జైపూర్ ఫుట్ ఆలోచన ఎలావచ్చిందంటే ఎముకల వైద్య నిపుణుడైన ప్రమోద్ కరణ్ సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే రామచంద్రారావు గారికే ఆలోచన వచ్చింది . ఒకనాడు అతడు సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందనీ, అప్పుడు అతడికి హటాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే ప్రచారం ఉంది.
ఈ జైపూర్ ఫుట్ పెట్టుకొన్న ఎంతోమంది కాళ్ళు లేని వారికి జీవితమీద ఆసక్తి పెరిగి వారిలో ఆత్మవిశ్వాసం కలిగింది.
మీకందరికీ ఇలాంటి పోస్ట్ లు ఎందుకు పెడుతున్నాను అంటే నా చిన్నవయసులో నన్ను స్కూల్ కి తీసుకుని వెళ్ళే రిక్షా తొక్కే మనిషి అతని పేరు రాముడు అనుకుంటాను. అతనికి ఒకనాడు అనుకోకుండా ఆక్సిడెంట్ అయ్యింది అప్పుడు ఆతను తన రెండు కాళ్ళను పోగొట్టుకొన్నాడు. వాళ్ళ ఇంటికి అతనే జీవనాదారం అతని భార్య కష్టపడి సంపాదించి ఇంటిని నడిపేది. అతను ఏమనుకున్నాడో ఏమో జీవితంమీద విరక్తి చెంది ఉరివేసుకొని చనిపోయాడు. అతనికి కాళ్ళు లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి మరణించి వుంటాడు. ఇలాంటి జైపూర్ ఫుట్ వుంటే జీవింఛి వుండేవాడు. అలా తెలియక చాలామంది వుంటారు. అందుకే అలాంటివారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నాకు ఈవిషయం చెప్తుంటే నాకు కళ్ళు చేమర్చుతున్నాయి.
కాళ్ళు లేనివారికి ప్రమోద్ కరణ్ సేథీ దేవుడే. ఆయన మరణించినా కూడా జైపూర్ ఫుట్ ద్వారా జీవించి ఉన్నట్టే. ప్రమోద్ గారు ఒక ధ్రువ తారగా నిలిచివున్నారు.
జననము -
1927 న
మరణము -
2008, జనవరి 7న జైపూర్ లో
మాతృస్థానము -
వారణాసి
జాతీయత - భారతీయుడు
మాతృదేశము -భారతదేశము
రంగము -ఎముకల వైద్యులు
గిన్నేస్స్ రికార్డు |
ముఖ్య పురస్కారాలు -మెగ్సేసే అవార్డు,పద్మశ్రీ