Blogger Widgets

ఆదివారం, జనవరి 31, 2016

హరి రసమా విహారి సతు

ఆదివారం, జనవరి 31, 2016


హరి రసమా విహారి సతు
సరసోయం మమ శ్రమ సంహారి

దయా నిభృత తనుధారి సం
శయాతిశయ సంచారి
కయాప్యజిత వికారి
క్రియా విముఖ కృపాలధారి

సదా మిథ్యా జ్ఞానీ సతు
మదాలిమతాభిమానీ
తదా శ్రిత సంధానీ సతు
తదా తదా చింతా శయనాని 

పరామృత సంపాది
స్థిరానందాశ్రేది
వరాలాభ వివాది శ్రీ -
తిరువేంకటగిరి దివ్య వినోది

ఆదివారం, డిసెంబర్ 27, 2015

ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల

ఆదివారం, డిసెంబర్ 27, 2015


ఆతడెవ్వాడు చూపరే అమ్మలాల
ఏతుల నాడేటిక్రిష్ణుడీతడే కాడుగదా

కందువ దేవకి బిడ్డగనెనట నడురేయి
అంది యశోదకుకొడుకైనాడట
సందడించి పూతకిచంటిపాలు తాగెనట
మందల ఆవులగాచి మలసెనట

మంచిబండి దన్నెనట మద్దులు విరిచెనట –
ఇంచుకంతవేల కొండయెత్తినాడట
మంచాలపై గొల్లెతలమానాలు చేకొనెనట –
మించుల పిల్లగోవివట్టి మెరసెనటా

కాళింగుని మెట్టెనట కంసు( బొరిగొనెనట –
పాలించి సురల చేపట్టెనట
యీలీల శ్రీవేంకటాద్రి నిరవైనదేవుడట –
యేలెనట పదారువేల ఇంతుల నిందరిని

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

వీడివో యిదే వింతదొంగ

శుక్రవారం, డిసెంబర్ 25, 2015

|| వీడివో యిదె వింతదొంగ |
వేడిపాలు వెన్న వెరజినదొంగ ||
||వెలయ నీట జోప్పువేసేటి దొంగ |
తలగాననీక దాగుదొంగ |
తలకక నేలదవ్వేటిదొంగ |
తెలిసి సందెకాడ దిరిగేటి దొంగ ||
|| అడుగుకింద లోకమడచేటి దొంగ |
అడరి తల్లికినైన నలుగుదొంగ |
అడవిలో నెలవైయున్న దొంగ |
తొడరి నీలికాసెతో నుండుదొంగ ||
|| మోస మింతుల జేయుమునిముచ్చుదొంగ |
రాసికెక్కినగుఱ్ఱంపుదొంగ |
వేసాల కిటు వచ్చి వెంకటగిరిమీద |
మూసినముత్యమై ముదమందుదొంగ ||

బుధవారం, నవంబర్ 13, 2013

పండిత నెహ్రూ పుట్టినరోజు

బుధవారం, నవంబర్ 13, 2013


పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు 

మమతా సమతా పుట్టినరోజు మంచికి కోవెలకట్టినరోజు 

|| పండిత నెహ్రూ ||
ముత్యంలాంటి మోతీలాలుకు రత్నంలా జన్మించాడు 

జాతిరత్నమై వెలిగే యింకొక జాతి రత్నమును కన్నాడూ  
అతడే జవహరులాలూ అతనికి మన జేజేలు

|| పండిత నెహ్రూ ||
తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్రగులాబీ పెదవులపై చిరునవ్వు 
మదిలో పున్నమి పువ్వు 

చేతిలో పావురం మనాజాతికి అతడే గోపురం

|| పండిత నెహ్రూ ||
మహాత్మా గాంధీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపాడు 

రణదాహంతో రగిలే జగతికి శాంతి సుధలు కురిపించాడు 
కన్నుమూసినా జవహర్లాల్ కంటిపాపగా ఉన్నాడు 
ఇంటింట జ్యోతిగ వున్నాడు చాచా నెహ్రూ అమర్రహ

|| పండిత నెహ్రూ ||

శుక్రవారం, నవంబర్ 01, 2013

"ఆంధ్రా షెల్లీ" జయంతి శుభాకాంక్షలు.

