బుధవారం, డిసెంబర్ 31, 2008
ఆండాళ్ తిరువడిగలే శరణం :
గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి నంద గోప భవనమునకు చేరిరి. పదిమంది మాత్రమె కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కలగోపికలను అందరను మేలుకొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోన ప్రవేసింతురు .
పాశురము:
నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్
వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము:
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భావనపాలకా లోనికి విడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమును కాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలను తెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణ పరమాత్మ ద్వని చేయ "పఱ " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేను మాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదు. పవిత్రమైన భావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకు వచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు . దగ్గరగా ప్రేమతో ఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు.
జై శ్రీమన్నారాయణ్ .
మంగళవారం, డిసెంబర్ 30, 2008
ఆండాళ్ తిరువడిగళేశరణం :
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పడవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనితో ముందు భాగము పూర్తవుతుంది. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహెను పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచె ఈ వ్రతము నాకు పుర్వరంగామునుతెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈ నాడు మేల్కొల్ప బడుచున్నది.
పాశురము :
ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కు బయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.................
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా.
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము.
జై శ్రీ మన్నారాయణ్
సోమవారం, డిసెంబర్ 29, 2008
ఆండాళ్ తిరువడిగళేశరణం:
ఈ పాశురములో అందరికంటే ముందుగా మేల్కొని, మిగిలిన వారిని కూడా లేపెదనని చెప్పిన ఒక గోపిక మేల్కొల్పబడుచున్నది . ఈమె వీరి సంఘమున కంతకు నాయకురాలై నడిపించగల శ క్తిగాలది .
తన పూర్వ అనుభావముచే ఒడలు మరచి తానూ చేసిన ప్రతిజ్ఞను కూడా విస్మరిచి ఇతర గోపికలను మేలుకొలుపుట మరచి తన ఇంటిలోనే తానూ ఉండిపొయినది .
ఈమె ఇంటిలో ఒక పెద్ద తోట గలదు . పెరటివైపున వున్నా ఆ తోటలో దిగుడు బావికలదు. ఆ దిగుడు బావిలో తామర పూలు , కాలువలు , ఉన్నవి ఆమె తన్మయత్వముతో అనుభావిచుచు ఇతరంలనే మచి ఉన్నది. అట్టి స్థితిలో ఉన్నా గోపికను నేడు మేల్కొల్పుతున్నారు .
పాశురము:
ఉంగళ్ పురైక్కడై త్తోట్టత్తు వావియుళ్
శెంగరునీర్ వాయ్ నెగిర్ అంద్ ఆమ్బల్ వాయ్ కుమ్బిన కాణ్
శెంగల్పొడి క్కూరై వెణ్బల్ తవత్తవర్
తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్ఱార్
ఎంగళై మున్నం ఎరుప్పువాన్ వాయ్ పేశుమ్
నంగాయ్! ఎరుందిరాయ్ నాణాదాయ్! నావుడైయాయ్
శంగోడు చక్కరం ఏందుం తడక్కైయం
పంగయ క్కణ్ణానై ప్పాడ-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము: స్నానము చేయుటకు గోపికల నందరను లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒకామె ను ఇందు మేల్కొల్పుచున్నారు . ఓ పరిపుర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలోని ఎర్రతామరాలు వికసించినవి కాలువలు ముడుచుకోపోతున్నవి లెమ్ము ! ఎర్రని కాషాయములను దాల్చి తెల్లని పల్లువరస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలాయములలో ఆరాధన చేయుటకు పోతున్నారు లెమ్ము. మమ్ములను ముందుగానే మేల్కొని వచ్చి లేపుదనని మాట ఇచ్చావు మరచావా ?
ఓ లజ్జావిహీనురాలా లెమ్ము ! మాట నేర్పు కలదానా ! శంఖమును ,చక్రమును ధరించిన వాడును , ఆజాను భాహువును అయిన పుండరీకాక్షుని మహిమను గానము చేయుటకు రమ్ము.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