గోపికలు కృష్ణుని పొంది యనుభవించాలని ఆవేసముచే కృష్ణపరమాత్మ కనిపించగానే తామూ అనుభవించ వచ్చునని తొందరగా మేలుకొన్నారు. కాని శ్రీ కృష్ణుడు మేలుకోలేదు. తరువాత బలరాముని మేలుకోల్పారు . అప్పుడు కుడా కృష్ణుడు మేలుకోలేదు . తెలివి తెచ్చుకొని నీలాదేవి ద్వారా మేలుకోల్పవచ్చని ఆమెని మేలుకోల్పుతున్నారు ఈ పాశురములో .
ఉందు మదకళిత్తన్-ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!
కందం కమరుం కురలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోరి అరైత్తన కాణ్ మాదవి
ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పా డ
శెందామరై క్కైయాల్ శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిరింద్-ఏలోర్ ఎంబావాయ్
తాత్పర్యము :
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము.
అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
ఆదివారం, జనవరి 02, 2011
తిరుప్పావై 17 పాశురం
గోపికలు , పదిమంది గోపికలను మేల్కొలిపికొని నందగోపభావనమును చేరినారు. భావనపాలకుని ద్వారపాలకుని. ప్రార్ధించి వారి యనుమతిని పొందినారు. ద్వారపాలకుడు తలుపు తెరచి వాడలేను. గోపికలందరూ ను నందగోపభావనములోకి ప్రవేశించినారు.నందగోపుడు , యశోద, శ్రీ కృష్ణుడు, బలరాముడు వరసగా మంచాలపై సయనించినారు. వారిని ఈ రోజు మేలుకోల్పుతున్నారు. రాక్షసులు వచ్చి కృష్ణునికి ఏమి కీడు చెయునో అని ! లేక గోపికలు ఎత్తుకుపొతారెమో ! అని భయముతో జాగరుడై ముందు మంచము మీద నందుడు శయనించియుండెను. లేక లేక లభించిన కృష్ణుని వీడ లేక ఒక ప్రక్క కృష్ణుని మరో పక్క బలరాముని మద్యలొ యశొద శయనించి యుండెను. వారిని ఒక్కొక్కరిని ఇందులొ మెలుకొల్పుతున్నారు.
అమ్బరమే తణ్ణీరే శోఱే అఱం శెయ్యుం
ఎమ్బెరుమాన్ నందగోపాలా! ఎరుందిరాయ్
కొన్బనార్ క్కెల్లాం కొరుందే! కుల విళక్కే
ఎమ్బెరుమాట్టి యశోదా! అఱివుఱాయ్
అమ్బరం ఊడఱుత్తు ఓంగి ఉలగళంద
ఉమ్బర్ కోమానే! ఉఱంగాదు-ఎరుందిరాయ్
శెమ్బొఱ్ కరలడి చ్చెల్వా బలదేవా!
ఉమ్బియుం నీయుం ఉఱంగ్-ఏలోర్ ఎంబావాయ్
అని గోపికలు ప్రార్ధించిరి.