Blogger Widgets

శుక్రవారం, జనవరి 06, 2012

My Hero Mr. Bean

శుక్రవారం, జనవరి 06, 2012

Mr. Bean మిస్టర్ బీన్ రాసిన మరియు టైటిల్ పాత్రలో   Rowan Atkinson  నటించిన 14  half-hour  episodes  ఒక బ్రిటిష్ హాస్య టెలివిజన్ ప్రోగ్రామ్ సిరీస్.  ప్రపంచంలోనే చాలా గొప్ప కమెgడియన్ గా ఎదిగారు.  చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళు వరకు Mr . Bean comedy  అందరికీ ఇష్టం. కామెడీ ప్రోగ్రాం Mr . Bean  కార్టూన్స్ గా కూడా వస్తుంది.  Rowan Atkinson చిన్నపిల్లవాడిలా చాలా అమాయకంగా వున్నట్టు నటిస్తారు. టైటిల్ పాత్రలో రోజువారీ పనులు విచిత్రంగా అసాధారణ స్థితిలో మరియుcontrivances తెస్తుంది ఒక పిల్లతనం మరియు స్వార్థ పూరిత buffoon గా నటన సాగుతుంది. అతను తన చిన్న ఫ్లాట్లో ఒంటరిగా తన జీవితమును సాగిస్తారు, మరియు దాదాపు ఎల్లప్పుడూ తన ట్రేడ్ మార్క్ ఓ విధమైన ఉన్ని బట్ట జాకెట్ మరియు తను స్నానం చెయ్యడం కొత్తగా వుంటుంది.  అతని డ్రెస్ స్టైల్ ఎరుపు టై అంతా వారిటీగా కనిపిస్తుంది. అతను కూడా సాధారణంగా ఒక డిజిటల్కాలిక్యులేటర్ వాచ్ ధరిస్తారు. అతని చేతిలో teddy  bear  తో నటించి మనలను నవ్వులు నవ్వేటట్టు చేస్తారు. మిస్టర్ బీన్ తక్కువగా మాట్లాడుతాడు. నాకు చాలా నచ్చిన Mr . Bean  పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.Living comedy legend Mr . Rowan Atkinson  many many happy  returns  of  the day .   

తిరుప్పావై త్రివింశతి పాశురము

అననన్య గతికలమై వచ్చి నన్నాస్రయించినారము , కటాక్షిం చుము అని గోపికలు ప్రార్ధించగా శ్రీ కృష్ణునకు మనస్సులో చాలా భాద కలగినది. నీలాదేవిని ఆశ్రయించి ఆమె ద్వారా నన్నాశ్రయించిన వారిని నేనే ముందుగా వెళ్లి సాయపడి రక్షించవలసి ఉండగా వేరొక గతిలేని వారమైనాము అని దైన్యముగా పల్కు నట్లు ప్రేరేపించితినే ! ఎంత తప్పు చేసితిని అని శ్రీ కృష్ణుడు చాలా నోచ్చుకోనేను.
ఇలా పడుకున్న శ్రీ కృష్ణుని లేచి నడచి వచ్చి ఆ స్థానమున సింహాసనమున వేంచేసి తమ కోరివిని క్రుపచేయవలేనని గోపికలు ప్రార్ధించుచున్నారు.
పాశురము:
  మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం 
మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం
శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు
వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి
మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు
పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్
కోయిల్ నిన్ఱు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ
శీరియ శింగాశనత్తిరుందు యాం వంద
కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:
పర్వత గుహలో వర్షాకాలములో కదలక మెదలక పడుకున్న సౌర్యముగల సింహము మేలుకొని , తీక్ష్ణమగు చూపులు నిటునటు చూచి , ఒకవిధమగు వాసనగల తన ఒంటి వెంట్రుకలు నిగుడు నట్లు చేసి, , అన్ని వైపులా దొర్లి , దులుపుకొని , వెనుకకు ముందుకు శరీరమును చాపి , గర్జించి , గుహనుండి వేల్వడునట్లు, ఓ అతసీపుష్ప సవర్ణ ! నీవు నీ భవనము నుండి ఇట్లే బయటకు వేంచేయి రమణీయ సన్నీవేశము గల లోక్కోత్తరమగు సింహాసనమును అధిష్టించి మేము వచ్చిన కార్యమును ఎరుగ ప్రార్ధించుచున్నాము.
అలా కోరటంతో శ్రీ కృష్ణ పరమాత్మ తన శయనాగారమును వీడి నడచి వచ్చి సింహాసనము నధిరోహించి గోపికలను యుక్తరీతిని పలుకరించవచ్చునని అనుకోవచ్చును.

