Blogger Widgets

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

కలియుగంలో కోరికలు తీర్చేదేముడయ్యా ఈ హనుమయ్య .........హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది?

ఆదివారం, ఏప్రిల్ 21, 2024

 




హనుమాన్ చాలీసా పుట్టుక గురించి చాలా ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఇది 16వ శతాబ్దంలో మహాకవి తులసీదాసు చేత రచించబడింది. తులసీదాసు రామభక్తికి ప్రసిద్ధి చెందిన కవి-సన్యాసి మరియు రామచరితమానస అనే ఇతిహాసం రచయిత. హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉంటాయి, అందుకే దీనిని ‘చాలీసా’ అని అంటారు, ఇందులో ‘చాలీస్’ అనే పదం నుండి వచ్చింది, దీని అర్థం హిందీ భాషలో ‘నలభై’.

హనుమాన్ చాలీసా వెనుక కథ?

వారణాసి లో ఒక సదాచార సంపన్నుడు తన ఏకైక కుమారుడు కి ఒక అమ్మాయి ని ఇచ్చి వివాహం చేస్తాడు.వారిద్దరూ చిక్కగా జీవనం సాగిపోతుండగా విధి ప్రభావంగా ఆ వక్తి మరణించాడు.దానిని చూసి అతని భార్య తట్టుకోలేకపోయింది ఎంతో బాధపడింది.తన భర్త శవ యాత్రకు అడ్డు పడింది.అది చూసి చుట్టూ పక్కల వాళ్ళు తనని పట్టుకున్నారు యాత్ర సాగుతుంది.ఈ యాత్ర తులసి దాస్ ఆశ్రమం మీదుగా జరుగుతుంది.ఆ అమ్మాయి అందరిని విడుచుకుని వెళ్లి తులసి దాస్ కాళ్ళ మీద పడుతుంది ఎంతో విలపిస్తోంది.ధ్యన్యమ్ లో నిమగ్యమై ఉన్న తులసీదాస్ 'దీర్ఘసుమంగళీభవ' అన్ని దీవించాడు దానితో ఆమె దీనంగా జరిగింది అంత తులసీదాస్ కు వివరించింది.అది విన్న తులసి దాస్ తల్లి నా నోట రాముడు ఎప్పుడు  అసత్యం పలికించాడు అని శవయాత్ర దక్కరకు వెళ్లి శవానికి కట్లు విప్పి రామనామాన్ని జపించి తన కమండలం లో నీళ్లను శవం మీద జల్లుతాడు వెంటనే ఆ యువకుడు పునర్జీవితుడు అయ్యాడు.ఆ మహాత్యమును చుసిన జనులు అందరు రామ భక్తులు అయ్యారు.అది చూసి మరియు చెప్పుడు మాటలు విన్న అక్బర్ తులసి దాస్ ను పిలిపించి అదే రామ నమ మహిమ తో సభ అందరి ముందు ఒక శవాన్ని తెప్పించి బ్రతికించమని చెప్పాడు.జనన మరణాలు నా చేతిలో ఉండవు అని శవాన్ని బ్రతికించలేను అని రాజు చెప్పిన దానిని దిక్కరించాడు తులసి దాస్ అందుకు రాజు జైలు లో పెట్టించి చిత్రహింసలు పెట్టారు 

మహా రామ భక్తుడు అయినా తులసి దాస్ ను అలా హింసలు పెడుతుంటే రామ భక్తుడు అయినా హనుమాన్ తన వానర సైనం తో అక్బర్ మహల్ పై దాడి చేసారు.వందల సంఖ్యలో వానరులని చూసి రాజ్యం లోని వారు అందరు హడిలిపోయారు.కారాగారం లో ఉన్న తులసి దాస్ ను విడిపించకపోతే విధ్వంసం తప్పుడు అని చెప్పారు అక్కడి పండితులు అక్బర్ కి.వెంటనే తులసి దాస్ ను విడిపించారు.తనని కాపాడానికి మహా బాల శాలి అయినా హనుమంతుడు వచ్చాడని గ్రహించాడు తులసీదాస్.అప్పుడు హనుమంతుడు మహాకాయుడు అయ్యి దర్శనం ఇచ్చాడు.

