ఆదివారం, ఆగస్టు 12, 2012
Hey friends catch me live today (Sunday) show
with your little RJ Sree Vaishnavi
from 10:30 am to 12:00 pm
only on RadioJoshLive
Masth Maza Masth Music :)
My show Name is Harivillu
Fun with me
If you want to talk with me plz call these numbers
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003
Thank You Very Much.
గురువారం, ఆగస్టు 09, 2012
ఈ భారతావనిలో శ్రీకృష్ణుడు అంటే తెలియని వారుండరు. ఆయనే ఈ నవభారత నిర్మాణానికి సూత్రధారుడు. శ్రీకృష్ణుని భగవంతుని అవతారంగా, మానవ రూపంలో, జన్మించిన దేవునిగా ఆరాధించామేగాని మానవుడిగా పుట్టిన ఆ దేవదేవుని మానవునిగాక; వారి లీలలను మానవ మనుగడతో సరిపోల్చుకుంటూ అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యంగా తెలుసుకోవాలి.
అట్టి "శ్రీకృష్ణావతార జన్మదినం" మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన
వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా "శ్రీకృష్ణుడు" జన్మించాడు. అంటే! (క్రీస్తు పూర్వం 3228 సం||)
కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్ని చిన్ని ముద్దుల మొహము కల యశోదనందనుడు కృష్ణుడు గుర్తు వచ్చేస్తాడు. శ్రీ మహావిష్ణువు మన లోకాన్ని కాపాడటానికి ఎన్నో జన్మలు ఎత్తారు.అందులో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణుడుగా జన్మించారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు .
శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిధి రోజు కంసుడు వారిని బంధించిన చెరసాలలో జన్మించాడు.
కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి, సాయంకాలం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెడతారు. ఊయలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ జోల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు.
భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం
చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. శ్రీకృష్ణ జన్మాష్టమిని గురించి తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుడు ఒక కీర్తనలో ఇలా చెప్పారు.
చిన్నవాడు నాలుగుచేతులతోనున్నాడు
కన్నప్పుడే శంఖముచక్రముచేతనున్నది
నడురెయి రోహిణి నక్షత్రమునబుట్టె
వడి కృష్ణుడిదివో దేవతలందు
పడిన మీ బాధలెల్ల ప్రజలాల యిప్పుడిట్టె
విడుగరాయ మీరు వెరవకుడికను
పుట్టుతనె బాలుడు అబ్బురమైన మాటలెల్ల
అట్టె వసుదేవుని కానతిచ్చెను
వట్టిజాలింకేల దేవతలాల మునులాల
వెట్టి వేములు మానెను వెరవకుడికను
శ్రీవేంకటనాథుడే యీసిసువు తానైనాడు
యీవల వరము లెల్లా నిచ్చుచును
కావగ దిక్కైనా డిక్కడనె వోదాసులల
వేవేగ వేడుకతోడ వెరవకుడికను
ఆ బాలకృష్ణుడు దినదిన ప్రవర్థమాన మగుచూ తన లీలావినోదాదులచే బాల్యమునుండే, అడుగడుగునా భక్తులకు జ్నానోపదేశం చేస్తూ వచ్చినాడు. ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్నదొంగగా ముద్రవేసుకున్నాడు. అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందిట. వెన్న జ్నానానికి సంకేతంగా చెప్తారు. పెరుగును మధించగా మధించగా కాని వెన్న లభ్యంకాదు కదా! అట్టి తెల్లని వెన్నను తాను తింటూ, ఆ అజ్నానమనే నల్లని కుండను బద్దలుకొట్టి మానవులలో జ్నానజ్యోతిని వెలిగించడమే కృష్ణ సందేశంగా భావించాలి అని చెప్తూ వుంటారు.
అలాగునే మరోచిన్నారి చేష్టలో మరో సందేశాన్ని చెప్తారు. గోపికలు కుండలలో ఇండ్లకు నీళ్లను యమునానదిలో నుండి తీసుకుని వెళుతూవుంటే, రాళ్లను విసిరిచిల్లు పెట్టేవాడట. అలా ఆకుండ మానవశరీరము అనుకుంటే ఆకుండలోని నీరు 'అహంకారం' ఆ అహంకారం కారిపోతేనేగాని జీవికి ముక్తి లభించదని ఇలా వారి లీలలోని అంతర్యాన్ని భాగవతోత్తములు వివరిస్తూ ఉంటారు.
ఇక చిన్న తనమునుండే అనేకమంది రాక్షసులను సంహరిస్తూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కావిస్తూ కురుపాండవ సంగ్రామములో అర్జునునకు రథసారధియై అర్జునిలో ఏర్పడిన అజ్నానందకారాన్ని తొలగించుటకు "విశ్వరూపాన్ని" చూపించి గీతను బోధించి, తద్వారా మానవాళికి జ్నానామృతాన్ని ప్రసాదించాడు.