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు జయంతి నేడే తెలుగు సాహితీ ప్రియులందరికీ శుభాకాంక్షలు. 
 మావి చిగురు తినగానే కోయిల పలికేనా,   ఆకులో ఆకునై, పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం,  ప్రతి రాత్రి వసంత రాత్రి , పాడనా తెనుగు పాట, ఇది మల్లెల వేళయనీ,  ఎవరు నేర్పేరమ్మ... ఈ కొమ్మకు  ఈ పాటలు అన్నీ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్యమైన పాటలు . దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లాపిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం.   కృష్ణశాస్త్రి గారి పాటలు అన్ని అమృత గుళికలే.  ఈయన ఆధునికాంద్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిబావంతుడైన రచయిత.  భావకవిత్వపు, ప్రచారకుడు క్రుష్ణపక్షానికి వెలలేని వెన్నెల వెలుగులు అందించిన చంద్రుడు.   తెలుగుకు వెలుగులు తెచ్చి సూటిదనాన్ని, సున్నితత్వాన్ని సాహిత్యపు కమ్మని రుచిని అందించిన ఆధునిక బావకవి దేవులపల్లి వారు. శ్రీ  దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు రచించిన మంచి దేశభక్తి గీతం  

పల్లవి :
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్త్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల
సుశ్యామల చలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయశయ
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరిశోధన
జయ గాయక వైతాళిక
కల విశాల పద విహరిణి
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||

శనివారం, సెప్టెంబర్ 21, 2013

గురజాడ అప్పారావు

శనివారం, సెప్టెంబర్ 21, 2013


దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. 
ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.  గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.  అప్పారావుగారు అన్నారు "ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది" అని అన్నారు.  ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.  గురజాడ అప్పారావు గారు (1862-1915) తెలుగు భాష మహా కవి, తన రచన ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించినవారు.గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు. హేతువాది19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.  వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు వీరి "కన్యాశుల్కం" తెలుగు అన్నిటికన్నా గొప్ప నాటకం అని చెప్పవచ్చు. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన వీరు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలోముఖ్యులు. వీరికి "కవి శేఖర" అనే బిరుదు కూడా కలదు.
అప్పారావు గారు రచనలలో మనము ఎప్పుడు వినే మాట 
తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి 
డామిట్! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్‌
గట్టిమేల్‌ తలపెట్టవోయి
పాడి పంటలు పొంగిపొర్లె
దారిలో నువు పాటు పడవోయి
తిండి కలిగితే కండ కలుగును
కండ కలవాడేను మనిషోయి
యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్‌
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్‌
దేశాభిమానం నాకు కద్దని
వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్‌
పూని ఏదైనాను ఒక మేల్‌
కూర్చి జనులకు చూపవోయ్‌
చెట్టపట్టాల్‌ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్‌
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్‌
సొంత లాభం కొంత మానుకు
పొరుగు వానికి తోడుపడవోయ్‌
దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌

అప్పారావుగారి రచనలలో సారంగధర,  పూర్ణమ్మ,  కొండుభట్టీయం,  నీలగిరి పాటలు,  ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతిశతకము, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, 
లవణరాజు కల, కాసులు,సౌదామిని ,రాయాలనుకున్న నవలకు తొలిరూపం), కథానికలు,మీపేరేమిటి ,దిద్దుబాటు,మెటిల్డా,సంస్కర్త హృదయం, మతము విమతము ఇంకా చాలా రచనలు వున్నాయి. 
ఈరోజు అప్పారావుగారి 151 వ జన్మదినం సందర్భంగా సాహిత్యప్రియులందరికి 
" ఆధునిక తెలుగు సాహిత్య దినోత్సవ శుభాకాంక్షలు "  మరియు  అప్పారావుగారికి నివాళి అర్పిస్తున్నాము. 

గురువారం, ఆగస్టు 15, 2013

స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు . బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.

గురువారం, ఆగస్టు 15, 2013

100 సంవత్సరముల విదేశీయుల పాలన నుండి శాశ్వితాముగా  సంకెళ్ళ నుండి     విముక్తి పొందిన దినమును మనము స్వాతంత్ర్య 
దినోత్సవముగా జరుపుకుంటున్నాము.  ఈ సంవత్సరము మనము 67వ స్వాతంత్రయదినోత్సవముగా జరుపుకుంటున్నాము.
ఎందరో మహానుబావులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్ర్య భారతదేశానికి మనకు అప్పగించారు.
దీనికి కొంతమంది అహింసా మార్గములో ప్రయత్నించారు.
మరికొందరు హింసా మార్గములో ప్రయత్నించారు. 
చివరికి 1947 ఆగష్టు 15 న స్వాతంత్ర్యము పొందాం. అలా త్యాగాలు చేసి సాధించిన భారత మాతకు వందనం తెలుపుతూ. 
వారిని గుర్తు చేసుకొని జెండా ఎగురవేసాం కదా. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సందర్భముగా అందరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.
బంగారు పువ్వులు పూచే తల్లికి భారత దాత్రికి వందనం.

ఆదివారం, ఆగస్టు 11, 2013

Catch me live today @ 5:00 pm

ఆదివారం, ఆగస్టు 11, 2013

Catch me live today @ 5:00 Pm to 6:00 pm 

Stay Tune With 
RadioJosh  Masth Maza Masth Music.



2day's Topic : 
About Independence Day.
U r's Fav Freedom fighters.
U r's Fav Patriotic Song.
Skype Me™!

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)