లక్ష్యనిర్దేశనం :
సుర్యోదయాన్నే పక్షులు రెక్కలు విచ్చుకొని ఆహార సంపాదనకు ఎగిరిపోతాయి. అది వాటి లక్ష్యము . ప్రపంచము ఏమైనా వాటికి అనవసరము. సూర్యుడు సాయంత్రానికి పడమటి దిక్కుకు వాలినా మర్నాటికి పొద్దున్నే తూర్పునకు ఉదయిస్తాడు . లోకానికి వెలుగును ప్రసాదిస్తాడు. అది ఆయన లక్ష్యం. కారు మబ్బులు కమ్మినా, తుపానులే వచ్చినా తన మార్గమునుంచి పక్కకు తప్పుకోడు. మనమూ అలాగనే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. గడిచిన కాలం ఎలా ఉన్నా ముందు ముందున్న అత్యన్నత స్తాయికి చేరాలన్న లక్ష్యాన్ని నిర్దేసించుకోవాలి. లక్ష్యం లేని జీవితం గాలిలో పెట్టిన దీపంలాంటిది. అత్యున్నత స్తాయికి చేరాలన్న కోరిక వున్నంత మాత్రానా కోరిక నెరవేరదు. దానికి తగ్గ కృషి పట్టుదల ఉండాలి. దానికి తగ్గ లక్ష్య్ నిర్దేశం వుండాలి. లక్ష్య నిర్దేశం లేక పొతే జీవితములో ఏమి సాదించలేము.
ఇదంతా మా అమ్మమ్మ నాకు చెప్పింది. నేను డాక్టర్ కావాలన్న లక్ష్యం ఏర్పరచుకున్నాను . ఆ లక్ష్యానికి నాకు ఎన్ని అడ్డంకులు వచ్చినా అవ్వాలని అనుకుంటున్నాను. నేను ఆ దిశ గానే ప్రయత్నిస్తాను.
thanks to అమ్మమ్మ.
గురువారం, ఫిబ్రవరి 19, 2009
మంగళవారం, ఫిబ్రవరి 17, 2009
పిల్లి కూన
మంగళవారం, ఫిబ్రవరి 17, 2009
ఆదివారం, ఫిబ్రవరి 15, 2009
శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009
పొడుపు కధలు విప్పండి
శుక్రవారం, ఫిబ్రవరి 13, 2009
నేను పొడుపు కధలు అడుగుతాను విప్పుతారా ఇదిగో మరి కాచుకోండి .
1)అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు, అన్నీరెండే కాయలు ఏమిటది ?
2)అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది . మా ఇంటికొచ్చింది . మాహాలక్ష్మిలాగుంది. ఏంటదీ?
౩)అగ్గి అగ్గీ ఛాయా, అమ్మకుంకుమచాయ, బొగ్గు బొగ్గు చాయా, పోలిచాయ కందిపప్పు ఛాయా ,కాలనేమి ఛాయా, కడసారి తాతయ్య కణితి చాయా ఏమిటది .
4) పిఠాపురం చిన్నవాడా, పిట్టల వేటగాడా, బ్రతికిన పిట్టను కొట్టవద్దురా, చచ్చినపిట్టను తేవద్దురా కూరను లేకుండా రాను వద్దురా ఏమికూర చెప్పండి.
5)పచ్చని పెట్టెలో విచ్చుకోనుంది , తెచ్చుకోపోతెను గుచ్చుకుంటుంది ఏమిటది?
తెలిస్తే తొందర గా చెప్పేయండి మరి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)