ఈ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి గా దర్శనము ఇస్తారు.లక్ష్మి దేవి హిందు వుల సాంప్రదాయం ప్రకారం మనకు సిరి సంపదలు, సౌభాగ్యం, సుఖ సంతోషాలును కలుగ జేసే మాత లక్ష్మి మాత. ఈమె క్షీరసముద్ర తనయ. త్రిముర్తులలో శ్రీమహావిష్ణువు అర్ద్దాంగి. అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భుషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనం గుడ్లగూబ. సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన (ప్రజానాం భవసి )సుక్తములో వివరించారు. శ్రీలక్ష్మి గురించి. దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
మహాలక్ష్మిదేవికి క్షీరాన్నము నైవద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరిన కోరికలు తీర్చేమాత.
అయిదవరోజు అమ్మవారు సరస్వతి మాతగా దర్శనము ఇస్తారు. ఈమె కనకాంబర వర్ణినిగా వుంటారు. చదువుకునేవారికి మంచి చదువును ప్రసాధించు తల్లి కావున ఈమెను చదువులు తల్లిగా కూడా అంటారు. తెల్లని వస్త్ర దానిణి చేతిలో వీణ పుస్తకాలు కలిగి వుంటుంది. ఈమెకి పెరుగన్నము నేవేద్యముగా సమర్పిస్తారు. స్కందమాత కుమార స్వామి, కార్తికేయుడు, శక్తిధరుడు అని ప్రసిద్ధుడైన స్కందుని తల్లి యైన దుర్గాదేవిని 'స్కందమాత'పేరున నవరాత్రులలో 5వ రోజున ఆరాధింతురు. ఈమె చతుర్భుజ. షణ్ముఖుడైన బాలస్కందుని ఈమెయొడిలో ఒక కుడిచేత పట్టుకొనియుండును. మరియొక కుడిచేత పద్మము ధరించియుండును. ఎడమవైపున ఒకచేత అభయముద్ర, మరొకచేత కమలము ధరించి, 'పద్మాసన' యనబడు ఈమెయు సింహవాహనయే.
స్కందమాతను ఉపాసించుటవలన భక్తుల కోరికలన్నియు నెఱవేఱును. ఈ మర్త్యలోకమునందే వారు పరమ శాంతిని, సుఖములను అనుభవించుదురు. స్కందమాతకొనర్చిన పూజలు బాల స్కందునకు చెందును.ఈ దేవి సూర్య మండల-అధిష్టాత్రి యగుటవలన ఈమెను ఉపాసించువారు దివ్య తేజస్సుతో, స్వచ్ఛకాంతులతో వర్ధిల్లుదురు.
నాలగవరోజు అమ్మవారు లలితా త్రిపురసుందరి దేవి గా మనకు దర్శనము ఇస్తారు.ఈమెకి అల్లంగారెలు నెవేద్యముగా సమర్పిస్తారు. ఈమె కోరినకోరికలు తీర్చేమాత. దరహాసము చేయుచు (అవలీలగా) బ్రహ్మాండమును సృజించునది గావున ఈ దేవి 'కూష్మాండ' అను పేరుతో విఖ్యాత యయ్యెను. ఈమె సూర్య మండలాంతర్వర్తిని. ఈమె తేజస్సు నిరుపమానము. ఈమె యొక్క తేజోమండల ప్రభావముననే దశదిశలు వెలుగొందుచున్నవి. బ్రహ్మాండము నందలి సకల వస్తువులలో, ప్రాణులలో గల తేజస్సు ఈమె ఛాయయే.
'అష్టభుజాదేవి' అని కూడ అనబడు ఈమె ఎనిమిది భుజములతో విరాజిల్లిచుండును. ఏడు చేతులలో వరుసగా కమండలువు, ధనుస్సు, బాణము, కమలము, అమృతకలశము, చక్రము, గద - అనునవి తేజరిల్లుచుండును. ఎనిమిదవ చేతితో సర్వసిద్ధులను, నిధులను ప్రసాదించు జపమాల యుండును. ఈమెయు సింహవాహనయే.
భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించుటచే పరితృప్తయై ఈమె వారి రోగములను, శోకములను రూపుమాపును. ఈమె భక్తులకు ఆయుర్యశోబలములు, ఆరోగ్యభాగ్యములు వృద్ధిచెందును. కొద్దిపాటి భక్తిసేవలకును ఈదేవి ప్రసన్నురాలగును. కూష్మాండ మాతగా కూడా కొన్ని ప్రదేశాలలో పూజిస్తారు.