వెనుకటి పాశురము న స్వ ధర్మ నిరతులగు గోపాలుర వంశమున జన్మించిన యామెమేల్కొలుపబడినది.
శరీరము కర్మచేయుతకు వీలుగా నుండునట్లు సృజింపబడినది. ఒక్క క్షణము మైనను కర్మచేయకుండా ఎవరు ఉండలేరు. అందుచే శరీరియయిన ప్రతీ వ్యక్తికి స్వధర్మము కర్మ; పరధర్మము జ్ఞానము . స్వధర్మము జ్ఞానమునకు భగవద్భక్తికి ప్రతిబంధకముగా నుండు పాపములను తొలగించును.
అందుకుగాను " యజ్ఞము ,దానము, తపస్సు మున్నగున్నవి క్రియా కల్లాపమును విడువరాదు . ఆచరిచితీరాలి. యజ్ఞము,దానము,తపస్సు మనస్సులోని మాలిన్యమును తొలగించి ఙానము, తద్వారా భక్తి కలుగుటకు సాయపడును.
కర్మను విడుచుట యనగా కర్మలను మానుట కాదు. కర్మ చేయుటయందు కర్తృత్వాభిమానమును, ఫలమునందాశను ,సంగమును విడచుటయే కర్మ సన్యాసము. కాని నియతమగు కర్మను విడచుట సన్యాసమను మొహముతో విడచుట తామస త్యాగము. శరీర క్లేశము కల్గునను భయముచే కర్మలను మానుట రాజసత్యాగము. భగవద్గీతలొ కర్మన్యాసము అని చెప్పబడి ఉన్నది.
వెనుకటి పాశురములో గోపాలుర స్వధర్మమును ఫల సంగ కర్తృత్వాభిమానములను వదలి యాచరించెడి స్వభావము కలవారని వర్ణించబడింధి.
ఈ పాశురములో అట్టి స్వధర్మము ను కూడా ఆచరించని ఒకానొక గోపాలుని సోదరి మేల్కొల్పబడుచున్నధి.
గోపాలురందరును పరమాత్మయే ఉపాయము -ఉపేయము అని నమ్మినవారు. వారి యెమి చేసినా పరమాత్ముని ప్రీతి కొరకే చేస్తున్నామన్న కోరిక లక్ష్యము కలవారు.
ఇంద్రియ ప్రవ్రుత్తి నిరోధముగల గోపాలుని సోదరిని ఇందు మేల్కొల్పుచున్నారు.
లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి. కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్య సంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.
ఈశ్వరుడే ఉపాయము -ఉపేయము లని నమ్మినవారు గోపికలు. తనను పొందించు సాధనము తానె అని భగవానుని ఉపాయత్వమునమ్దు గలవారే ఈ లేపబడుచున్న గోపికలా. ఈ పాశురములో లేపబడుచున్న గోపిక , కులముచేతను, రూపముచేతను, గుణముచేతను అందమైనది. కృష్ణుడు ఊరుకంతకు ఆదరణీయుడైయున్నట్లే.యీమె కూడా ఊరులోని అందరి మన్ననలను అందిన పిల్ల. ఈ పాశురములోని నిద్ర పోతున్న గోపిక వంశము వారు భరతుని వంశము చెందినవారు. వీరు అభిజాత్యము -సౌందర్యము - ఐశ్వర్యము కల గోపిక ను ఇందు లెపబడుచున్నది. ఈమె సౌందర్యము ను స్త్రీలె పృశంచించుట విశేషము . గోపికలందరు కౄష్ణపరతంత్రులే.
శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ను విడిచి గోపికలు విరహముచే నిద్ర లేక , వ్రతము చేయవలెనని బయలుదేరి వచ్చుచుండగా పదిమంది నిద్రించుట ఆశ్చర్యముగా ఉండును. వారిలో ఒక్కొక్కరిని ఒక్కొక్కవిదముగా మేల్కొల్పుచున్నారు. వారి నిద్ర కుడా లౌకిక నిద్ర వంటి తామస నిద్ర కాదని అది భావదనుభావము చేత కలిగిన తామస నిద్ర అని తెలియుచున్నది. భగవదనుభావమున్న వారిని మేల్కొల్పుట అనగా వారి అభిముఖ్యమును సంపాదించి వారి విశేషకటాక్షమునకు పాత్రులై పాత్రులై భగవదనుభావయోగ్యతను కలిగించుకోనుతయే! భాగాత్ప్రాప్తికి ఉపాయములు భిన్న భిన్నముగా ఉన్నట్లు కన్పట్టుచుండును. నిష్కామకర్మ, ఆత్మస్వరుప జ్ఞానము , భగవద్భక్తి , భాగాత్ర్పాప్తికి ఉపాయములుగా భగవద్గీతలో నిర్దేశింపబడెను .
