నేనెందువోయె తానెందువోయీ రానీలే రానీలే రానీలే
మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలె కానీలె కానీలె కానీలె
తలచూపేనాటి తలపెల్ల దిగవలె తలచనీ తలచనీ తలచనీవే
కిరికియైననాటి తన కిటుకెల్లదిగవలె తిరుగనీ తిరుగనీ తిరుగనీవే
హరియైననాటి అదటెల్ల దిగవలె జరగనీ జరగనీ జరగనీవే
వడుగైననాటి వస విడువంగవలె తడవకు తడవకు తడవకువే
కలుషించే నాటి కడమెల్ల దిగవలె అలుగనీ అలుగనీ అలుగనీవే
సతిబాసేనాటి చలమెల్ల దిగవలె తతిగానీ తతిగానీ తతిగానీలే
ముసలైన నాటి ముసుపెల్ల దిగవలె విసుగనీ విసుగనీ విసుగనీవే
మానైననాటి మదమెల్ల దిగవలె పోనీవే పోనీవే పోనీవే
కలికైన నాటి గజరెల్ల దిగవలె చెలగనీ చెలగనీ చెలగనీవే
వేడుకతో నాటి వేంకటపతి నన్ను కూడనీ కూడనీ కూడనీవే