మంగళవారం, ఆగస్టు 07, 2012
"హరిత విప్లవ పిత" గా పేరొనబడే ఎమ్.ఎస్. స్వామినాధన్ భారత వ్యవసాయరంగంలో అభివృద్ధికి చేసిన కృషి ప్రశంసనీయం. నేడు మనకు తగినంత ఆహారం పొందడం అంటు జరుగుతోంది అంటే దీని కారణం అయిన Prof M.S. స్వామినాథన్. ఈయన ఒక ఆదర్శ శాస్త్రవేత్త మరియు ఈయనను హరిత విప్లవం కారకుడుగా చెప్పుకోవచ్చు . M.S. స్వామినాథన్ ఆగష్టు 7, 1925 న గల కుంభకోణం లో జన్మించాడు. స్వామినాథన్‌కు 11 ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. స్వామినాథన్ భారతదేశం లో వున్నా శాస్త్రవేత్తలలో గొప్ప జన్యుశాస్త్రవేత్త మరియు ప్రఖ్యాత అంతర్జాతీయ నిర్వాహకుడు, ఉంది "హరిత విప్లవం," ఒక కార్యక్రమం ఇది కింద గోధుమ, బియ్యం మొలకల అధిక దిగుబడి రకాలు పేద రైతుల రంగాలలోనాటింపచేశారు . స్వామినాథన్ భారతదేశం లో గోధుమ అధిక దిగుబడి రకాల పరిచయంచేసి మరియు అభివృద్ధి పరిచారు, తన నాయకత్వం మరియు విజయం కోసం "భారతదేశం లో హరిత విప్లవం తండ్రి", అని అంటారు. అతను M.S. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ గా వున్నారు. అతని పేర్కొంది దృష్టి ఆకలి మరియు పేదరికం ప్రపంచం ఉద్యమించారు. డా స్వామినాథన్ ముఖ్యంగా పర్యావరణపరంగా స్థిరమైన వ్యవసాయం ఉపయోగించి, స్థిరమైన అభివృద్ధికి భారతదేశం కదిలే ఒక న్యాయవాది ఉంది , స్థిరమైన ఆహార భద్రత కలిగించారు మరియు ఒక "సతత హరిత విప్లవం" అని పిలిచే జీవవైవిధ్యం చూపించారు, విప్లవం యొక్క సంరక్షణ 1972 నుండి 1979 వరకు ఆయన అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్‌గా, మరియు అతను 1979 నుండి 1980 వరకు వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అతను అంతర్జాతీయ వరి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (1982-88) డైరెక్టర్ జనరల్ పనిచేశాడు మరియు 1988 లో ప్రకృతి మరియు సహజ వనరుల ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అధ్యక్షుడు అయ్యాడు. డాక్టర్ స్వామినాథన్ ప్రాథమిక మరియు అనువర్తిత ప్లాంట్ బ్రీడింగ్, వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి మరియు సహజ వనరుల పరిరక్షణకు లో సమస్యలు విస్తృత న సహచరులు మరియు విద్యార్ధులు సహకారంతో ప్రపంచవ్యాప్తంగా పని చేసింది. స్వామినాథన్ "ఎకనామిక్ ఎకాలజీ యొక్క తండ్రి" గా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వర్ణించారు. డాక్టర్ స్వామినాథన్ అనేక అసాధారణ అవార్డులు మరియు బహుమతులు అందుకున్నాడు. ఈ బహుమతులు కొనసాగటానికి మరియు తన పని విస్తరించేందుకు సహాయం చేసింది, ఇది పెద్ద మొత్తంలో డబ్బు, ఉన్నాయి. జీవ ఒక పర్యావరణ సంబంధిత నిలకడగా ఆధారంగా ఉత్పాదకత, మరియు "1991 జీవ వైవిధ్య పరిరక్షణా ప్రోత్సాహకం. అతను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు నుండి 50 గౌరవ డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉంది. జాతీయ అవార్డులు అతను దేశం ప్రయోజనకరంగా తన పని కోసం భారతదేశం లో పలు అవార్డులను సన్మానించారు చెయ్యబడింది. ఇన్ని చేసిన ఇంత గొప్ప హరిత విప్లవకారుడు M . S. స్వామినాధన్ ను మనం ఆదర్శంగా తీసుకోవాలి. So, M . S .స్వామినాధన్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు కావునా. ఆయనకీ మన బ్లాగ్ ద్వారా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ M . S . స్వామినాధన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.
సోమవారం, ఆగస్టు 06, 2012
స్కాట్లాండ్లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్ మేరీస్ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్ షూటింగ్, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన 1881 ఆగస్టు 6న జన్మించారు. అంటే ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు . ఈయన 1923లో లైసోజేమ్ అనే ఎంజైమును కనిపెట్టాడు. 1928లో పెన్సిలిన్ అనే యాంటిబయాటిక్‌ను కనిపెట్టాడు. పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి శకాలు(Antibiotic). వీటిని బాక్టీరియా కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు. ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్లో పెన్సిలియమ్ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్ యుగానికి నాంది పలికినట్టయింది. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్ ఫ్లెమింగ్. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్ 1945లో నోబెల్ బహుమతిని పొందారు. 1999లో టైమ్స్ పత్రిక ఫ్లెమింగ్‌ను 20వ శతాబ్దంలోని 100 ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా కీర్తించింది. ఫ్లెమింగ్ పెడింగ్టన్‌లోని సెయింట్ మెరీస్ హాస్పిటలు వైద్య పాఠశాలలలో ఎంబిబిఎస్ చదివారు. ఫ్లెమింగ్ సిప్టమర్ మేరియన్ మెకెల్రాట్ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు. ఫ్లెమింగ్ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ ఆర్మి మెడికల్ కోర్లో కెప్టెన్‌గా పనిచేశారు. యుద్ధ భూమిలో చాలా మంది సూక్ష్మజీవుల బారినపడి చనిపోవడం ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టడానికి ప్రేరణ. పెన్సిలిన్ సృష్టి ఆధునిక వైద్యశాస్త్ర గమనాన్నే మార్చివేసింది. పెన్సిలిన్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు కాపాడింది. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది. పెన్సిలిన్ స్కార్లెట్ ఫీవర్, న్యుమోనియా, మెనింజైటిస్, డిఫ్తీరియా, గొనోరియాపై బాగా పనిచేస్తుంది. ఫ్లెమింగ్‌కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్, ఇంగ్లాడు హంటేరియన్ ప్రొఫెసర్ షిప్ ఇచ్చింది. ఫ్లెమింగ్ 11.3.1955న గుండెపోటుతో మరణించారు. వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