గురువారం, ఏప్రిల్ 18, 2024
ఒంటిపూట జోష్ ని పెంచే స్నాక్స్ నిమిషంలో(Simple and easy snack perfect fo...
గురువారం, ఫిబ్రవరి 15, 2024
అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణ మూర్తి
నమస్కారిస్తే ఆయురారోగ్యాలు, అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.
ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |
దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే
2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |
మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్ |
మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్
5. బృంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |
ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
6. బంధూకపుష్పసంకాశం – హారకుండభూషితం |
ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్.
7. తం సూర్యం లోకకర్తారం – మహాతేజ: ప్రదీపనమ్|
మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్.
8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానప్రకాశ్యమోక్షదమ్ |
మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణ మామ్యహమ్.
9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్ |
10. ఆమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే|
సప్త జన్మ భవేద్రోగి – జన్మ జన్మ దరిద్రతా |
స్త్రీ తైలమధుమాంసాని – యే త్యజంతిరవేర్దినే |
న వ్యాధి: శోకదారిద్య్రం – సూర్యలోకనం చ గచ్ఛతి.
ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |
దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే
ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరుణించు . ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని
"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు .
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
గురువారం, ఆగస్టు 24, 2023
వరలక్ష్మి వ్రతం అమ్మవారి అలంకారం(Last min Saree Draping For varalakshmi ...
మంగళవారం, జనవరి 23, 2018
ఆరోగ్యదాత....... అభయప్రదాత......లోక బాంధవుడుకి నమస్కారములు. _/\_
సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం |
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
బుధవారం, డిసెంబర్ 20, 2017
కృష్ణుని ప్రేమ అందరికి సమానమే
విశేషార్ధాము:
పుళ్ళుం శిలమ్బిన కాణ్:
క్షీరసాగరమున శేషశయ్యపై నిద్రపోవుచున్న కారణభూతుని,
ఉళ్ళత్తు క్కొండు:
హృదయమున పెట్టుకొని,
మునివర్గళుం యోగిగళుం మెళ్ళ వెళున్ధు:
మునులును, యోగులును మెల్లగా లేచి
మంగళవారం, డిసెంబర్ 19, 2017
మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.
తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు. ఎందుచేతనంటే శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి. అతని పనులు కూడా అట్టివే. ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు. నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి. కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి. నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి. మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.
విశేషార్ధము:
మాయనై :
ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టములు కలవానిని కీర్తించి మనము మన వ్రతమున ఉపక్రమించుదుము.
మాయ అంటే భగవద్శక్తి ఇది చాలా విచిత్రముగా వుండును.
మన్ను వడమదురై మైందనై:
ప్రతినిత్యము భాగావత్సంబంధముకల ఉత్తర మధురకు నాయకుడగు వానిని కీర్తించుచున్నారు. పyరమపదమున వికార రహితుడగు విష్ణువు ఏకరూపుడై ఎల్లప్పుడు నిత్యసూరులకు దర్సనమిచ్చు పరమాత్మయే మధురానగరిలో అవతారములు మార్చి మార్చి దర్శనము ఇచ్చినాడు. ఈ మదురనే సిద్దాశ్రామము. అక్కడ వామనావతారుడుగా దర్సనం ఇచ్చారు. ఇక్కడ శత్రుఘ్నుడు ఇక్కడ నేలవనుడను రాక్షసుడును చంపి రాజదానిగా చేసికొని పాలించాడు. తరువాత దేవకీవసుదేవులకు శ్రీ కృష్ణుడుగా ఇచట అవతరించాడు.
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై:
సోమవారం, డిసెంబర్ 18, 2017
వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు. ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి, సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు. చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు. సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు ఏఱి:
గర్జించి మిన్నంది. ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి. మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె.
"బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె. ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును. ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి. పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే. కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె మెరవాలిట. శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :
శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.
సోమవారం, అక్టోబర్ 16, 2017
గోవత్స ద్వాదశి పూజ
మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు. మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న సహాయంకు కృతజ్ఞతలు చెప్పటమే . ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' అని కూడా పిలుస్తారు. గోవత్సా ద్వాదాషి హిందూ భక్తులు దైవ ఆవు అయిన నందినిని పూజిస్తారు. ఈ పూజ వల్ల వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగను దేశంలో అన్ని ప్రాంతాలలో అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజును 'వాసు బరస్' గా గుర్తించి పూజ చేస్తారు మరియు దీనితోనే దీపావళి సంబరాలలో మొదటి రోజుగా పూజలు మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజునే , 'శ్రీపద వల్లభ ఆరాధన ఉత్సవ్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం దత్తా మహాసాంధన్లో జరుగుతుంది, గుజరాత్లో 'వాగ్ బరాస్' గా జరుపుతారు.
గోవత్సా ద్వాదశి సమయంలో ఆచారాలు:
గౌవ్సా ద్వాదశి రోజున ఆవులు ఆరాధించబడుతున్నాయి. ఒక సంప్రదాయ స్నానం చేయించి నుదురు మీద తిలకం దిద్ది పూజ చేస్తారు. ఆవులు మరియు వారి దూడలను అందంగా ప్రకాశవంతమైన వస్త్రాలు మరియు పూల పూలలతో అందంగా అలంకరిస్తారు.
