అమ్మమ్మతో నా అనుభవాలు చాలా ప్రత్యేకమైనవి. నేను అమ్మమ్మతో గడిపిన సమయం చాలా అద్భుతం గా వుందెది. నాకు అమ్మమ్మతో గడిపిన చిన్ననాటి ప్రత్యేకమైన మధుర జ్ఞాపకాలు చాలా వున్నాయి. 😊 నా అనుభవాలు మీతో పంచుకుంటాను.
అమ్మమ్మతో నేను
అమ్మమ్మతో గడిపిన సమయం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి వేసవి సెలవుల్లో, నేను అమ్మమ్మ తో చలా సమయం గడిపేదానిని. ఆమె వంటలు చాలా రుచిగా ఉండేవి. నన్ను పక్కన కుర్చోపెట్టుకొని వంటలు చేసేది. అప్పుడు కధలు చేప్పేది. టేబెల్స్ అదే ఎక్కాలు చదివించేది, అలా ప్రథీరొజు చేసేది. ప్రతి ఉదయం, ఆమె నన్ను పక్కన కూర్చోబెట్టి, పాత కథలు చెప్పేది.
రోజూ అమ్మమ్మ నన్ను ఇంట్లో మొక్కలుదగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ పూల మొక్కలు, మరియు కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఆమె నాకు ప్రతి మొక్క గురించి వివరంగా చెప్పింది. ఒక రోజు నేను ఒక చిన్న మొక్కను నాటాను. అది పెరిగి పెద్ద చెట్టుగా మారింది. కాయలు కాసింది. అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది.
అమ్మమ్మతో గడిపిన ఆ రోజులు నాకు ఎప్పటికీ మరిచిపోలేనివి. ఆమె ప్రేమ, జ్ఞానం, మరియు సహనం నాకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటాయి.
మీకు అమ్మమ్మతో నేను నచ్చిందా? మీకు ఇంకా జ్ఞాపకాలు పంచుకోవాలనుకుంటే, దయచేసి చెప్పండి! 😊