బుధవారం, ఏప్రిల్ 11, 2012
పుట్టినరోజు శుభాశిస్సులు .
బుధవారం, ఏప్రిల్ 11, 2012
లేబుళ్లు:
పుట్టిన రోజులు,
Events,
greetings,
photos
మంగళవారం, ఏప్రిల్ 10, 2012
Father of Homeopathy
మంగళవారం, ఏప్రిల్ 10, 2012
Father of Homeopathy Samuel Hahnemann 1755 - 1843 |
హోమియోపతీ మందులు అనగానే మాలాంటి పిల్లలకి చాలా ఇష్టం కదా! హోమియోపతి మెడిసిన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వైద్య పద్ధతి. అతిముఖ్యంగా భారత దేశంలో అత్యంత ఎక్కువగా ప్రజలు వాడుతున్నట్టు ప్రపంచంలో ఇంకెక్కడా వాడటంలేదు. ఈ హోమియోపతి మందును దరిదాపు రెండు వందల ఏళ్ళబట్టీ వాడుకలో ఉన్నప్పటికీ దీనికి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయమైన ఆదారం లేదట . హోమియోపతీ అనగా హోమోయిస్ ఒకే రకమైన బాధ, మరియు ఒక రోగ లక్షణం. ఇది రెండు గ్రీకు మాటలని కలపగా వచ్చిన పదము. దీనిని పుట్టుకగురింఛిన విషయాలు తెలుసుకుందాం. మనకు అతి సుపరిచితమైన సామెతలు వున్నాయి ముల్లును ముల్లుతోనే తీయాలి మరియు ఉష్ణం ఉష్ణేత శీతలే అన్నట్లు, వజ్రం వజ్రేనభిద్యతే అన్నట్లు ఒక పదార్ధం ఏ బాధని కలిగిస్తుందో ఆ బాధని నివారించటానికి అదే పదార్ధాన్ని మందుగా వాడాలి అన్నది హోమియోపతీ యొక్క మూల సూత్రం. ఈ వైద్యపద్ధతిని, ఈ మాటని కనిపెట్టినది సేమ్యూల్ హానిమాన్. ఈరోజు సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు అందుకే ఈ హోమియోపతి మందు గురించి చెప్తున్నాను. సేమ్యూల్ హానిమాన్ 1755-1843 అనే జెర్మనీ దేశపు వైద్యుడు. ఈయన వైద్య కళాశాలకి వెళ్ళి వైద్యశాస్త్రం అధ్యయనం చేసేడు. ఆ రోజులలో వైద్యం అంటే నాటు వైద్యమే. రోగానికి కారణం మలినపు రక్తం అనే నమ్మకంతో రోగి రక్తనాళాలని కోసి రక్తం తెసేసేవారు. దేహనిర్మాణశాస్త్రం (ఎనాటమీ), రోగనిర్ణయశాస్త్రం, రసాయనశాస్త్రం అప్పటికి అంతగా తెలియదనే చెప్పుకోవచ్చు . కనుక అప్పటి వైద్య విధానాలలో హానిమాన్ కి తప్పులుగా అనిపించింది . ఈ తప్పులను మార్చటానికి ఈయన కొత్త పద్దతిని కనిపెట్టాడు. ఆ కొత్త పద్దతే హోమియోపతీ. హోమియోపతీ వాడుకలోకి వచ్చిన తరువాత హోమియోపతీ మందులు నమ్మకము వున్నవారు "ఇంగ్లీషు వైద్యాన్ని" ఎల్లోపతీ (allopathy) అనటం మొదలు పెట్టేరు. పూర్వం నుండి హోమియోపతి మందులు వాడినంత కాలం ఆహారనియమాలు పాటించాలి అని చెప్పేవారు. ex : onion వాడకూడదు అని ఇంకా అలాంటివి వుండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా మందులు కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడుఇప్పుడు ఆహారనియమాలు లేకుండా వాడుకునే విదంగా తయారు చేస్తున్నారు. హోమియోపతి మందులు వాడితే ఎటువంటి అనారోగ్యమైనా శాశ్వితముగా తగ్గుతుంది అంటారు. సేమ్యూల్ హానిమాన్ పుట్టిన రోజు సందర్భముగా హోమియోపతి గురించి కొంచెం తెలుసుకున్నాం. ఇంకో సందర్భములో మిగిలిన విషయాలు తెలుసుకుందాం. హోమియోపతి వాడకమువల్ల ఏ ప్రతికూల లేదా దుష్ప్రభావాలు లేకుండా నిశ్చయముగా నయంఅవ్వటం అనది విశేషముగా వుంది.
