గురువారం, మే 17, 2012
భూమాత దుష్ట రాక్షసులు యొక్క ధుష్టపనులు నుండి ప్రపంచంను కాపాడుతున్న మరియు మానవశరీరము ధరించిన విష్ణువును ప్రార్ధిస్తూ మరియు పొగడుతూ ఈ విధంగా పాడుతుంది.
శ్లోకం :
శరణ ముపగతాహం త్వం శరణ్యం జనానాం
నిఖిల భయ వియోగం యోగి చింత్యాం మనంతం
సుర రిపుగణ భారం దుస్సహం దుర్భరమ్మే
పరిహర పరమాత్మన్ భక్తి సిద్ధైక మూర్తే||
తాత్పర్యం:
ఓహ్ దేవాదిదేవ శ్రీమన్నారాయణ, మీరు ఏకైక రక్షకుడైన ఉన్నారు. మీరు మా భయాలును దూరంగా వెదజల్లు. యోగులు ఎల్లప్పుడూ మీమీద ధ్యానం చేస్తువున్నారు. అనేక రాక్షసులు భూమిపై భరించలేని విధంగా దుష్టకర్మలు చేస్తున్నారు. ఇలాంటి పనులు మేము భరించలేకపోతున్నారు నన్ను వారి భారం నుండి నాకు ఉపశమనం కలిగించి నాకు మరియు ప్రపంచం ను కాపాడండి.
పాట :
శరణం భవ కరుణమయి కురు దీన దయాళో
కరుణా రస వరుణలయ ఖరిరాజ క్రుపాళొ ||
అధునా ఖలు విధిన మయి సుధియ సురభరితం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
వరనూపుర ధర సుందర కరశోభిత వలయ
సురభూసుర భయవారక ధరణీ ధర క్రుపయా
త్వరయా హర భర మీశ్వర సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
ఘ్రుణి మందల మణి కుందల ఫణి మందల శయన
అణి మాది సుగుణ భూషణ మణి మంటప సదన
వినతా సుత ఘన వాహన ముని మానస భవన
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
అరి భీకర హలి సొదర పరిపూర్ణ సుఖాబ్ధే
నరకంతక నరపాలక పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా యణ తీర్థ పరాత్మన్
మధుసూదన మధుసూదన హర మామక దురితం ||
బుధవారం, మే 16, 2012
పొట్టేల పోట్లాట నట్టేట్లో పడిపోయాయి కదచేబుతాను వినండి ఆని మాఅమ్మ తన చిన్నప్పుడు తన క్లాస్ పుస్తకంలో చదువుకుందిట. ఆ కధ నాకు చెప్పింది. ఆ క ధ నాకు బలే నచ్చేసింది. వింటే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను.
ఒక ఊరిలో ఒకానొక మేక ఆహారము కోసం ఒక నిలువుగా వున్నా కొండ ఎ క్కి అక్కడ ఆహారం తిని తిరిగి వస్తూవుంటడేది . కానీ ఆకొండ ఎక్కాలి అంటే ఒక నీటి ప్రవాహం దాటాలి. ఆ నీటి ప్రవాహం మీద ఒక బ్రిడ్జ్ వుంది. కానీ ఆ బ్రిడ్జ్ చాలా ఇరుకుగా వుంటుంది. దానిమీద ఒక్కరు మాత్రమే వెళ్ళ గలరు. అలా ఒకరోజు అలా బ్రిడ్జ్ మీద దాటుతున్నప్పుడు అటునుండి ఇంకో పొట్టేలు వస్తోంది. నేను ముందు వచ్చాను నువ్వు వెనక్కి వెళ్ళు నన్ను ముందువెళ్ళని అని ఆ పొట్టేలు అంది. ఈ పొట్టేలు కూడా అలానే అంది నాను ముందుకు వెళ్ళనీ నువ్వు ముందు వెనక్కి వెళ్ళు అని అన్నాది. వాటి మద్య వాదన పెరిగింది. రెండు వాటి కొమ్ములతో కొట్టుకున్నాయి. వాటి మద్య యుద్ధ వాతావరణం నెలకొంది. అలా కొమ్ములుతో కొట్టుకొని వాటి కొమ్ములు విరిగిపోయి అవి ఆ నీటి ప్రవాహంలో పడిపోయి కొట్టుకుపోయాయి. మరలా కొన్ని రోజులు తరువాత మరలా అదే పరిస్థితి వచ్చింది. అవే పొట్టేళ్ళు అదే బ్రిడ్జ్ మీద కలుసుకున్నాయి. అయితే యిప్పుడు అవి వెనకకు వెళ్ళవు, కొట్టుకోవు నీటిలోకి పడిపోవు, వాటిదారిలో అవి సమానంగా వెళ్ళిపోతాయి అది ఎలా? మీకు ఒక hint కూడా ఇస్తాను అవి ఒక ఒప్పందానికి వస్తాయి. అది ఎలాంటి ఒప్పందమో మీరు చెప్పాలి? అవి ఎ విధంగా రెండు పొట్టేళ్ళు సురక్షితంగా వంతెన ద్వారా మార్పు చెందుతాయి. మీకు జవాబు తెలిస్తే నాకు తొందరగా చెప్పేయండి మరి.
మంగళవారం, మే 15, 2012
First show of the Mickey Mouse on 15th May.
హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
అందరికి నెక్కుడైన హనుమంతుడు
అందుకొనె సూర్యఫలమని హనుమంతుడు
బల్లిదుడై లంకజొచ్చి బలురాకాసుల గొట్టి
హల్లకల్లోలము చేసె హనుమంతుడు
వొల్లనె రాముల ముద్దుటుంగరము సీత కిచ్చె
అల్లదె నిలుచున్నాడు హనుమంతుడు
దాకొని యాకెముందర తనగుఱు తెరుగించి
ఆకారమటు చూపె హనుమంతుడు
చేకొని శిరోమణి చేతబట్టి జలనిధి
ఆకసాన దాటివచ్చె హనుమంతుడు
కొంకకిట్టె సంజీవి కొండ దెచ్చి రిపులకు
నంకకాడై నిలిచెను హనుమంతుడు
తెంకినే శ్రీవెంకటాద్రి దేవుని మెప్పించినాడు
అంకె కలశాపురపు హనుమంతుడు
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