హనుమంతుడిని చుసిన ఆనందం లో తులసీదాస్ నలభై దోహాలు ఆశువుగా స్వామిని స్తుతించాడు .తులసీదాస్ చేసిన స్తోత్రం కి హనుమంతుడు ప్రసన్నం అయ్యి ఈ స్తోత్రం చదివిన వారికీ తాను రక్షగా ఉంటాను అన్ని చెప్పాడు. 

హనుమాన్ చాలీసాలో సూర్యుడు మరియు భూమి దూరం వెల్లడి చేయబడింది

హనుమాన్ చాలీసా వాస్తవంగా సూర్యుడు మరియు భూమి మధ్యలో ఉన్న దూరంను సమర్థంగా చెప్పుతుంది. కానీ అసలు శాస్త్రిక సూత్రం వేరే. వేగం (S) = దూరం (D) ÷ సమయం (T) అనే సామాన్య శాస్త్రిక సూత్రం ఉంది. రికార్డ్ల ప్రకార, 1672లో జాన్ రిచర్ మరియు జోవాన్నికో కాసిని భూమి మరియు సూర్యుడు ఉన్న దూరంను భూమి వ్యాసాల ప్రమాణంగా 22,000 

పన్నెండు వేల దివ్య మైళ్ల దూరంలో ఉన్న సూర్యుడు, మీరు దానిని (సూర్యుడిని) మింగడానికి ప్రయత్నించారు, ఇది ఒక తీపి ఫలంగా భావించి, ఇక్కడ, యుగం అంటే నాలుగు యుగాల (1 పూర్తి మహాయుగం) దైవిక సంవత్సరాలలో ఏకం అవుతుంది. .

సత్యయుగం = 4800 దివ్య సంవత్సరాలు

త్రేతాయుగం = 3600 దివ్య సంవత్సరాలు

ద్వాపరయుగం = 2400 దివ్య సంవత్సరాలు

కలియుగం = 1200 దివ్య సంవత్సరాలు

కాబట్టి, 1 దివ్య యుగం అంటే 12,000 దివ్య సంవత్సరాలు.

సంస్కృతంలో,  సహస్ర  అంటే 1000 మరియు 1  యోజన  అంటే దాదాపు 8 మైళ్లకు సమానం.

కాబట్టి, 12,000 x 1000 x 8 = 96,000,000 మైళ్లు.

శాస్త్రవేత్తల ఇటీవలి లెక్కల ప్రకారం సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 92,960,000 మైళ్లు.

భూమి సూర్యుని చుట్టూ ఎలిప్టికల్ కక్ష్యలో తిరుగుతుంది కాబట్టి, ఈ దూరం రుతువులను బట్టి మారుతుంది. ఉత్తర అర్ధగోళంలో వేసవిలో, శీతాకాలంలో కంటే భూమి సూర్యుడికి దగ్గరగా ఉంటుంది.

హనుమాన్ చాలీసా లేదా ఏదైనా మహామంత్ర జపం అనేది ఉత్పాదక మనస్తత్వానికి సానుకూల ధృవీకరణ. మనందరికీ తెలిసినట్లుగా, వాంఛనీయ ఫలితాన్ని సాధించడానికి సానుకూల మనస్తత్వాన్ని సృష్టించేందుకు ధృవీకరణలు సహాయపడతాయి. 

కలియుగంలో  కోరికలు  తీర్చేదేముడయ్యా  ఈ  హనుమయ్య .....ఈ హనుమాన్ జయంతికి అందరు తప్పకుండ పదకొండు సార్లు కనీసం హనుమాన్ చాలీసా పాటించడానికి ప్రయత్నిచండి .అన్ని రకాల బాధలు,ఆరోగ్య సమస్యలు అన్ని తొలిగిపోతాయి 



మంగళవారం, జనవరి 23, 2018

ఆరోగ్యదాత....... అభయప్రదాత......లోక బాంధవుడుకి నమస్కారములు. _/\_

మంగళవారం, జనవరి 23, 2018

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటినీ నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమిగా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.  
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 
రధసప్తమి రోజున మనం ఉదయంనే లేచి ఆచరించవలసిన విధి 
 "జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే చాలు మనకు ఆయుః ఆరోగ్యాలతోపాటు అష్టైశ్వర్యాలు అందిస్తాడు. 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.

మంగళవారం, అక్టోబర్ 17, 2017

ధన్వంతరీ త్రయోదశి

మంగళవారం, అక్టోబర్ 17, 2017

ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను  మరింత ముఖ్యమైన భావిస్తారు.  ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
 అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు.  ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు.  ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి.  ఈరోజు ధన్వంతరి జయంతి.  ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.


ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి  శుభాకాంక్షలు.

గురువారం, అక్టోబర్ 05, 2017

మహర్షి వాల్మీకి

గురువారం, అక్టోబర్ 05, 2017

ఈ రోజు వాల్మీకి జయంతి. వాల్మీకి సుమాలి కుమారుడు. మహర్షి వాల్మీకి షుద్ర కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టిన పేరు రత్నాకర.  వాల్మీకి సంస్కృత సాహిత్యం ఆదికవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.
రామాయణం రాసిన సమయం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రజలు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబదినది అని  నమ్ముతారు (సుమారు 500 BC).  కొందరు 1,800 సంవత్సరాల క్రితము  వ్రాసినట్లు మరికొందరు భావిస్తున్నారు. పుస్తకం చాలా పురాతనమైనది మరియు మహాభారతకు ముందు వ్రాయబడింది అని అందరూ అంగీకరిస్తున్నారు.
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. 
రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 
వాల్మీకి తపస్సంపన్నత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది.  ఈ మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

తమిళనాడు లోని తిరువంచియూర్ లోని మహర్షి  వాల్మీకి కి చిన్న ఆలయం  (జీవా సమాధి) ఉంది.  వాల్మీకి ఆలయం

 Lord Valmiki Chennai Lord Valmiki Chennai.jpg

బుధవారం, ఏప్రిల్ 06, 2016

జేమ్స్‌ వాట్సన్‌ జన్మదిన శుభాకాంక్షలు.

బుధవారం, ఏప్రిల్ 06, 2016

వేలిముద్రలు ద్వారా DNA  స్వీకరించి  ఒక వ్యక్తి యొక్క DNA మరియు వేరొక వ్యక్తి యొక్క  ఏకైక లక్షణాలను విశ్లేషించే ఒక టెక్నిక్. DNA వేలిముద్రలు ద్వారా ప్రసూతి / పితృత్వాన్ని పరీక్ష ద్వారా తెలుసుకోగలరు , ఫోరెన్సిక్స్, మరియు విపత్తు బాధితుల గుర్తించగలరు సమూలంగా. "DNA వేలిముద్రలు" మానవ గుర్తింపు సాధనంగా వేలిముద్రలు సాంప్రదాయికగా ఉపయోగాన్ని సూచిస్తాయి వాడబడుతున్నాయి. క్లాసిక్ వేలిముద్రలు పొందటానికి కష్టం మరియు ఉపయోగపడే నమూనాలను సంబంధించినదిగావుంది . సరిగా నిర్వహిస్తున్నపుడు, DNA ఆధారిత పరీక్ష మాత్రమే అందిస్తుంది, ప్రత్యేక సాక్ష్యం, అది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును సాక్ష్యంగా  బయాస్ లేకుండా అందిస్తుంది.  DNA  పరీక్షా ద్వారా అసలైన నేరస్తులకు శిక్ష పడేటట్టు చెయవచ్చు.  ఇలాంటి DNA ని కనుక్కొన్న శాస్త్రవేత్త గురుంచి తెలుసుకుందాం.  
Image result for james watson dna

James Watson - జేమ్స్‌ వాట్సన్‌. జీవశాస్త్రంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్త.
అమెరికాలోని షికాగో నగరంలో 1928 ఏప్రిల్‌ 6న సంపన్న కుటుంబంలో పుట్టిన జేమ్స్‌ డేవీ వాట్సన్‌ బాల మేధావిగా పేరుపొందాడు. రేడియో క్విజ్‌ కార్యక్రమాల్లో చురుగ్గా రాణించిన జేమ్స్‌ 15 ఏళ్ల కల్లా షికాగో విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. జంతుశాస్త్రంలో పట్టభద్రుడయ్యాక 'వాట్‌ ఈజ్‌ లైఫ్‌' అనే గ్రంథం చదివి ఉత్తేజితుడై జన్యుశాస్త్ర (జెనెటిక్స్‌) అధ్యయనం ఆరంభించాడు. ఆపై 22 ఏళ్లకే డాక్టరేట్‌ సాధించాడు. పరిశోధనలు కొనసాగించి లండన్‌లోని కేవిండిష్‌ లాబరేటరీలో ఫ్రాన్సిస్‌ క్రీక్‌, మారిస్‌ విల్కిన్స్‌తో కలిసి డీఎన్‌ఏను ఆవిష్కరించగలిగాడు. 'డబుల్‌ హెలిక్స్‌' అనే గ్రంథం రాశాడు. జీవశాస్త్రంలో అద్భుతమైన ఆవిష్కరణగా పేరొందినది ఏమిటో తెలుసా? డీఎన్‌ఏ నిర్మాణాన్ని కనిపెట్టడం. ఆ పరిశోధనలో ప్రముఖ పాత్ర వహించిన శాస్త్రవేత్తే జేమ్స్‌ వాట్సన్‌. ఇందుకుగాను నోబెల్‌ బహుమతిని అందుకునేనాటికి అతడి వయసు 25 సంవత్సరాలే! ఆయన పుట్టిన రోజు -1928 ఏప్రిల్‌ 6 .
మానవ శరీరం కోట్లాది జీవకణాలతో నిర్మితమైందని మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. ఒకో కణంలో సైటోప్లాజమ్‌ అనే జెల్లీలాంటి ద్రవ పదార్థం ఉంటుంది. కణ కేంద్రమైన న్యూక్లియస్‌లో క్రోమోజోమ్స్‌ అనే రసాయనిక పోగులుంటాయి. ఇవి క్లిష్టమైన DNA(Deoxy ribo Nucleic Acid) అనే రసాయనంతో తయారై ఉంటాయి. డీఎన్‌ఏ సర్పిలాకారపు నిచ్చెన (spiral ladder) రూపంలో ఉండే అతి పొడవైన రెండు దారాల్లాంటి నిర్మాణంతో మెలికలు తిరిగి ఉంటుంది. దీన్ని డబుల్‌ హెలిక్స్‌ అంటారు. జీవపదార్థాల్లో సమాచార మార్పిడికి ఇదెంతో కీలకం.
జేమ్స్‌ పరిశోధన వల్ల జీన్‌ క్లోనింగ్‌, జీన్‌ బ్యాంకులు, జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి వల్ల పుష్ఠికరమైన ఆహార పదార్థాల ఉత్పత్తి, నాణ్యమైన ఔషధాల ఉత్పాదన, రోగ నిర్దారణలో ప్రమాణాలు సాధ్యమవుతున్నాయి. జేమ్స్‌ సారధ్యంలో కేన్సర్‌కి కారణమైన ఆంకోజీన్‌ను కనుగొన్నారు. ఎనభై రెండేళ్ల వయసులో ఆయన ఇప్పటికీ పరిశోధనలను చురుగ్గా కొనసాగిస్తుండడం విశేషం. అలాంటి జేమ్స్ వాట్సన్ కి జన్మదిన శుభాకాంక్షలు. 

