనిని దర్శించి పోగొట్టుకోవాలని , తమకు లేని మంగళములను సంపాదించుట మాని ప్రేమైక హృదయులై శ్రీ కృష్ణునకు మంగళము పాడుచున్నారు.ఇట్లే గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వలన తమ కార్యము నెరవేరునని , తమ ప్రభువు నడచి వచ్చి ఆసనము పై కుర్చొనగానే ఆ పాదాలు ఎర్రదనము చూచి తామూ చేసిన యపచారమునకు భాధపడి మంగళము పాడిరి. ఈ పాశురము చాలా విశేషమైనది. స్వామివారికి హారతి చాలా ఇష్టం కదా ఈ పాసురములో స్వామికి హారతి ఎక్కువగా ఇస్తారు. విశేషమైన నివేదనగా దద్యోజనం ఆరగింపుగా ఇవ్వాలి.
ఆనాడు బలి చక్రవర్తి తనదికాని రాజ్యమును తానూ ఆక్రమించి దేవతలను పీడించగా ఈ లోకమునంతను వానివద్దనుండి దానము పట్టి పాదములతో కొలిచిన మీ దివ్య పాదములకు మంగళము .రావణుడు సీతమ్మను అపహరించుకొని పోగా ఆ రావనుడుండు లంకకే వెళ్లి సుందరమగు భవనములు కోటయుగల దక్షినదిసనున్న లంకలో ఉన్నా రాక్షసులను చెండాడిన మీ భాహు పరాక్రమములకు మంగళము . శ్రీ కృష్ణునకు రక్షణకై యుంచిన బండిపై ఆవేసించిన రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్లు కాలుచాచి నేలకూల్చిన మీ అప్రతిమ కీర్తికి మంగళము .వత్సము పై ఆవేసించిన అసురునితో వెలగ చుట్టుపై నాఎసించిన యసురుని చంపుటకై ఓడిసేలరాయి విసరినట్లుగా వెలగ చెట్టుపైకి దూడను విసరనపుడు ముందువేనుకకు పాదములుంచి నిలచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసినని కోపముతో రాళ్ళ వాన కురియగా గోపాలురకు గోవులకు భాధ కలుగకుండా గోవర్ధన పర్వతమును గోడుగువలే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శ త్రువులను సములముగా పెకలిచి విజయము నార్జించి ఇచ్చేది మీ హస్తమునందలి వేలాయుధమునకు మంగళము. ఈ విధముగా నీ వీర చరత్రములనే కీర్తించి పర అనే సాధనము నందగ మేమీనాడు వచ్చాము అనుగ్రహించుము. అని ఈ పాశురములో మంగళము పాడుతూ భగవానుని అనుగ్రహించమని కోరుచున్నారు.
అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను. ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరికవిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
తాత్పర్యము: పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము. అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.
గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మ వద్దకు చేరి మేల్కొనమని వెనుకటి పాశురములో ప్రార్ధించారు. వేరొక గతిలేక నీకే చెందినవారమని చెప్పారు. ఈ పాశురములో తమ ను మెల్లమెల్లగా కనువిచ్చి చూడవలసిందిగా అర్ధించుచున్నారు .
శంగమ్ ఇరుప్పార్ పోల్ వందు తలై ప్పెయ్-దోమ్ కింగిణివాయ్ చ్చేయ్ద తామరై ప్పూప్పోలే శెంగణ్ శిఱుచ్చిఱిదే యెమ్మేల్ విరయావో తింగళుమ్ ఆదిత్తియనుమ్ ఎరుందాఱ్పోల్ అంగణ్ ఇరండుం కొండు ఎంగళ్మేల్ నోక్కుదియేల్ ఎంగళ్మేల్ శాపం ఇరింద్-ఏలోర్ ఎమ్బావాయ్ తాత్పర్యము: సుందరము విశాలమగు మహా పృధ్వీ మండలము నంటాను ఏలిన రాజులు తమకంటే గొప్పవారు లేరనేది అహంకారమును వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనము క్రింద గుంపులు గుంపులు చేరి ఉన్నట్లు , మేమును అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనము క్రింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. చిరుగంట ముఖమువలె విదియున్న తామరపువ్వులు వలె వాత్సల్యముచే ఎర్రగా నున్న నీ కన్నులను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరించుము. సూర్య చంద్రులిరువురు ఒక్క సారి ఆకాశమున ఉదయించునట్లు ఉండేది నీ రెండు నేత్రములతో మావైపు కటాక్షిమ్చితివా! మేము అనుభావిమ్చియే తీరాలి అనే శాపాము వంటి కర్మ మమ్ములను వీడి పోవును.
గోపికలు పురుష అహంకార భుతురాలగు నీలాదేవిని మేలుకోలిపిరి. ఆమె మేలుకొని "నేను మీలో ఒక్కదానినికదా! నన్ను ఆశ్రయించిన మీకేనాడు లోపముండదు. రండి! మనమందరమూ కలసి శ్రీ కృష్ణుని మేల్కొల్పి అర్దింతము . " అని తానూ వచ్చి గోపికలతో శ్రీకృష్ణ భగవానుని సమీపమునకు వారిని తోడ్కొనిపోయి మేలుకొలుపు జొచ్చెను.
