ఒక రైతుకు ఒక కోడి ,ఒక పిల్లి ఉండేవి. కోడికి పిల్లికి ఎప్పుదూ పడదు కదా!
ఒక రోజు పిల్లి , కోడిమేడను తన నోటితో పట్టేసింది. ఆ దృశ్యాన్ని చూసిన రైతు , పిల్లిని బాగా కొట్టాడు.
కొన్ని రోజులయినా తరువాత అతనికి పంట చాలా బాగా పండింది . కోతలు పూర్తి అయ్యినతరువాత ధాన్యాన్ని ఇంటికి తెచిపెట్టాడు .సహజంగానే ఎలుకలు చేరేయి. ఆ దాన్యంకొట్టులో కి పిల్లి ప్రతీ రాత్రి ఎలుకను పట్టేసింది. ఆ రైతు పిల్లిని ఒడిలో తీసుకొని దాని శరీరాన్ని ప్రేమతో నిమిరాడు. ఒకే పిల్లి తన నోటితో కోడిని పట్టితే దెబ్బలు తిన్నది. ఎలుకలను పట్టితే
ప్రెమించబడింధి. దీనికి కారణం ఏమిటి ? కోడిని పట్టినందు వల్ల రైతుకు నష్ఠం , ఎలుకని పట్టడం రైతుకు లాభం .
లాభ నస్టాలు రెండిటికీ పిల్లె కారణం .
అటులనే ఫలితాలను బట్టి మనం ఒకటి మంచిదని , మరొకటి చెడ్డధని నిర్ణయిస్తాము .
సోమవారం, డిసెంబర్ 01, 2008
శనివారం, నవంబర్ 29, 2008
నిజమైన దీపావళి
శనివారం, నవంబర్ 29, 2008
చెడు పై మంచి విజయం సాధించటాననే మనం దీపావళి గా జరుపుకుంటాము . అయితే మన దీపావళి పోయిన అమావాస్య దీపావళి కాకుండా ఈ రోజు మన దేశంలో చొరబడి న దుండగులపై మన సైనికులు ,పోలిసులు చేసిన యుద్దములో విజయం సాదిమ్చాము . ఇది మన అందరి విజయం .ఈ రోజే నిజమైన దీపావళి . ఈ పోరాటం లో అసువులు బాసిన అశోక్ కాంటే ,హేమంత్ కర్కరే, విజయ్ సల్సాకర్ ,మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లకు మనం ఏమి చేసినా వారి ఋణం మనం తీర్చుకోలేము. వారు మన దేశం కోసం వారి ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పోరాడారు. నిజంగా వారె నిజమైన హీరోలు . వారికి నా హ్రుధయపూర్వక నివాళ్ళు సమర్పిస్తున్నాను .
శుక్రవారం, నవంబర్ 28, 2008
వేమన పద్యం
శుక్రవారం, నవంబర్ 28, 2008
మా అమ్మమ్మా ఈ రోజుల్లో ఎవరు నీతి పద్యాలూ నేర్చుకోవటం లేదని. నా లాంటి పిల్లలకి ఈ పద్యాలు తెలియాలన్న వుద్దేశం తో ఈ పద్యం నాకు నేర్పించి ఇందులో పెట్టమంది నాలాగే మీరు నేర్చుకుంటారు కదూ. ఒకే మరి ముందుగా వేమన పద్యం ఒకటి .
చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియుఁ గొదవ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినుర వేమ!
కొంచమైన నదియుఁ గొదవ గాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత?
విశ్వదాభిరామ వినుర వేమ!
తా|| ఓ వేమా! వినుము. వైరాగ్యముతో ఆత్మానందము నోండేది. నిర్మలమైన మనస్సుతో ఏ కొంచెము పుణ్యకార్యము చేసిననుఆది చాలా ఘనమైన ఫలము నిచ్చును. చాలా చిన్నదైన మఱ్రి విత్తనము నుండి మహా వృక్షముగా ఎలా పెరుగుతుందో కదా .
గురువారం, నవంబర్ 27, 2008
కార్తీకం
గురువారం, నవంబర్ 27, 2008
కార్తీక మాసం అయ్యిపోయిందండి . ఈ నెలరోజులు శివ నామస్మరణతోని, విష్ణునామస్మరనతోని దేవాలయాలలో దీపారాధనతోని ,పురానలపటనంతోను ,నదీజల స్నానాలతోని , దానధర్మాలతో , గడిచి పోయింది కదండి. ఆ పరమేశ్వరుడు అందరినీ సర్వవిధాలా కాపాడాలని మనస్పూర్థిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయః ,ఓం నమః శివాయః ఓం నమః శివాయఃఓం నమః శివాయః
ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)