Blogger Widgets

శుక్రవారం, జనవరి 13, 2012

బోగి పండగ శుభాకాంక్షలు

శుక్రవారం, జనవరి 13, 2012


గోదాదేవి గోపిక నాడు ఆచరించిన వ్రతమును తానూ అనుకరించి వ్రత సమాప్తి చేసి వ్రతఫలమును తానుకూడా పొందినది. శ్రీ కృష్ణ సమాగామంమును ఆనాడు గోపికలు పొందినట్లే మన గోదాదేవి తన ప్రియతముడగు శ్రీ రంగానాధుని భర్తగా పొందినది . శ్రీ రంగమునుండి రంగనాధుడు వ్రత సమాప్తి సమయమునకు తమ అంతరంగా భక్తులను ఆండాలమ్మ యుండిన శ్రీ విల్లిపుత్తురునకు పంపి ఆమెను శ్రీ రంగమునకు తోడి తెమ్మని ఆజ్ఞాపించెను .అంత భట్తనాదులు వారి శి ష్యులు వల్లభారాయులుతో సహా శ్రీ రంగమునకు ఆండాల్లమ్మను తోట్కుని వెళ్ళెను .అచట శ్రీ రంగనాధ స్వామీ అందరి సమక్షములో శ్రీ గోదాదేవిని తనలోచేర్చుకున్నారు. అందుచే గోదారంగానాయకుల కళ్యాణ దినమునకు భోగి ఆని పేరు .
భోగము = పరమాత్మ అను భావము                     అది పోందినరోజును భోగి పండుగగా సార్ధకమైనది .
మూడురోజులు పండుగ చాలా బాగాజరుపుకుంటారు. అసలైతే నెలరోజులు పండుగ వాతావరణమే వుంటుంది .  చలి ఎక్కువుగా ఉంటుంది. నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరనముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. రంగుల ముగ్గు మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుమ్డి బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . నెల రోజులు. నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .

 భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరాని వన్ని వేసి చలిని పారగోలుపుతారు. పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభ తో ఉంటుంది. పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.




 పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.                   

కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో


అనే పాటలు పాడుతూ వాటి చుట్టూ తిరుగుతారు. సాయంత్రము సమయములో చిన్నపిల్లలకు బోగిపల్లును దిస్తితీసి వారి తలమీద పోస్తారు. దీనికి పెరంటాల్లను పిలిచి బోగిపళ్ళు పోస్తారు. బోగిపల్లలోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసి పిల్లలకు దిష్టితీసి తలమీదవేసి ఆసిర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.


బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది. అందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. వివాహము చూడటానికి రెండుకళ్ళు చాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది

తిరుప్పావై త్రింశతి పాశురము

ఈ నెల రోజులు ధనుర్మాస వ్రతం బాగా చేసుకున్నాము కదా ఈ రోజు ఆకరి పాసురము.  ఈ వ్రతము సర్వఫలముల నొసంగు నది. అందరు ఆచరించదగినది. ఇట్టి ఈ వ్రతము నాచరింపలేక పొయినను నిత్యము ఈ ముప్పై పాశురములు తప్పక అభ్యాసము చెయువారికి కూడా తాను చేసిన వ్రత ఫలము లభించాలని గొదాదెవి ఈ పాసురములొ ఆశించినది నిత్యము ముప్పై పాసురాలు చదువుటయే ముక్తికి హేతువు . ఈ లోకమున ఐశ్వర్యప్రధము అగు ఇట్టి వ్రతమును తప్పక అందరు ఆచరించి తరింతురుగాక.
గోదాదేవి తాను గోపికగనే వ్రతమునుచెసినది. ఫలము భగవత్ప్రాప్తి , అట్టి భగవానుడే పొదుటకై చేసినయత్నము పాల సముద్రమును ఆనాడు మధించుటలో కాననగును. మనము స్వామిని పొందవలెనని ప్రయత్నము చే
యుటకంటె స్వామియే మనము పొందుటకు ప్రయత్నము చేయునట్లు ఆనాటి అమౄతమధన వృతాంతము నిందు కీర్తించుచున్నారు. ఈ ముప్పై పాశురములు పఠించిన వారికి ఆనాడు పాలసముద్రమును మధింపచెసిన లక్ష్మి ని పొందినట్లు సర్వేశ్వరుడు తనంత తానే ప్రయత్నంచి పొందును. ఇల్లా ఫలశ్రుతిని ఈ పాశురములో చేయుబడుచున్నది.
పాశురము: 
  వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై 
వఙ్గక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
త్తిఙ్గళ్ తిరుముగత్తు చ్చేయిళైయార్ శెన్ఱిఱైఞ్జ్

అఙ్గప్పఱైకొణ్డవాత్తై , యణిపుదువై
పైఙ్గమలత్తణ్డెరియల్ పట్టర్ పిరాన్ కోదైశొన్న
శఙ్గత్తమిళ్ మాలై పుప్పదుం తప్పమే
ఇఙ్గిప్పరిశురై ప్పారీరిరణ్డు మాల్వరైత్తోళ్

శెఙ్గణ్ తిరుముగత్తుచ్చెల్వత్తిరుమాలాల్

ఎఙ్గుం తిరువరుళ్ పెత్తంబురువ రెంబావయ్.


తాత్పర్యము:
ఓడలతో నిండియున్న క్షీరసముద్రమును మధింపచేసిన లక్ష్మీ దేవిని పొం మాధవుడైన వానిని, బ్రహ్మరుద్రులకు కుడా నిర్వాహకుడైన వానిని ఆనాడు వ్రేపల్లెలో చంద్రముఖులగువారును, విలక్ష్నణాభరణములు దాలిచిన వారు అగు గోపికలు చేరి , మంగళము పాడి, పఱ అను వాద్యమును లోకులకొరకును, భగవద్దస్యమును తమకొరకు ను పొందిరి . ఆ ప్రకారము లొకమునంతకును లోకమునకు ఆభరణమైఉన్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి, సర్వదా తామర పూసలమాలను మెడలొ ధరించిఉండు శ్రీ భట్టనాధుల పుత్రిక అగు గోదాదేవి ద్రావిడ భాషలో ముప్పై పాశురములలో మాలికగా కూర్చినది.
ఎవరీ ముప్పది పాశురములను క్రమము తప్పక చదువుదురో , వారు ఆనాడు గోపికలా శ్రీ కృష్ణుని నుండి పొందిన ఫలమును గూడ పొందుదురు. కేవలము అధ్యయనము చేయుటచేతనే , పుండరీకాక్షుడును, పర్వత శిఖరములవంటి బాహుశిరస్సులు గలవాడును అగు శ్రీ వల్లభుడును చతుర్భుజుడును అగు శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్ర సర్వదా ఆనందమును ప్రసాధించును. అని ఫలశ్రుతి పాడిరి.



సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

ఆండాళ్ తిరువడి గళే శరణం 
 జై శ్రీమన్నారాయణ్ 
సర్వేజనా సుఖినో భవంతు 
ఓం శాంతి శాంతి శాంతీః 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)