గురువారం, ఆగస్టు 30, 2012
అందరి వశమా హరి నెరుగ
కందువగ నొకడు గాని యెరగడు
లలితపు పదికోట్ల నొకడు గాని
కలుగడు శ్రీ హరి గని మనగ
ఒలసి తెలియు పుణ్యులకోట్లలో
ఇలనొకడు గాని యెరగడు హరిని
శ్రుతి చదివిన భూసుర కోట్లలో
గతియును హరినె యొకానొకడు
అతి ఘనులట్టి మహాత్మ కోటిలో
తతి నొకడు గాని తలచడు హరిని
తుదకెక్కిన నిత్యుల కోట్లలో
పొదుగునొకడు తలపున హరిని
గుదిగొను హరి భక్తుల కోట్లలో
వెదకు నొకడు శ్రీ వేంకటపతిని
బుధవారం, ఆగస్టు 29, 2012
ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్క్రృతంబులోని చక్కెరపాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నదంబులోని తేట తెలుగునందు
వేనవేల కవుల వెలుగులో రూపోంది
దేశదేశములలో వాసిగాంచిన భాష
వేయియేండ్ల నుండి విలసిల్లు నా "భాష"
దేశభాషలందు తెలుగు లెస్స,
ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవము - భారత దేశము. క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి (1905 జననం). భారతదేశపు హాకీ క్రీడను ప్రపంచ దేశాల్లొ చాటాడు. అందుకని ధ్యాన్ చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించి ప్రతీ సంవత్సరం అమలు చేస్తుంది. అందువల్ల క్రీదాభిమానులందరకు జాతీయ క్రీడాదినోత్సవ శుభాకాంక్షలు.
Play A Game
తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు, గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త,హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.గిడుగురామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. గిడుగు రామమూర్తి పుట్టిన రోజు ఆగష్టు 29 ని తెలుగు భాషా దినోత్సవముగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు ప్రజలు పాటిస్తున్నారు.
విశ్వనాథ సత్యనారాయణ గారు రామమూర్తి పంతులు గారిగురించి ఇలా అన్నారు. "రామ్మూర్తి పంతులు తెలుగు సరస్వతి నోములపంట". అని ఇంకా "రామ్మూర్తి పంతుల వాదాన్ని అర్థం చేసుకోక, దురర్థం కలిగించి తెలుగువాళ్ళు ఎంతో నష్టపోయినారు".
ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంధ సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు. ప్రపంచంలో తెలుగు భాష ఒక విశిష్టమైన స్థానాన్ని కలిగివుంది. ప్రపంచీకరణ వలన పిల్లలను ఇంగ్లీషు మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ఇది ఎంతో గొప్ప మార్పుగా చెప్పుకోవచ్చు. తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు .
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