మాతృభాష అమ్మ బొజ్జలో వున్న
పసిపాపకు తెలిసిన భాషే.
అమ్మ పాడిన లాలిపాట మన మాతృభాష.
తేనెలతేటల మాటలుకూర్చి
వీనులకు విందు కలుగజేయు భాష
మంచి ముత్యాల్లా కూర్చిన పేట
అందమైన బంతిపూలతోట
మన భాష తెలుగు భాష
దేశభాషలందు తెలుగులెస్స!
మాతృభాష మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. లేదా మాతృభూమిలో మాట్లాడే భాష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ మాతృభూమిగా గలవారు మాట్లాడే భాష (తెలుగు) మాతృభాష. దీనినే ప్రధమ భాష లేదా మొదటి భాష గా చక్కగా మాట్లాడగలిగే, అర్థం చేసుకో గలిగే, మరియు భావాలను వ్యక్తపరచ గలిగే భాషను ప్రధమభాషగా గుర్తించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో భాషలు మాట్లాడేవారు గలరు. 90% మంది తెలుగు మాట్లాడుతారు. కారణం వీరి మాతృభాష "తెలుగు". అలాగే ఉర్దూ, తమిళం, కన్నడ, ఒరియా, హిందీ భాషలు ప్రధమ భాషగా గల వారు కానవస్తారు. ఇదే ప్రాంతీయ భాష గా ఒక ప్రాంతంలో నివసిస్తూ వుంటే, ఆ ప్రాంతపు వ్యావహారిక భాషను కూడా మాతృభాషగా పరిగణించవచ్చు. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ భాష "తెలుగు". మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటిని సవ్యంగా అర్ధం చేసుకోవాలంటే మాతృభాష సహకారంతోనే సాద్యం.
శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
“తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్ల నృపుల గొలువ నెరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స”
దేశ భాషలందు తెలుగు లెస్స”
శ్రీకృష్ణదేవరాయలు తన స్వీయ గ్రంధమైన ఆముక్త మాల్యదలో తెలుగు భాష గొప్పతనాన్ని కీర్తించాడు.
చోళులు, చాళుక్యుల యుగం నుండి తెలుగు అన్న మాటను పలికించడం, తెలుగు పద్యం కనిపించడం, తెలుగు పాట వినిపించడం జరిగింది.
తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలోఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారికభాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు,సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికిచిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏకొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకివచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీవీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గాజరుపుకుంటున్నాము. గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషాదినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ప్రజలు పాటిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు. "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట". అని ఇంకా "రామ్మూర్తి పంతులవాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్నవిద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలుఅందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషిచేస్తున్నారు.ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది. ప్రపంచీకరణవలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తిచూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములోచదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ఇది ఎంతోగొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు.
తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.