ఆదివారం, మార్చి 27, 2016

ఎక్స్ కిరణాలు

ఆదివారం, మార్చి 27, 2016

     విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్.
  • రోగ నిర్దారణకు అప్పట్లో కొత్తవరావడి సృష్టించారు  ప్రపంచంలో వైద్యరంగంలో రోగనిర్దారణకు(రేడియోగ్రఫీ) మరియు రోగ నిర్మూలనకు(రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్. ఈయన కనుగొనే ఎక్స్ కిరణాలు వైద్యరంగలములోనె కాక భద్రతా రంగంలో ఉపయోగపడుతున్నాయి. విల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్ (మర్చి 27,1845 - ఫిబ్రవరి 10,1923) జర్మన్ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబర్ 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్- కిరణాలను కనుగున్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్ బహుమతి పొందారు. ఈయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్ జీనియమ్ అనిపేరు పెట్టి గౌరవించారు.
  • రాయింట్జన్ మార్చి 27, 1845 న జర్మనీలోని లెన్నెస్ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్ మహిళ. హాలెండ్ లో విద్యాభ్యాసం జరిగింది.1865 లో యుట్రెచ్ యూనివర్సిటీ లో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్ లో గల ఫెడెరల్ పాలిటెక్నిక్ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీర్ణుడయ్యాడు. అచట మెకానికల్ ఇంజనీరుగా చేరాడు. 1869 లో తత్వశాస్త్రమునందు జూరిచ్ విశ్వవిద్యాలయం నుండి పి.హె.డి పట్టాను పొందాడు. ఆ విశ్వవిద్యాలయంలో ప్రముఖ ప్రొపెసర్ అయిన ఆగస్ట్ కుండ్త్ యొక్క ప్రియమైన శిష్యుడయ్యాడు.   ఎక్స్ కిరణాలను రాయింట్ జన్ కిరణాలని అందురు. కాని రాయింట్ జనే స్వయంగా వాటిని ఎక్జ్ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞతగా ఈయనకు 1901 లో భౌతిక శాస్త్రం తరపున నోబెల్ బహుమతి లభ్యమయింది. ఈ ఎక్స్ రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది.
  • రాయింట్ జన్ కేథోడ్ రే ట్యూబ్(శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏ కొంచెం కూడా వెలువడకుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్ ట్యూబ్ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్ ట్యూబ్ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలువడి బేరియం ప్లాటినో సైనైడ్ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని యీయన ఊహించగలిగాడు.
  • ఈ కిరణాలను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయగలవని యీయన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓ రకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించవని రాయింట్జన్ వెల్లడించాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూపకుండా ఉంటాయా అనే ఆలోచన రాయింట్ జెన్ కి రావటం - శాస్త్ర ప్రపంలో ఒక సరికొత్త అధ్యాయానికే కారణభూతమైనది.
  • ప్రయోగం చేయటం కోసం రాయింట్ జన్ ఫోటో గ్రాఫిక్ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్ చేసి చూసి ఆశ్చర్యపోయాడు. చేతి ఎముకలు ఉంగరంతో సహా ఆ ఫోటో లో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈ కిరణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది.  దురదృష్ట వశాత్తు రాయింట్ జన్, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరిశోధకులు యీ ఎక్స్ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణించారు. ఈ ఎక్స్-కిరణాల వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతున్నప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమాదం తప్పదు. యీ కారణంగానే ఎక్స్-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాయింట్ జన్ ఆ కిరణాల ప్రభావంగానే చనిపోయాడని తెలుస్తోంది.
  • 1901 లో రాంట్ జెన్ కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్ కిరణాలు కనుగొని విశేష సేవలందించినందుకు గాను యివ్వబడింది. కాని రాంట్ జెన్ ఆ బహుమతికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వవిద్యాలయమునకు దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్ జన్ తన పరిశోధనకు పేటెంట్ హక్కులను తిరస్కరించాడు.ఎందువలనంటే మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయోగకరంగా ఉండాలని.ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు.
  • రమ్ ఫోర్డ్ మెడల్ (1896)
  • మాటెక్కీ మెడల్ (1896)
  • ఎలియట్ క్రెస్సన్ మెడల్ (1897)
  • భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి (1901)
నవంబరు 2004 లో పరమాణు సంఖ్య 111 గా గల మూలకానికి ఆయన పై గౌరవార్థం రాంట్జెనీయం(Rg) అని IUPAC సంస్థ నామకరణం చేసింది. IUPAP కూడా ఈ పేరును నవంబర్ 2011 లో దత్తత తీసుకుంది.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)