శనివారం, మార్చి 21, 2009
గురువారం, మార్చి 19, 2009
బుధవారం, మార్చి 18, 2009
తండ్రి మాట !
ఫిలిప్ సిడ్ని గొప్ప తత్వవేత్త . అతడు చదువుకొంటున్నప్పుడు వేరే ఉరిలో బడి ఉండేది. అక్కడి కి వెళ్లి చదువుకొనేవాడు. అతనికి ఒకసారి అతని తండ్రి ఒక ఉత్తరం రాసాడు.
"నాయనా! నీవు రోజు దేవుడిని మనసారా ప్రార్ధించు. నీ మనసును దేవుని సన్నిడికి చేర్చటానికి ప్రయత్నించు అనీ , నీ తోటి పిల్లలతోను, టీచర్స్ తోను,మంచిగా వుండు .కోపము, ఆవేశము , నిరాశా, నీ దగ్గరకు రానీకు. నిన్నేవరైనా ఏమైనా అంటే నువ్వు భాదపడకు, ఎవరైనా పొగిడినా పొంగిపోకు, నీవు ఎవరినీ ఏమీ అనకు. అన్నిటికన్నా ముక్ష్యమైనది విషయం రాస్తున్నాను. గుర్తు పెట్టుకో. నీవు దేవుని దగ్గర తప్ప ఇంకెక్కడా ప్రామిస్ చేయకు. నీ నాలుకను వాసములో పెట్టుకో. సమాజములో ఆదర్సవంతమైన పిల్లోడుగా వివేకవంతునిగా మంచి ఆలోచనా, వివేక విదేయతలతో మెలగు. ఈ విధముగా పూర్వము తండ్రులు తమ పిల్లలకు హితబొద చేసేవారు. ఫిలప్ సిడ్ని గొప్పతత్వవేత్త గా ఎదగటానికి కారణం, అతని తండ్రి యొక్క మాటలను. ఆజ్నలను శిరసా వహించి ఆ విధముగా వ్యవహరిమ్చటమే.
ఆనాడు తండ్రులు పిల్లలకు మంచి విషయాలు చెప్పేవారు. ఈనాటి తండ్రులకు పిల్లలతో టైం స్పెండ్ చేయటానికే కాళీ ఉండటం లేదు , ఇక మంచి విషయాలు ఎప్పుడు చెప్పగాలుతారు. తమ పిల్లలను ఆదర్సమైన పిల్లలాగా ఎలా తీర్చదిద్దుగలరు. ఇది ఆలోచించవలసిన విషయమే.