Blogger Widgets

గురువారం, డిసెంబర్ 31, 2009

తిరుప్పావై పదిహేడవ పాశురం

గురువారం, డిసెంబర్ 31, 2009


ఆండాళ్ తిరువడిగలే శరణం :
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు. 

పాశురం :
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్

శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్



Pasuram17-HH.mp3


తాత్పర్యము
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను.
అని గోపికలు ప్రార్ధించిరి.

Happy new year


A happy New Year! Grant that I
May bring no tear to any eye
When this New Year in time shall end
Let it be said I've played the friend,
Have lived and loved and labored here,
And made of it a happy year.

తిరుప్పావై పదహారవ పాశురం


 ద్వార పాలకులు ను అర్దించుట

గోపికలు నిద్ర పోతున్న పదిమంది గోపికలను మేల్కొల్పి నంద గోప భవనమునకు చేరిరి. పదిమంది మాత్రమె కాదు . ఆనందముతో శ్రీ కృష్ణుని పొందే యోగ్యత కలగోపికలను అందరను మేలుకొలిపి నంద గోప భావనమునకు వచ్చిరి. నందగోపుని ద్వారమునకు వచ్చి ద్వార పాలకుని అర్ధించి లోన ప్రవేసింతురు .



Pasuram16-HH.mp3


పాశురము: 

నాయగనాయ్ నిన్ఱ నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుం తోరణ 
వాశల్ కాప్పానే, మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు అఱై పఱై 
మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్-నేరుందాన్
తూయోమాయ్ వందోం తుయిలెర ప్పాడువాన్

వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా
నీ నేశనిలైక్కదవం నీక్కు- ఏలోర్ ఎంబావాయ్





తాత్పర్యము: 
అందరకు నాయకునాయకుడైన నందగోపుని భవనమును కాపాడుభావనపాలకా లోనికి విడువుము . తోరనములతో శోభిస్తున్న ద్వారమునుకాపాడుతున్న ద్వారపాలకా మణులచే అందముగా వున్నా గడియలనుతెరువుము . గోపబాలికలగు మాకు మాయావి అయిన మణివర్ణుడగు శ్రీ కృష్ణపరమాత్మ ద్వని చేయ " " అను వాయిద్యము ను ఇచ్చెదనని నిన్న నేనుమాట ఇచ్చాను . మేము వేరొక ప్రయోజనము కాంక్షించి రాలేదుపవిత్రమైనభావముతో వచ్చాము . శ్రీ కృష్ణుని మేల్కొల్పుటకు గానము చేయుటకువచ్చినాము . స్వామీ ముందుగానే నీవు కాదనకు . దగ్గరగా ప్రేమతోఒకదానినిఒకటి చేరి బిగువుగా పట్టుకొని వున్న తలుపులను నీవే తెరచిమమ్ములను లోనకు పోనిమ్ము . అని భావనద్వార పాలకులను గోపికలు వేడుకొన్నారు
జై శ్రీమన్నారాయణ్ .

మంగళవారం, డిసెంబర్ 29, 2009

తిరుప్పావై పదిహేనవ పాశురం

మంగళవారం, డిసెంబర్ 29, 2009

ఆండాళ్ తిరువడిగళేశరణం :
ఇంతవరకు తొమ్మిదిమంది గోపికలని మేల్కొల్పినారు. పడవ గోపికను ఈ పాశురములో మేల్కొల్పుతున్నారు. దీనితో ముందు భాగము పూర్తవుతుంది. దీనిలో ముందుగా భాగావ్ద్భాక్తులను మేల్కొల్పుతారు. తరువాత భగవానుని మేల్కొల్పుతారు. మొదటి పదిహెను పాశురాలలో మొదటి ఐదు పాశురాలుచె ఈ వ్రతము నాకు పుర్వరంగామునుతెలిపి తరువాత పది పాశురాలలో పది మంది గోపికలను మేల్కొల్పినారు . దీనితో భగవద్ ఆలయములో చేరుకొనుటకు అర్హత కలిగెను. 
ఇంతవరకు భగవద్భాక్తుల విషయమున ప్రవర్తింపవలసిన విధనములు నిరూపించి ఈ పాశురములో దాని ఫలమును నిరుపించబడుచున్నది. ఇంతవరకు భాగాత్ప్రాప్తికి చేయవలసిన సాధన క్రమము వివరిచారు గోదామాత. అట్టి సాధన చేయుటచే ఏర్పదవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలగుట. అది పుర్ణంగా తొలగినాడు గాని ఆచార్య సమాస్రయనముస్ మంత్రము లభించి భగవదనుభావము కలుగదు . ఇట్టి పరిపూర్ణ స్తితినంది యున్న గోపిక ఈ నాడు మేల్కొల్ప బడుచున్నది. 






పాశురము : 




Pasuram15-HH.mp3



ఎల్లే! ఇళంకిళియే! ఇన్నం ఉఱంగుదియో 
శిల్ ఎన్ఱ్ అరైయేన్మిన్ నంగైమీర్! పోదరుగిన్ఱేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పండేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీంగళే నానే తాన్ ఆయిడుగ
ఒల్లై నీ పోదాయ్ ఉనక్కెన్న వేఱుడైయై
ఎల్లారుం పోందారో పోందార్ పోంద్-ఎణ్ణిక్కోళ్
వల్లానై కొన్ఱానై మాత్తారై మాత్తరిక్క
వల్లానై మాయనై ప్పాడ-ఏలోర్ ఎమ్బావా
య్

తాత్పర్యము:
ఈ పాశురము న లోపల ఉన్నా గోపిక కుబయటి గోపికలకు సంవాదము నిబంధింపబడినది. వారి మద్య సంబాషణ ఎలావుందంటే.................
బయటి గోపికలు: ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్ర పోతున్నావా ? అయ్యో ఇది ఏమి ?
లోని గోపిక: పూర్ణులగు గోపికలారా ! చికాకు కలుగునట్లు జిల్లుమని పిలువకండి. నేను ఇదే చెప్పుచున్నాను.
బయటి గోపుకలు: నీవు చాలా నేర్పు కలదానవు. నీమాటలలో నైపుణ్యము కాఠిణ్యము మాకు ముందే తెలియును.
లోని గోపిక : మీరే నేర్పు కలవారు. పోనిండు ! నేనే కఠినురాలను.
బయటి గోపిక : నీకీ ప్రత్యేకత ఏమి? అట్లు ఏకాంతముగా ఎందుకు వుంటావు. వేగముగా బయటకు రా !
లోని గోపిక: అందరు గోపికలు వచ్చినారా. 
బయటి గోపికలు: వచ్చిరి , నీవు వచ్చి లెక్కించుకో .
లోని గోపిక: సరే , నేను వచ్చి నేను ఏమి చెయ్యాలి ?
బయటి గోపికలు: బలిష్టమగు కువయాపీడము అను ఏనుగును చంపినవాడను శతృవుల దర్పమును అణచినవాడను , మాయావి అగు శ్రీ కృష్ణుని కీర్తిని గానము చెయుటకు రమ్ము. 

జై శ్రీ మన్నారాయణ్ 



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)