ఈ రోజు రోజున అనగా ఆగష్టు 25, 2007న మన రాష్ట్ర రాజదాని అయిన హైదరాబాదు లో జనసమ్మర్దంగా ఉండేచోట్ల బాంబు పేలుళ్ళు జరిగి 42 మంది వరకు మరణించారు మరియు మరో 70 మంది గాయపడ్డారు. లుంబినీవనంలో జరిగిన పేలుడులో 9 మంది మరణించగా, కోఠి వద్ద గల గోకుల్ చాట్ దుకాణం వద్ద జరిగిన పేలుడులో 33 మంది మరణించారు.
లుంబినీవనంలో రాత్రి ఏడున్నరకు లేజర్‌షో మొదలైంది. దాదాపు 500 మంది వరకు సందర్శకులు దాన్ని చూస్తున్నారు. వందేమాతర గీతాలాపన అప్పుడే పూర్తయింది. 'గుడ్ ఈవినింగ్ హైదరాబాద్' అంటూ స్వాగత వచనం! అప్పుడూ సీట్ల మధ్యలో బాంబు పేలింది. పేలుడు ధాటికి ఘటనా స్థలిలోనే ఇద్దరు చనిపోగా, మరో ఏడుగురు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. 40-50 మంది వరకు గాయపడ్డారు.
కోఠి ప్రాంతంలో గోకుల్ చాట్ ప్రముఖ స్థలం. సాయంత్రాల వేళ ప్రజలక్కడ ఎక్కువగా గుమిగూడుతారు. చాట్ మసాలా వంటివి దొరుకు ప్రదేశంగా పేరు పొందినది. ఆ సంఘటన ఆ రోజు సాయంత్రం 7:40 ప్రాంతంలో, బాగా రద్దీగా ఉన్న గోకుల్ చాట్ సెంటరులో బాంబు పేలింది. పదిమంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 23 మంది ఆసుపత్రుల్లో మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఆ నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను.