మంగళవారం, డిసెంబర్ 16, 2008
తిరుప్పావై మొదటి పాశురం - నారాయణ తత్వము
ఆండాళ్ తిరువదిగాలే శరణం :
గోపికలు ఈ వ్రతము చేయుటకు అనుకూల కాలము మనకు లభిమ్చిందే అని ఆ కాలమును ముందుగా పోగాడుచున్నారు.
ఈ వ్రతము ఎవరు చేయుటకు తగినవారో నిర్ణయించుకున్నారు. ఈ వ్రతము చేసి తాము పొందదగిన ఫలమేమో , దానిని పోదిమ్చు సాధనమేమో స్మరించుచు ఈ మొదటి పాటలో అనంధించుచున్నారు.
మన గోపికలు మరియు గోదాదేవి.
పాశురము:
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
ప్రతిపదార్దము:- శీర్ మల్ గుమ్ = సంపదలు పెరుగుచున్న , ఆయ్ ప్పాడి = వ్రేపల్లెలో , శేల్వమ్ = ఐశ్వర్యముతో నిండిన, శిరుమీర్ కాళ్ = పడచులారా! ,నేరళైయీర్ = విలక్షణ్ములయిన ఆభరణములను కలవారలారా! మార్గళిత్తింగళ్ = మార్గశీర్షమాసమున్ను, మది నిఱైంద = నిండు చందురుడుగల , నల్ + నాళ్ = మంచి రోజున్ను (వచ్చినవి) ఆల్ = ఓహో ! కూర్ = వాడి అయిన , వేల్ = వేలాయుధమును ధరిచినవాడై , కొడుం తొళిలన్ = కృష్ణుని విషయములో అపచారము చేయువారిపై క్రూరముగా ప్రవర్తించి కృష్ణునకు సేవచేయు , నంద గోపన్ = శ్రీ నంద గోపుల యొక్క , కుమరన్ = కుమారుడున్ను , ఏర్-ఆర్ నందకణ్ణి = సౌందర్యముతో నిండిన కన్నులు కల , అశోదై = యశోదా దేవి యొక్క , ఇళం శింగం = బాల సిమ్హమున్ను , కార్ మేని = తాపమును పోగొట్టు నల్లని శరీరముకలవాడును, శెంగణ్ = ఎఱ్ఱని నేత్రములు కలవాడును, కదిర్ మదియంబోల్ = సూర్యుని చంద్రుని పోలిన , ముగత్తాన్ = ముఖమును కలవాడైన , నారాయణనే = నారాయణుడినె నమక్కే = మనకే, పఱై = మనచే వాంచింపబడిన సాదనమును-పరను , తరువాన్ = ఇచ్చువాడు, పారోర్ = చూచువారు, పుగళ = పొగడునత్లు , పడిందు = ఈ వ్రతములో చేరి , నీరాడ ప్పోదువేర్ = మార్గశీర్ష స్నానముచేయు గోరువారు, పోదుమినో =రండు , ఏల్ = ఈవిధముగా ఓ జనులారా ! ఎంబావాయ్ = మా వ్రతమయి యున్నది, ఓర్ = ఈ వ్రతమునూ చేరుటకు మనసుపెట్టుడు. " ఏలో రెంబావాయ్ " అనునది ప్రతి పాశురమునకు చివర కు వచ్చు మకుటము.
తాత్పర్యము :- ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.
అని అర్దము
సోమవారం, డిసెంబర్ 15, 2008
ధనుర్మాసం - గోదాదేవి ప్రార్ధన .
ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవే పాడిన ౩౦పాసురాలును పాడతారు .
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా
ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరనముతో విశేషమైన
ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ టెంపుల్స్
లో రోజుకో పాశురాలు చదువుతారు .
ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమ నిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగానుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.
అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మ కు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు ఈ శ్లోకం తో విన్నవించారు.
నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
అని పరాసుర భట్టరు వారు కీర్తించారు.
శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .
మనము అనాధి మాయచె నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆ పరమాత్మకె ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలా పాశములలొ బంధించింధి.
తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి.
ఈ స్తితి కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమేకు "ఆంక్తమాల్యద" అని పెరు వచ్చినది.
మాలలు తయారు చెయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు.
కోదై అంటే గోదా అని అర్దం.
ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను .
గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.
ఆదివారం, డిసెంబర్ 14, 2008
బ్లాగ్ దినోత్సవ సందర్భముగా -ఏడు వక్రాలు మానుదాం
తెలుగు బ్లాగ్స్ దినోత్సవం గా ఈ రోజు జరుపుకుంటున్నాము . నా తరపునా, నా వెనుక వుండి నా ద్వారా లహరి.కం బ్లాగ్ నడిపిస్తున్న మా అమ్మమ్మ తరపున తెలుగు బ్లాగుల లోకానికి అందరి మా హృదయపూర్వక శుభాకాంక్షలు .
మీరు నన్ను నా బ్లాగ్ ను సహృదయముతో ఆశిర్వదిస్తున్నందుకు . బ్లాగార్లన్ధరకు నా ప్రత్యేక ధన్యవాదములు. ఎక్కడైనా నా తప్పులున్నా సహృదయముతో మన్నించగలరు.
తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్బముగా అందరికి నాకుతెలిసిన మంచి విషయం ఈ రోజు అందిస్తున్నాను అందు కొండి .ఏడు వక్రమార్గాలు వదులుకో :
కష్టపడకుండా వచ్చిన ధనం
ధర్మా ధర్మ విచక్షణ కోల్పోయి పొందిన ఆనందం
శీలం లేని జ్ఞానం
పరోపకారం లేని మతం
నీతినియమాలులేని రాజతంత్రం
మానవత్వం లేని శాస్త్రజ్ఞానం
నీతిలేని వ్యాపారం
ఈ ఏడు వక్రమార్గాలు అని మన జాతిపిత గాంధి గారు అన్నారు. ఇవి పాటించుదాం .