నమ్మాళ్వారులు వంటి మహాపురుషులు వారే విధమైన సాధనా లేకుండానే పుట్టినది మొదలు యోగాసాదనలో ఉండి భగవదనుభావమును అనుభవించువారివలె పరిపుర్ణానుభావమును అనుభవించిరి. ఆల్వారాలను ఈ పదియవ పాసురమున మేల్కొలుపు చున్నారు.
ఈ గోపిక ఫలమును ఆశించినది కాదు . లాభనష్టాలు అన్ని పరమాత్మవే కాని తనవి కావని నిశ్చలంగా ఉన్నది.
ఇతర ఇంద్రియములు పనిచేయక కేవలము ఒక్క మనస్సు మాత్రమె పనిచేయుచున్నది. ఆ మనసు లో పరమాత్మ దురులకు ఆటంకములేదని సూచించుటకు కృష్ణుని పొరిగింటి పిల్ల ఈమె . ఫలము సిద్దింపక దుఃఖము కలిగినా ఉద్వేగము చెందదు . తనను పాడుట భగవానునికి ఫలముగా భావించి భాద కలిగినా భగవంతుడే ఉద్వేగము చెందాలని . ఆమె భావిచేది. ఆ సుఖాలమీద తనకి మమకారము లేదు . ఇలాంటి పారతంత్ర్య పరాకాస్తతో ఉన్న గోపిక ఈ గాఢ నిద్రలో మునిగి యున్న కృష్ణుని పొరిగింటి పిల్ల - ఈ వేళ మేల్కొల్పుచున్నారు.
తాత్పర్యము:
మేము రాక ముందు నోమునోచి , దాని ఫముగా సుఖనుభావమును పోందినతల్లి ! తలుపుతెరవకపోయినా పోదువుగాక, మాటనైనను పలుకవా! పరిమళముతో నిండిన తులసిమాలలు అలమ్కరిచుకోనిన కిరీటము గల నారాయణుడు, ఏమియులేని మావంటివారము మంగళము పాడినను `పర ' అను పురుశార్ధమును ఓసంగేడి పుణ్యముర్తి , ఒకనాడు కుంభకర్ణుని మృత్యువునోటిలో పడత్రోయగా, ఆ కుంభకర్ణుడు నిద్రలో నీచే ఓడించబడి తనసోత్తగు ఈ గాదా నిద్ర ను నీకు ఒసగినాడా! ఇంత అధికమగు నిద్రమత్తు వదలని ఓ తల్లీ ! మాకందరకు శిరోభుషనమైనదానా! నిద్రనుండి లేచి, మైకము వదలించు కొని, తేరుకొని వచ్చి తలుపు తెరువు , నీ నోరు తెరచి మాటలాడు ఆవరనములోకి వచ్చినీ దర్శనము మాకు కలిగించు.
భగవదనుభావము గలవారు లోకులు నిమ్దిచని తీరున లోకములోకి వచ్చి ఆర్తి గలవారిని ఉద్దరింతురు.
వారి వాక్కు,వారి రూప దర్శనము కూడా భాగాత్ర్పాప్తికి సాధనములే!
ఈ పాశురములో ఏకేంద్రియావస్తలో నుండి ఇంద్రియము లేవియు పనిచేయక మససు భగవదదీనమై సిద్దోపాయనిస్టలో ఉన్న గోపిక మేల్కొల్పబడినది.
ఇంతవరకు ముగ్గురు గోపికలను లేపినారు . ముదడవ గోపికను లేపుచున్నప్పుడు గేదెలు మొదలగున్నవి ఆహారము సంపాదించుటకు వెళ్తున్నాయని .అంటే తెల్లవారుటకు గుర్తుగా వారు గేదేలగురుంచి చెప్పారు. మిగిలిన పిల్లలు కుడా
అదేపోవటం అయితే వారి ని ఆపి నిన్ను పిలుచుటకు వచ్చాము.గుర్రపు నోటిని చీల్చిన వాడు ,మల్లురను చంపినవాడు అయిన పరమాత్మ మనలను చేరి మనము సేవించినచో అయ్యో, అయ్యో,అని భాదపడి మనలను పరామర్శించి కృపచేయును.
