Father of Homeopathy Samuel Hahnemann 1755 - 1843 |
హోమియోపతీ మందులు అనగానే మాలాంటి పిల్లలకి చాలా ఇష్టం కదా! హోమియోపతి మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. అతిముఖ్యంగా భారత దేశంలో అత్యంత ఎక్కువగా ప్రజలు వాడుతున్నట్టు ప్రపంచంలో ఇంకెక్కడా వాడటంలేదు. ఈ హోమియోపతి మందును దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారం లేదట . హోమియోపతీ అనగా హోమోయిస్ ఒకే రకమైన బాధ, మరియు ఒక రోగ లక్షణం. ఇది రెండు గ్రీకు మాటలని కలపగా వచ్చిన పదము. దీనిని పుట్టుకగురింఛిన విషయాలు తెలుసుకుందాం. మనకు అతి సుపరిచితమైన సామెతలు వున్నాయి ముల్లును ముల్లుతోనే తీయాలి మరియు ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ యొక్క మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్. ఈరోజు సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు అందుకే ఈ హోమియోపతి మందు గురించి చెప్తున్నాను. సేమ్యూల్ హానిమాన్ 1755-1843 అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం తెసేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు . కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి తప్పులుగా అనిపించింది . ఈ తప్పులను మార్చటానికి ఈయన కొత్త పద్దతిని కనిపెట్టాడు. ఆ కొత్త పద్దతే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ మందులు నమ్మకము వున్నవారు "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. పూర్వం నుండి హోమియోపతి మందులు వాడినంత కాలం ఆహారనియమాలు పాటించాలి అని చెప్పేవారు. ex : onion వాడకూడదు అని ఇంకా అలాంటివి వుండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడుఇప్పుడు ఆహారనియమాలు లేకుండా వాడుకునే విదంగా తయారు చేస్తున్నారు. హోమియోపతి మందులు వాడితే ఎటువంటి అనారోగ్యమైనా శాశ్వితముగా తగ్గుతుంది అంటారు. సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు సందర్భముగా హోమియోపతి గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇంకో సందర్భములో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. హోమియోపతి వాడకమువల్ల ఏ ప్రతికూల లేదా దుష్ప్రభావాలు లేకుండా నిశ్చయముగా నయంఅవ్వటం అనది విశేషముగా వుంది.