శనివారం, సెప్టెంబర్ 10, 2011
తాతామామల - తాతాఅమ్మమ్మలు మన జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు. వారికి ఒక ప్రత్యేక రోజు ఉంది. అదే Grandparents Day గా జరుపుకుంటున్నారు. మేము వారితోపంచుకునే ప్రత్యేక అనుబంధము గుర్తు చేసుకోవచ్చు.
Grandparents Day ను మొదట McQuade అనుసరించింది మరియు తాతామామల కోసం ఒక ప్రత్యేక రోజుస్థాపించడానికి తన ప్రచారాన్ని చేరడానికి ఇతర ప్రజల ప్రేరణ ఒక మహిళ, ఆలోచన గాప్రారంభమైంది. నేడు, Grandparents Day ఇతర పాత స్నేహితులు మరియు బంధువులుసందర్శించడానికి, మరియు ప్రతిచోటా సీనియర్లచే యొక్క జ్ఞానం, శక్తి మరియు శాశ్వత రచనలుగుర్తించడానికి, వారి తల్లిదండ్రులు మరియు తాతామామల గౌరవం పెరుగుతుంది the United States అంతటా లక్షల మంది ప్రజలు, జరుపుకుంటారు.
వారు Grandparents Day జరుపుకోవటానికి మూడు కారణాలు చెప్తారు వారు.
1. తాతామామ్మలను గౌరవించుటకు.
2. తాతామామల వారి పిల్లల పిల్లలకు ప్రేమ చూపించడానికి అవకాశం ఇవ్వాలని.
3. తాతామామల సహాయం తో పిల్లలు మంచి తెలుసుకొని, పిల్లలు మానసికంగా శారీరకంగా బలం గా, మంచి సమాచారం మరియు మార్గదర్శకత్వం వారి ద్వారా మంచి గా ఆవగాహనతో పెరుగుతారని .
అసలు వారు Grandparents Day జరుపుకోవటానికి కారణం జాతీయ తాతామామల డే కౌన్సిల్ McQuade, నేషనల్ తాతామామల డే స్థాపకులు descendents నిర్వహించిన ఒక లాభాపేక్షలేని సమూహం, తాతామామల గౌరవం intergenerational ప్రశంసలు మరియు చర్యలు ప్రోత్సహించడానికి వృద్ధాశ్రమం లో వున్నా సీనియర్ సిటిజెన్స్ ను కలసివారితో అనుబంధాన్ని పెంచుకోవటానికి.
so, I am wishing all senior citizens Happy Grand Parents Day.
Thank you.
శుక్రవారం, సెప్టెంబర్ 09, 2011
ఈ విగ్రహం మా తాత గారు ఊరు చోడవరం లో ని వినాయకుని గుడి చాలా ప్రసిద్దమైనది. ఈ విగ్రహం మానవ నిర్మితమైనధి కాధు. ఈ విగ్రహం స్వయంభూ వినాయకుడు. చాలా కాలం క్రితం అక్కడబావి తవ్వటానికి తవ్వుటలో వినాయక విగ్రహం బయటపడింది. వినాయకుని తొండం భూగర్భం ద్వారా ఊరు చివర వున్న చాలా పెద్దగా కొలను వరకూ వ్యాపించి ఉంటుంది. దాని తొండము చివర ఎవరు కనుక్కోలేకపోయారు. వినాయకుని తొండము చివర తెలుసుకోటానికి చాలాసార్లు ప్రయత్నించారు కానీ ఎవరూ తెలుసుకోలేకపోయారు. అక్కడ భక్తి తో ప్రార్ధిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని ప్రజల నమ్మకం. ఆక్కడ వినాయకుని కార్యసిద్ది వినాయకునిగా ప్రజలు కొలుస్తారు.
మంగళవారం, సెప్టెంబర్ 06, 2011
వామన జయంతి సెప్టెంబర్ 8
ధర్మానికి భంగం కలిగినప్పుడల్లా తాను అవతరించి ధర్మసంస్థాపన చేస్తానని శ్రీ కృష్ణుడు గీతలో ప్రబోధించాడు. ఈ గీతావాక్కుకు ప్రతిబింబమే దశావతారాలలో ఒకటైన వామనావతారం. వామనుడి అవతార చరితలో బలి, వామనుల సంభాషణలో దురాశ పడకూడదని, తృప్తే మోక్షానికి సాధనమని తెలిపే చక్కటి సందేశం ఇమిడి ఉంది.
పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి.. ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో "దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి, ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని" పలికి అదృశ్యమవుతాడు.
ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు, దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒకవిధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును, యజ్ఞోపవీతమును ధరించి, శరీరముపై మృగచర్మము, శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు. అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. "వామనుడు మూడు పాదముల భూమి"ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి, దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను. శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు పోతన గారు ఇలా వర్ణించారు..
వామనుడు బ్రహ్మాండ రూపం పొందిన వర్ణన...
-
- ఇంతింతై వటు దింతయై మరియు తానింతై
- నభో వీధిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై
- ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
- ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై
- సత్యపదోన్నతుం డగుచు
బ్రహ్మాండాంత సంవర్ధియై
అన్నట్టు ఒక పాదమును పృథ్విని, రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను. బలి సమర్పణ భావమునకు భగవానుడు ప్రసన్నుడై బలికి సుతలలోక రాజ్యము నిచ్చెను.
ఆదివారం, సెప్టెంబర్ 04, 2011
ఓం గురుబ్రహ్మ గురుర్విఘ్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మతస్మై శ్రీ గురవేనమః||
భావం : గురువు బ్రహ్మ, విష్ణు, శివ లక్షణములు కలవాడు. అట్టి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన గురుదేవులకు నమస్కరిస్తున్నాను.
గురువును దేవుడితో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సంప్రదాయం. టీచర్లను గౌరవించడానికి భారతీయ దేశాల్లో ప్రత్యేకమైన రోజుల్లో గురు పూజోత్సవాలు నిర్వహిస్తారు. గురు దినోత్సవానికి సెలవు ఇవ్వడం కొన్ని దేశాల్లో సంప్రదాయంగా వస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన మన దేశంలో టీచర్స్ డే నిర్వహించుకుంటున్నాం. అంటే, అది గురు పూజోత్సవం రోజన్న మాట.
శ్రీ రాధా కృష్ణ అసలు పేరు సర్వేపల్లి రాధాకృష్ణ 1888 సెప్టెంబరు 8వ తేదీన తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించారు. ప్రాధమిక విద్యాభాసం తిరుత్తణిలో జరిగినప్పుడు పాఠశాలలో అతని పేరును రాధాకృష్ణకు బదులుగా రాధాకృష్ణన్ గా రాయడం వల్ల అదే పేరును చివరి వరకు ఉంచుకోవటం జరిగింది. చదువుకునేటప్పుడు అతడు తన ఉపాధ్యాయులను ఎంతో గౌరవిస్తూ, టీచర్లను అల్లరి పట్టించే విద్యార్ధులను మందలిస్తూ "మనకు చదువునేర్పి, మనల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటానికి కృషిచేస్తున్న ఉపాధ్యాయులను వెక్కిరించటం, వారి వెనుక చెడుగా మాట్లాడటం మహపాపం. వారు మనకు దైవం లాంటివారు" అని చేప్పేవారు.
భారతదేశం యొక్క రెండవ అధ్యక్షుడు, విద్యా తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంపిక చెయ్యబడిన పుట్టినరోజు [5 సెప్టెంబరు 1888], లేదు. ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సాధారణ గా పాఠశాల నివేదిక అయితే సాధారణ చర్యలు మరియు తరగతులు వేడుక, ధన్యవాదాలు మరియు గుర్తుంచుకోబడతాడు యొక్క చర్యలు స్థానంలో అక్కడ, ఒక "వేడుక" రోజు భావిస్తారు. ఈ రోజున కొన్ని పాఠశాలలు వద్ద, బోధన యొక్క బాధ్యత వారి ఉపాధ్యాయుల ప్రశంసలు చూపించడానికి సీనియర్ విద్యార్థులు అప్ తీసుకోవాలి.
మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం.
ఎంత గొప్ప స్థానానికి చేరినా సరే విధ్యార్థిగా ఉండు, అది నిన్ను మరింతగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. అని అనేవారు సర్వేపల్లి.
ఉత్తమ ఉపాధ్యాయుడిగా, మానవతావాదిగా, విద్యావేత్తగా, దేశాధ్యక్షుడిగా అందరి హృదయాల్లోనూ పదిలమైన స్థానం సంపాదించుకున్న రాధాకృష్ణన్ కు భారత ప్రభుత్వం "భారతరత్న" బిరుదునిచ్చి, ఆ బిరుదు విలువను పెంచింది. శ్రీ రాధాకృష్ణన్ 1975 ఏప్రిల్ 17న తన 87వ యేటన స్వర్గస్థుడయ్యాడు.
అలాంటి సర్వేపల్లి రాధా కృష్ణుని పుట్టిన రోజున మనం గురుపుజోత్సవం జరుపుకుంటున్నాము.
ఆ రోజు స్కూల్ లో మన టీచర్స్ మేము మాకు నచ్చిన టీచర్ లా తయారు అయ్యి ఒక గంట మేము టీచర్ లా పాటాలు చెప్తాము. తరువాత మా టీచర్స్ కు పువ్వులు ఇచ్చి సత్కరించి వారినుండి wishes తీసుకుంటాము. మీము మా స్కూల్ లో teachers day బాగాజరుపుకుంటున్నాము.
మీ అందరికీ కుడా టీచర్స్ డే (గురు పూజోత్సవ) శుభాకాంక్షలు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