Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 14, 2008

బ్లాగ్ దినోత్సవ సందర్భముగా -ఏడు వక్రాలు మానుదాం

ఆదివారం, డిసెంబర్ 14, 2008

తెలుగు బ్లాగ్స్ దినోత్సవం గా ఈ రోజు జరుపుకుంటున్నాము . నా తరపునా, నా వెనుక వుండి నా ద్వారా లహరి.కం బ్లాగ్ నడిపిస్తున్న మా అమ్మమ్మ తరపున తెలుగు బ్లాగుల లోకానికి అందరి మా హృదయపూర్వక శుభాకాంక్షలు .
మీరు నన్ను నా బ్లాగ్ ను సహృదయముతో ఆశిర్వదిస్తున్నందుకు . బ్లాగార్లన్ధరకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఎక్కడైనా నా తప్పులున్నా సహృదయముతో మన్నించగలరు.
తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్బముగా అందరికి నాకుతెలిసిన మంచి విషయం ఈ రోజు అందిస్తున్నాను అందు కొండి .ఏడు వక్రమార్గాలు వదులుకో :
కష్టపడకుండా వచ్చిన ధనం
ధర్మా ధర్మ విచక్షణ కోల్పోయి పొందిన ఆనందం
శీలం లేని జ్ఞానం
పరోపకారం లేని మతం
నీతినియమాలులేని రాజతంత్రం
మానవత్వం లేని శాస్త్రజ్ఞానం
నీతిలేని వ్యాపారం
ఈ ఏడు వక్రమార్గాలు అని మన జాతిపిత గాంధి గారు అన్నారు. ఇవి పాటించుదాం .

కాస్త కలా పోసన వుండాలి - గోదారి అందం


మనిషన్నాకా కాస్తో కూస్తో కలాపోసనవుండాలి . లేకుంటే మనిషికి గొడ్డుకి తేడా ఎటుంటాధి ? ఇది భద్రాచలం ఎల్తావుంటే నావలోనుంది చూస్తావుంటే ఉదయిస్తున్న సూర్యుడి తో గోదారమ్మ ఎంత అందముగావుందో. ఆ అందాన్ని ఎవరైనాచూసి తీరాల్సిందే . అబ్బో ఏమి అందమో . మీరు చూడండి ఈ గోదారి అందం . నేను సెప్పింది నిజమేనా ...........?

శనివారం, డిసెంబర్ 13, 2008

అందమైన పక్షులు ..

శనివారం, డిసెంబర్ 13, 2008

అందమైన పక్షులు లండన్లో నాకు నచ్చినవి . మీరూ చూస్తారా అయితే చూడండి . ఆ పక్షులు ఫోజు బలేవుంది కదా..

గురువారం, డిసెంబర్ 11, 2008

దత్తం వందే జగద్గురం -జగద్గురువులు

గురువారం, డిసెంబర్ 11, 2008


హాయ్ ! బాగున్నారా ! రేపు శ్రీ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయులవారి జన్మదినము . అందువల్ల మా అమ్మమ్మ గురుచరిత్ర పారాయణ చేస్తోంది. అప్పుడు నాకు సులువుగా వుంటుందని ఇది నేర్పించింది.

దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానంత మద్వయం
ఆత్మరూపమ్ వరందివ్యం అవధూత ముపాస్మహే
నగురో రధికం తత్త్వం నగురోరధికం తపః
నగురో రధికం జ్ఞానం తస్మై శ్రీగురువేనమః !

శ్రీ రాముడు , శ్రీ కృష్ణుల అవతారలకంటే ముందే , కృతయుగములో శ్రీ దత్తాత్రేయులవారి అవతారం జరిగింది. దత్తత్రేయులువారు ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేనిఅవతారం కాదుట !.................మా అమ్మమ్మ చెప్పింది. ఏదో ఒక రూపంలోనే కనిపించే అవతారం కాదుట. ఎల్లప్పుడూ వుండి వివిధ రూపాలలో
ఒక్కొక్కసారి తెలిసేలా
ఒక్కొక్కసారి తెలియకుండా రహస్యమ్గా విచిత్ర, విలక్షణ అవతాముర్తి శ్రీ శ్రీ దత్తాత్రేయులు .
భగవాన్ షిరిడి సాయిబాబా వంటి మహనీయులను దత్తాత్రేయ ముర్తిగానే భావించి సేవించటం జరుగుతోందట.
జగత్తునే గురువుగా బావించి జగద్గురువు అయినమహాముర్తి . గురువు కంటే అధికమైన తత్త్వం కాని, తపస్సుగాని , జ్ఞానం కాని లేదు . అందుకే ఆయన జగద్గురువు అయ్యారు.
ఒకసారి యయాతి వంసియుడు యదుమహారాజుకు శ్రీ దత్తాత్రేయులవారు యువకుని రూపంలో గురువులగురిమ్చి చెప్పారు. ఆయనకీ 24 మంది గురువులని చెప్పారుట .
అవి ఏమిటి అనిఅడిగితే? అవి
భూమి , పర్వతం , వాయువు, ఆకాశం , జలం , అగ్ని , చంద్రుడు , సూర్యుడు , పావురం , కొండచిలువ , సముద్రం , కీటకం , తుమ్మెద , తేనెటీగ , ఏనుగు , లేడి , చేప , వేశ్య , ఉడుత , బాలిక , విలుకాడు , సర్పం , మట్టిపురుగు , సాలెపురుగు ఇవే నాగురువులు అన్నారు.
వీరంతా మీ గురువులా అని యదు రాజు అడుగగా అవును వీరే నాగురువులు అని చెప్పారు. వారు ఎలాగురువులో వివరించి చెప్పారు. మట్టి పురుగునుండి ఆకాశాన వున్నాసూర్యుని వరకు గురువులే అని చెప్పారు.
ఈ జగత్తును గురువులుగా గుర్తించారు.
నేర్చుకోవాలంటే ప్రకృతిలోని ప్రతీ అణువు మనకు పాఠం చెబుతుందని భోధిస్తారు. జగత్తుకే పరమగురువులయిన దత్తాత్రేయులవారు. యదుమహారాజుకు .
అయితే మనం ఆగురువులకు , జగత్గురువుకు మనం కుడా వందనములు తెలుపుదామా మరి.!

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)