సోమవారం, ఏప్రిల్ 09, 2012
PC @ వైరస్ ఎలా వస్తుంది?
సోమవారం, ఏప్రిల్ 09, 2012
వైరస్ ఎలా కనిపెట్టవలసి వచ్చిందో ముందు తెలుసుకోవాలి. 19వ శతాబ్దాంతంలో చార్లెస్ చాంబర్లాండ్ పోర్సలీన్ ఫిల్టర్ని కనుగొన్నాడు, దీని ద్వారా అన్ని బాక్టీరియాలను జల్లించడానికి వీలయ్యేది కాని వైరస్‌లు మాత్రం వేరుచేయబడేవి కాదు. దిమిత్రి ఇవనోవ్‌స్కీ ఈ ఫిల్టర్ సహాయంతో పొగాకు మొజాయిక్ వైరస్ (Tobacco Mosaic Virus) ను అధ్యయనం చేసాడు. పొగాకుల సారాన్ని (extract) వడపోసిన తర్వాత కూడా ఆ ఎక్స్‌ట్రాక్టుకు వ్యాధిని ప్రబలింపజేసే గుణం ఉన్నదని ఆయన తన పరిశోధనల ద్వారా తెలియజేసాడు. అదే సమయంలో, వడపోసినా చిక్కని వ్యాధి కారకాలు కొన్ని ఉంటాయని, ఇతర ప్రయోగాల వల్ల బాక్టీరియాలు, వైరస్‌లు వేర్వేరని ఇతర శాస్త్రవేత్తలు నిర్దారించారు. అంతేకాక వైరస్‌లు కూడా బాక్టీరియాల వలె వ్యాధులను కలగజేస్తాయని కనుగొన్నారు. మరికొన్ని ప్రయోగాల తర్వాత వైరస్‌లు బాక్టీరియాల కంటే సూక్ష్మమైనవని నిర్ధారించబడినది. వైరస్ అనే పదాన్ని డచ్ సూక్ష్మజీవ శాస్త్రవేత్త (microbiologist) మార్టినస్ బీజెరింక్ ప్రతిపాదించాడు. అయితే వైరస్ వల్ల వ్యాధులు వస్తాయని తెలిసింది. అది జీవం వున్న జీవులుమీద పనిచేసాయంటే అర్ధం వుంది. నాకు ఆ విషయంలో కొంచెం క్లారిటీ వుంది. ఇప్పుడు నాకు ఒక డౌట్ వుంది. మొబైల్స్ మరియు కంప్యూటర్ లు జీవం లేని (నిర్జీవమైన) వస్తువులు కదా మరి వాటికి వైరస్ రావటం ఏమిటి? అలా వచ్చిన వైరస్ వల్ల అవి పనిచేయకపోవటం ఏమిటి నాకు అస్సలు ఆవిషయం మాత్రం నాకు అర్ధం కాలేదు. మీకు తెలిస్తే దయచేసి నాకు తొందరగా చెప్పేయండి . నాకు జవాబు చెప్పినవారికి ముందుగానే ధన్యవాదములు.
శుక్రవారం, ఏప్రిల్ 06, 2012
జయ హనుమాన్.
శుక్రవారం, ఏప్రిల్ 06, 2012
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
లేబుళ్లు:
దేవదేవం భజె,
పాటలు,
పుట్టిన రోజులు,
Events,
greetings,
photos
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
My Blog Lovers
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ
Diabetic Challenger
DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL.
PLASE SUBSCRIBE MY CHANNEL......
THANK YOU VERY MUCH.
Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను
Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)