గోవత్సా ద్వాదశి రోజు కొందరు భక్తులు ఆవుల విగ్రహాలను మరియు వారి దూడలను మట్టి తో తయారు చేస్తారు. ఈ మట్టి విగ్రహాలు కు కుంకుం మరియు పసుపుతో అలంకరించి పూజ చేస్తారు . సాయంత్రం హారతి ' ని ఇస్తారు.
గ్రామాలలో పశువులకు వివిధ రకాల ఆహార పదార్ధాలు సమర్పిస్తారు.
భక్తులు విష్ణువు అవతారంగా ఉన్న శ్రీ కృష్ణుడికి ప్రార్ధనలు చేస్తారు. ఆవుల పట్ల కృతజ్ఞతలు మరియు ప్రేమను కలిగి ఉంటారు.
కొన్ని ప్రాంతాల్లో, ప్రజలు గోవత్సా ద్వాదాషి రోజున ఆవు పాలను త్రాగటం మరియు నెయ్యి ని ఉపయోగించటం మానివేస్తారు.
గోవత్సా ద్వాదాషి యొక్క ప్రాముఖ్యత మరియు దాని పురాణము 'భవిష్య పురాణం' లో ప్రస్తావించబడింది. పురాణం లో నందిని యొక్క కథ కూడా ఉంది , దైవత్వం కల ఆవు మరియు దూడ గా పురాణం చెబుతుంది. హిందూ మతంలో, ఆవులు చాలా పవిత్రంగా భావిస్తారు. వారు మానవాళికి పోషణ అందించేటప్పుడు వారు కూడా పవిత్ర మాతృమూర్తి గా పూజిస్తారు. Govatsa Dwadashi రోజు న మహిళలు తమ పిల్లలు సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తారు . పిల్లలు లేని జంట జంటగా గోవత్సా ద్వాదాషి పూజ నిర్వహిస్తారు మరియు ఉపవాసం ఉంటే, వారికి పిల్లలతో ఆనందంగా ఉండే ఆశీర్వదము కలిగి ఉంటారనే నమ్మకం ఉంది . ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, గోవత్సా ద్వాదాషి కూడా 'వాగ్' అని కూడా పిలుస్తారు, వాగ్ అనగా ఆర్థిక రుణాలను తిరిగి చెల్లించాలని సూచిస్తుంది. అందువలన ఈ రోజున వ్యాపారవేత్తల్లో వారి ఖాతాల పుస్తకం ను క్లియర్ చేసి, వారి నూతన లావాదేవీలు దీవాలి తో మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజు ఆవులు ను పూజించి న వ్యక్తి సమృద్ధిగా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతాడు అని నమ్ముతారు. మనం పూజించే ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారుట. గోవును పూజిస్తే మనం ఒకసారి ముక్కోటి దేవతలను పూజించినట్టే వారి దీవెనలు మనకు అందినట్టే.
గోవత్స ద్వాదశి పూజ గురించి బాగుంది కద .
"గోవులను పూజించండి. గోవధను వ్యతిరేకించండి "అదే మన హిందూ సాంప్రదాయం .
బుధవారం, అక్టోబర్ 11, 2017
"ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు"
ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే. మనందరికీ చీకటి నుండి తెల్లవారాక ముందే వారికి తెల్లవారుతుంది. చకాచకా పరిగెడుతూ పరిగెడుతూ సైకిల్ మీద వార్తా పత్రికలు ప్రతి ఇంటికి ప్రతీ వీధి వీధి కీ వార్తాపత్రికలును వేసి తొందర తొందరగా వార్తా పత్రికలను అందిస్తూ ఉంటాడు. పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది. మరి మన ఇంటి ముందర పాల పేకట్లు తో పాటు ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో, ఏమి జరగబోతోందో తెలపటానికి వార్తా పత్రిక కూడా వుంటుంది. వార్తాపత్రికలు చూస్తే కానీ మనకు తెల్లవారిన అనుభూతి రానే రాదు. వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు. ఆ పేపర్ చేరటం ఆలస్యం అయితే మనమే అతని కోసం ఎదురు చూస్తాం. ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్ నే. వాతావరణం ఎలా వున్నా. తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్.
ఈరోజు ప్రపంచం అంతా "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకుంటున్నారు.
మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). చదువుకుంటూనే పేపర్ బాయ్ లుగా పని చేసి ఎంతో మంది సమాజంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు.
అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు. ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.
పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.
గురువారం, అక్టోబర్ 05, 2017
మహర్షి వాల్మీకి
రామాయణం రాసిన సమయం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రజలు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబదినది అని నమ్ముతారు (సుమారు 500 BC). కొందరు 1,800 సంవత్సరాల క్రితము వ్రాసినట్లు మరికొందరు భావిస్తున్నారు. పుస్తకం చాలా పురాతనమైనది మరియు మహాభారతకు ముందు వ్రాయబడింది అని అందరూ అంగీకరిస్తున్నారు.
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి.
రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది. శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని కలుసుకున్నారు. వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు రామాయణం బోధించాడు.
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు. ఆపేరు నిలిచిపోయింది. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
- ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
- ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి.