ఆదివారం, జూన్ 13, 2010
దిబ్బలు వెట్టుచు దేలిన దిదివో | ఉబ్బు నీటిపై నొక హంస ||
అనువున గమల విహారమె నెలవై | ఒనరియున్న దిదె ఒక హంస |
మనియెడి జీవుల మానస సరసుల | వునికి నున్న దిదె ఒక హంస ||
పాలు నీరు నేర్పరచి పాలలో | నోలలాడె నిదె యొక హంస |
పాలుపడిన యీ పరమహంసముల | ఓలి నున్న దిదె యొక హంస ||
తడవి రోమరంధ్రంబుల గ్రుడ్ల | నుడుగక పొదిగీ నొక హంస |
కడు వేడుక వేంకటగిరి మీదట | నొడలు పెంచెనిదె యొక హంస ||
ఆదివారం, జూన్ 06, 2010
ఆటలంటే మాకిష్టం - పాటలంటే మాకిష్టం
ఆటల కన్నా పాటల కన్నా - అల్లరి పనులే మాకిష్టం
సినిమాలంటే మాకిష్టం - మిఠాయిలంటే మాకిష్టం
సినిమా కన్నా మిఠాయి కన్నా - షికార్లు కొట్టుట మాకిష్టం
పిట్టలంటే మాకిష్టం - పువ్వులంటే మాకిష్టం
పిట్టల కన్నా పువ్వుల కన్నా - చెట్లు ఎక్కడం మాకిష్టం
కొత్త బట్టలు మాకిష్టం - పౌడరు స్నోలు మాకిష్టం
బట్టల కన్నా పౌడరు కన్నా - మట్టిలో ఆటలు మాకిష్టం
టీచర్లంటే మాకిష్టం - పాఠాలంటే మాకిష్టం
టీచరు కన్నా పాఠం కన్నా - బడి సెలవంటే మాకిష్టం
వెన్నెలంటే మాకిష్టం - వానలంటే మాకిష్టం
వెన్నెల కన్నా వానల కన్నా - అమ్మ ముద్దులే మాకిష్టం
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