ఇప్పుడే పుట్టింది ఈ పిల్లి కూన . బలేగా వుంది . నేనైతే దీనిని చూసి బలే బలే ఆడు కున్నాను . మీరు చూడండి ఇది నడవటం లేదు . కళ్లు తెరవలేదు. లేవటానికి ట్రై చేసి జారి పోతోంది .
బలే బలే బాగుంది చిన్నపిల్లి పిల్ల .
మంగళవారం, ఫిబ్రవరి 17, 2009
ఆదివారం, ఫిబ్రవరి 15, 2009
శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009
పొడుపు కధలు విప్పండి
శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009
నేను పొడుపు కధలు అడుగుతాను విప్పుతారా ఇదిగో మరి కాచుకోండి .
1)అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నీరెండే కాయలు ఏమిటది ?
2)అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది . మా ఇంటికొచ్చింది . మాహాలక్ష్మిలాగుంది. ఏంటదీ?
౩)అగ్గి అగ్గీ ఛాయా, అమ్మకుంకుమచాయ, బొగ్గు బొగ్గు చాయా, పోలిచాయ కందిపప్పు ఛాయా ,కాలనేమి ఛాయా, కడసారి తాతయ్య కణితి చాయా ఏమిటది .
4) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా, బ్రతికిన పిట్టను కొట్టవద్దురా, చచ్చినపిట్టను తేవద్దురా కూరను లేకుండా రాను వద్దురా ఏమికూర చెప్పండి.
5)పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది , తెచ్చుకోపోతెను గుచ్చుకుంటుంది ఏమిటది?
తెలిస్తే తొందర గా చెప్పేయండి మరి .
మంగళవారం, ఫిబ్రవరి 10, 2009
మీరు చెప్పండి ........ ఎన్ని SQUARES?
మంగళవారం, ఫిబ్రవరి 10, 2009
అందరికి హాయ్ !
నన్ను సత్య ప్రసాద్ అరిపిరా అంకుల్ అడిగారు .
ఒక ఛెస్ బోర్డు లో ఎన్ని SQUARES ఉంటాయని. మీరు చెప్పండి .......ఎన్ని SQUARES ఉంటాయి.
తెలిసీ చెప్పక పోయారో తల ......................
కాబట్టి చెప్పేయండి. నాకైతే తెలీదు మరి అందుకే చెప్పండి ఓకేనా.
తొందరగా చెప్పండి . I am waiting.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)