అటువంటి ప్రేమ మనకు కావాలికదా, అవి పరతంత్రాలు కదా. మనకి ప్రియమైన వానికి సేవలు చేయటమే కదా మన స్వరుఉపము. లెమ్ము ముందుగా లెమ్ము అని మూడవ గోపికను మేల్కొల్పినారు.
ఇంతవరకు ముగ్గురును లేపారు ఇప్పుడు నాల్గో గోపికను లేపుచున్నారు .ఈమె పరమాత్మయే ఉపాయము అను అధ్యవసాయమున పరినిస్తితురాలు. భాగావంతునికంటే వేరేఉపాయము లేదని . నమ్మినది . అలాంటి ఆమె నిద్రను చూచి గోదా మిగిలిన గోపికలు మొదటి రెండు పాశురాలు విన్నావు కదా ! మరి విని కుడా పరుంటివా ? లెమ్ము అని మెలొల్పుతున్నరు . మొదటి నాలుగు పాశురాలలొ నిద్ర నుండి మేల్కొల్పు తొ ఉన్న పాశురాలే. నిద్ర గురించి భగవద్గీత లో నాలుగు అవస్తలు గురించి నాలుగు శ్లొకాలలొ వివరించారు. నాలుగు అవస్తలు 1 యతమానవస్థ 2. వ్యతిరేకావస్థ, 3. ఏకేంద్ర్దియావస్థ, 4. వశీకారావస్థ. వీటిగురించి గీతలొ బాగా వివరించారు.
మొదటి రెండు పాశురాలలో శ్రవణము చెప్పబదింధి. తరువాత పాశురములో మననము నిరూపించబదినది. ఈ పాశురము నుండి నాలుగు పాశురములలో ధ్యానదశ వివరించబడినధి. అట్టి ధ్యానములో పరకాస్టనందియున్న గోపిక ఈనాడు మేల్కొల్పబదుచున్నధి.
పరిశుద్ధములగు నవవిధమణులతో నిర్మించబదిన మేడలో సుఖ శయ్యపై చుట్టును దీపములు వెల్గుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా ! మణికవాటపుగడియ తీయుము. ఓయత్తా! నీవైనను ఆమెను లేపుము- నీకుమార్తెమూగదా? లేక చెవిటిదా ? లేక జాడ్యముకలదా? లేక ఎవరైన కదలిన ఒప్పమని కావలియున్నారా? లేక గాఢ నిద్రపట్టునట్లు మంత్రించినారా?
"మహామాయావీ ! మాధవా! వైకుంఠవాసా!" అని అనేక నామము లను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము.
ఈ సందర్బములో గోదాదేవి భగవంతునికీ భక్తునికి మధ్యా సంబంధమును వివరించినారు.
1. మనందరిని తండ్రి ఆయనే 2. మనందరిని రక్షించేవాడు ఆయనే 3. మనందరిని నావాల్లు అని కల్గిన వాడు ఆయనే- శేశి అంటార 4. మనందరిని భరించేవాడు ఆయనే - భర్త అంటారు 5. మనలోని జ్ఞానాన్ని పనిచేయిస్తూ ఇందులో మనకు తెలియాల్సినవాడు ఆయనే- జ్ఞేయము అంటారు 6. మనందరిని తన వస్తువులుగా కల్గి ఉండి వాటికి స్వామి ఆయనే 7. మనందరికి ఆధారం ఆయనే - నారాయణుడు అంటారు 8. మనందరి లోపలుండే ఆత్మ ఆయనే - అంతర్యామి అంటారు 9. భోక్తా ఆయనే.
లోకంలో మనం ఎదో ఒక సంభందం అమ్మ,నాన్న, భార్య ఇలా ఉన్న ఒక్కొక్క సంభందం వల్ల ఎంత ప్రేమ కల్గి ఉంటాం, అదే ఇన్ని సంభందాలు కల్గి, శాశ్వతంగా వీడని సంభందం మనకు ఆయనతో ఉంటే మరెంత ప్రేమ ఉండాలి ఆయనపై మనకు! కుడా అదే ప్రేమ కల్గి వుంటుంది. ఈ విదముగా భగవద్ సంబందమును వివరించారు మన గోదామాత.