జైపూర్ ఫూట్ సృష్టి


కృత్రిమ పాదం జైపూర్ ఫూట్ సృష్టికర్త ప్రమోద్ కరణ్ సేథీ 1927లో ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో జన్మించాడు. కాళ్ళు కోల్పోయిన అనేకమందికి నడకనేర్పిన ఘనత పొందిన సేథీకి గిన్నిస్ బుక్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసా పత్రం అందజేశారు. 1981లో సామాజిక సేవా రంగంలో ఆసియా లోనే అత్యుత్తమమైన మెగ్సేసే అవార్డు కూడా లభించింది.భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురష్కారంతో సత్కరించింది. పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు, యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన సైనికులకు, దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరో జీవితాలలో వెలుగు నింపిన పి.కె.సేథీ 2008, జనవరి 7న జైపూర్ లో మరణించారు.  కాళ్ళు కోల్పోయిన ఎందరికో కృత్రిమ కాళ్ళు అమర్చి వారి జీవితాలలో వెలుగులు నింపినారు.
జైపూర్ ఫుట్ ఆలోచన ఎలావచ్చిందంటే ఎముకల వైద్య నిపుణుడైన  ప్రమోద్ కరణ్ సేథీ 1969లో నిరక్ష్యరాస్యుడైన చేతివృత్తి నిపుణుడు రామచంద్ర శర్మతో కలిసి జైపూర్ ఫుట్ ను రూపొందించాడు. కృత్రిమ కాలు రూపొందించాలనే రామచంద్రారావు గారికే ఆలోచన వచ్చింది . ఒకనాడు అతడు సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందనీ, అప్పుడు అతడికి హటాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే ప్రచారం ఉంది.
ఈ జైపూర్ ఫుట్ పెట్టుకొన్న ఎంతోమంది కాళ్ళు లేని వారికి జీవితమీద ఆసక్తి పెరిగి వారిలో ఆత్మవిశ్వాసం కలిగింది. 
మీకందరికీ ఇలాంటి పోస్ట్ లు ఎందుకు పెడుతున్నాను అంటే నా చిన్నవయసులో నన్ను స్కూల్ కి తీసుకుని వెళ్ళే రిక్షా తొక్కే మనిషి అతని పేరు రాముడు అనుకుంటాను. అతనికి ఒకనాడు అనుకోకుండా ఆక్సిడెంట్ అయ్యింది అప్పుడు ఆతను తన రెండు కాళ్ళను పోగొట్టుకొన్నాడు.  వాళ్ళ ఇంటికి అతనే జీవనాదారం అతని భార్య కష్టపడి సంపాదించి ఇంటిని నడిపేది.  అతను ఏమనుకున్నాడో ఏమో జీవితంమీద విరక్తి చెంది ఉరివేసుకొని చనిపోయాడు.  అతనికి కాళ్ళు లేక ఆత్మవిశ్వాసం కోల్పోయి మరణించి వుంటాడు.  ఇలాంటి జైపూర్ ఫుట్ వుంటే జీవింఛి వుండేవాడు.  అలా తెలియక చాలామంది వుంటారు. అందుకే అలాంటివారికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను.  నాకు ఈవిషయం చెప్తుంటే నాకు కళ్ళు చేమర్చుతున్నాయి. 
కాళ్ళు లేనివారికి ప్రమోద్ కరణ్ సేథీ దేవుడే.  ఆయన మరణించినా కూడా జైపూర్ ఫుట్ ద్వారా జీవించి ఉన్నట్టే.  ప్రమోద్ గారు ఒక ధ్రువ తారగా నిలిచివున్నారు.

జననము                       -  1927 న
మరణము                      -  2008, జనవరి 7న జైపూర్ లో 
మాతృస్థానము                     -  వారణాసి  
జాతీయత                            - భారతీయుడు
మాతృదేశము                     -భారతదేశము  
రంగము                             -ఎముకల వైద్యులు
గిన్నేస్స్ రికార్డు 
ముఖ్య పురస్కారాలు          -మెగ్సేసే అవార్డు,పద్మశ్రీ


audiopal for my voice



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)