స్కూల్ ఎగ్జామ్స్ అయ్యిపోయాయి సమ్మర్ సెలవులు ఇచ్చారు . ఫుల్ సందడే సందడి . హోం వర్క్స్ లేవు , చదువులు లేవు, ఆటలే ఆటలు, పాటలు చాలా సందడి చెయ్యాలని వుంది అందులో బాగంగా నృత్యము, సంగీతము నేర్చుకుంటున్నాము. కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ప్లానే చేసుకున్నాము మీరు నాతో సందడి చేయటానికి రడీ కండి మరి .
మాతాత (శ్రీ చింతా . రామ కృష్ణా రావు ) అధ్యక్షణ తో శ్రీ ముత్యం రామమూర్తి సంగీత కళా పీఠం స్థాపించబడింది. సమ్మర్ లో నాలాంటి వారి కోసం వేసవి ఉచిత సంగీత ,నాట్య శిక్షణా శిభిరాన్ని ప్రారంభించారు. సిక్షనామ్సములు కర్ణాటకా సంగీతము, కూచిపూడి నాట్యము, నేర్పిస్తున్నారు . మా గురువుగారి పేరు " పంచముఖి తలావదాన తరుణ భాస్కర " శ్రీ ముత్యం రామకామేశ్వర రావు గారు.
ఈ కార్యక్రమానికి మూలము శ్రీమతి పి . మీనాక్షి&రాజశేఖర్ గారు , శ్రీ చింతా . రామకృష్ణారావు గారు , శ్రీ ముత్యం రామ కామేశ్వరరావు, శ్రీ పాకాల సురిబాబుగారు, మొదలగు ప్రముఖులు కలరు,
ప్రారంభోత్సవము : ప్రముఖ టీవీ మరియు రేడియో కళాకారిణి శ్రీమతి ఇందిరా బాల భాగవతారిని గారిచే ప్రారంబించబడింది . so I am bizzy in summer also. oke .
శుక్రవారం, మే 01, 2009
శనివారం, ఏప్రిల్ 25, 2009
ద్వారకా తిరుమల ( చిన్న తిరుపతి)
temple లో గోపాలుని అందాలు .
temple లోపల అందాలు
అన్నమాచార్యుని విగ్రహము
అన్నమాచార్యుని విగ్రహం ఒక వేపునుమ్డి
మెట్లు temple కి
ముఖ ద్వారమునుండి లోపలికి
ముఖ ద్వారం temple కి
పైనుండి temple
మేము ఈ మధ్య ద్వారకా తిరుమల వెళ్ళామండి . ద్వారకా తిరుమల అంటే వేంకటేశ్వర స్వామి వారి ప్రసిద్ధ క్షేత్రం. పశ్చిమ గోదావరి జిల్లా లో ఏలూరు దగ్గర వుంది . చాలా బాగుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామీ మూడు విగ్రహాలలో మూడు స్టెప్స్ గా దర్సనం ఇస్తారు. మొదటిది మూల విరాట్ స్వరూపం , రెండవది స్వయంభు స్వరూపము, మూడవది ఆరాధనా స్వరూపము గా దర్శనము ఇస్తారు. గుడి చాలా బాగుంది.ఫోటోలు తీసాము , మీరు చూడండి .
శుక్రవారం, ఏప్రిల్ 10, 2009
శ్రీ వైష్ణవి పుట్టిన రోజు శుభాకాంక్షలు
మా బంగారు తల్లి శ్రీ వైష్ణవి కి ముందుగా పుట్టిన రోజు శుభాశిస్సులు. ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని , మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తు .
ఆ పెదవిపై విరిసే చిరునవ్వు కుసుమం ....
కనులలో మెరిసే లేత సోయగం ...
మనసులో ఉపొంగే సంతోసం ..
నడకలో కదిలో విశ్వాసం ...
చెప్పకనే చెపుతున్నది విషయం ....
నేటి విశేసం ... నీ జన్మదినం .....
నీ పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలుపుతూ , అమ్మా , తాత, అమ్మమ్మ , మావయ్యా మొదలుగున్నవారు.
శుక్రవారం, ఏప్రిల్ 03, 2009
శ్రీ రామ నవమి
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
శ్రీ రాముడు రోజున జన్మించిన మరో మనము శ్రీ రామ నవమి జరుపుకుంటున్నాము.
సీతారాముల కల్యాణం మహోత్సవం , శ్రీ రామ చంద్రమూర్తి రావణుని వధించి విజయవంతముగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజు కుడా ఈ రోజే. ఆ మరుసటి రోజునే శ్రీ రాముని పట్టాభిషేకము జరిగింది. ఇది ప్రతీ హిందువు కు మరపురాని సంతోషకరమైన రోజు .
ఏక శ్లోకీ రామాయణం :
పూర్వం రామతపోవనాని గమనం హత్వామృగం కాంచనం
వైదేహీ హరణం , జటాయు మరణం, సుగ్రీవసంభాషణం
వాలీ నిగ్రహణం , సముద్ర తరణం , లంకాపురీ దహనం
పశ్చాద్రావణ కుంభకర్ణ నిధనం ఏతద్ధి రామాయణం .
శ్రీ రామనామ మంత్రం:
దశరథనందన శ్రీరామ నమో
అయోధ్య వాసి శ్రీరామ నమో
నీలమేఘశ్యామ శ్రీరమ నమో
జానకీనాథా శ్రీరామ నమో
హనుమత్సేవిత శ్రీరామ నమో
వాలీమర్ధన శ్రీరామ నమో
కోదండపాణి శ్రీరామ నమో
రావణసమ్హార శ్రీరామ నమో
కారుణ్యహృదయా శ్రీరామ నమో
భక్తవత్సల శ్రీరామ నమో
దశరథునికి ప్రియమైన కుమారుడు, నీలమేఘశ్యాముడు , సీతాదేవికి భర్త , భక్తుడైనా హనుమంతుని చేత సేవించబదినవాడు, వాలిని చంపిన వాడు చేతిలో కోదండమును కలిగినవాడు, దశకంఠుదు రావణుని చంపినవాడు , దయాహృదయం కలవాడు , భక్త వత్సలుడు అయిన శ్రీ రాముడుని నమస్కరిస్తున్నాను రామ నామ స్మరణ వల్ల మనసు పవిత్రంగా ఉంటుంది. కస్ట మైన పనులు కూడా సులువుగా చేయగలిగే శక్తి వస్తుంది.
మరో సారి అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. నమస్తె.