ముందు పాసురములో నీలాదేవిని మేలుకొల్పి, శ్రీ కృష్ణుని మేలుకొలిపి కృష్ణుడుని ఎలాంటివాడో కీర్తిస్తూ నీలా దేవిని ఎలాంటిదో వర్ణిస్తూ ఆమెను శ్రీ కృష్ణుని వారితో స్నానం చేయుటకు పంపమని అర్ధిస్తున్నారు. మరి ఎలా వర్ణిస్తున్నారంటే... పాశురము: ముప్పత్తుమూవర్ అమరర్క్కు మున్ శెన్ఱు
తాత్పర్యము: ముప్పది మూడుకోట్ల అమరులకు వారికింకను ఆపద రాక ముందే పోయి , యుద్ధ భూమిలో వారికి ముందు నిలిచి , వారికి శత్రువుల వలన భయమును తొలగించే బలసాలీ ! మేల్కొనుము అర్జవము కలవాడా ! రక్షణము చేయు స్వభావము గలవాడా ! బలము కలవాడా ! ఆశ్రితుల శత్రువులనే నీ శ త్రువులుగా భావించి వారికి భయ జ్వరమును కలిగించువాడా ! నిర్మలుడా ! మేలుకో ! బంగారు కలశములను పోలిన స్థానములను, దొండపండువలెఎర్రని పెదవియును, సన్నని నడుమును కల ఓ నీలాదేవి! పరిపుర్ణురాలా! లక్ష్మీ సమానురాలా! మేలుకొనుము. వీచుటకు ఆలవట్టమును (hand fan) కంచుతద్దమును మా కోసంగి నీ వల్లభుడగు శ్రీ కృష్ణునితో కలసి మేము స్నానము చేయునట్లు చేయుము.
ముందు పాశురములో పొడుగు జుట్టు గల నీలాదేవి ని మేల్కొల్పి . ఈ రోజు నీలాదేవిని మేలుకొలిపినా ఈ పాశురములో శ్రీ కృష్ణుని,నీలాదేవిని కూడా మేలుకోల్పవలసినది గా అర్ధించుచున్నారు. లేచి వారితో మాటాలాడమని కోరుకొని నీలాదేవిని అర్ధిస్తున్నారు కాసేపు అయినా మాతో మాటాడనీ అంటున్నారు. మరి ఎలా అన్నది తెలుసుకుందాం. నీలాదేవిని కీర్తిస్తున్నవారు ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు పాశురము కుత్తు విళక్కెరియ కోట్టుక్కాల్ కట్టిల్మేల్
తాత్పర్యము: ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.
గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు. మరి ఎలా లేపుచున్నారో చూడండి.
తాత్పర్యము: వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను. అని గోపికలు ప్రార్ధించిరి.
గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి న తరువాత నంద గోప భవనమునకు చేరినారు. పదిమంది గోపికలును మాత్రమే కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కల గోపికలను అందరను మేలు కొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోనికి ప్రవేశింతురు .
పాశురము: నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్ ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్ తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్ వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్ తాత్పర్యము: అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికివిడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచేఅందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయినమణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము. శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు. దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పదవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహేనవ పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచే ఈ వ్రతము నాకు పుర్వరంగామును తెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈనాడు మేల్కొల్ప బడుచున్నది. ఈమెను ఏవిదంగా లేపుచున్నారో కదా! ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ? లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను. బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును. లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను. బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా ! లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో . లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ? బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము. లెమ్ము మాతో వచ్చి చేరుము అని లోపలి గోపికను లేపినారు.
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపుతానని చెప్పినది ఆ గోపిక ఈనాడు మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకూ నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతర విషయాలనే మరచిఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
తాత్పర్యము: స్నానము చేయుటకు గోపికల నేల్లరను మేల్కొల్పుతాను అని చెప్పి నిద్రపోవుచున్న ఒక గోపికను ఈ పాసురములో లేపుచున్నారు. ఈ బాలికకు ఊరివారినందరాను ఒకతాటిపై నడుపగల శక్తి కలది. ఓ పరిపూర్ణురాలా! నీ పెరటిలో నున్న గుడుబావిలో ఎరుపుతామర పూలు వికసించినవి. తెల్లకాలువలు ముడుచుకుంటున్నాయి. అంటే తెల్లవారుచున్నాడని భావము. లెమ్ము ఎర్రని కాషాయ వస్త్రములు దరించి తెల్లని పలువరుసలు గలిగి వైరాగ్య సంపన్నులైన సన్యాసులు తమతమ నివాసములలో ఆరాధనము చేయుటకు వేల్లుచున్నారు లెమ్ము. నీవు ముందుగా మేల్కొని వచ్చి మమ్ములను లేపెడియట్లు మాట ఇచ్చినావు మరచిపోయావా? ఓ లజ్జలేనిదానా! లెమ్ము. ఓ మాతనేర్పు గలదానా! శంఖమును చక్రమును ధరించినట్టి ఆజాను బాహుడగు పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము. అని ఈనాటి గోపికను మేల్కొల్పినారు.