శుక్రవారం, సెప్టెంబర్ 21, 2012
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నది ఎవరో తెలుసా గురజాడ అప్పారావు గారు. |
ఈరోజు అనగా సెప్టెంబర్ 21st న గురజాడ అప్పారావుగారి పుట్టినరోజు . గురజాడ అప్పారావుగారు 1862 september 21st న విశాఖపట్టణం జిల్లా లో యలమంచలి తాలూక లో సర్వసిద్ధి రాయవరం అన్న వూరిలో తండ్రి వెంకట రామదాసు , తల్లి కౌసల్యమ్మలకు జన్మిచినారు.
గురజాడ అప్పారావుగారు తెలుగు సాహిత్యమ్ మీద చాలా కృషిచేసారు.
అప్పారావుగారు అన్నారు ఆధునిక మహిళ భారత దేశ చరిత్రను పునర్నిర్మ్స్తుంది అని అన్నారు.
ఆయన రచనలు మామూలు వాడుక భాషలోనే రాసేవారు. ఆయన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే నాటకం మంచి పేరు తెచ్చుకుంది.కన్యాశుల్కము ఆయన రచనలలో మంచి పేరు తెచ్చుకుంది.
- తాంబూలాలు ఇచ్చేసాము తన్నుకు చావండి
- డామిట్! కథ అడ్డంగా తిరిగింది
- పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
అప్పారావుగారి గేయాలలో మనలో దేశభక్తిని పెంచుటకు దేశభక్తి పాట రాసారు అందులో ఒకటి
దేశమును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టిపెట్టోయ్
గట్టిమేల్ తలపెట్టవోయి
-
-
- పాడి పంటలు పొంగిపొర్లె
- దారిలో నువు పాటు పడవోయి
- తిండి కలిగితే కండ కలుగును
- కండ కలవాడేను మనిషోయి
యీసురోమని మనుషులుంటే
దేశమేగతి బాగుఅగునోయ్
జల్దుకుని కళలన్ని నేర్చుకు
దేశి సరకులు నింపవోయ్
-
-
- దేశాభిమానం నాకు కద్దని
- వొట్టి గొప్పలు చెప్పుకోకోయ్
- పూని ఏదైనాను ఒక మేల్
- కూర్చి జనులకు చూపవోయ్
చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నియు మెలగవలెనోయ్
-
-
- సొంత లాభం కొంత మానుకు
- పొరుగు వానికి తోడుపడవోయ్
- దేశమంటే మట్టి కాదోయ్
- దేశమంటే మనుషులోయ్
అప్పారావుగారి రచనలలో కన్యక, ముత్యాలసరాలు , సారంగదార, సుభద్ర ఇంకా చాలా రచనలు వున్నాయి. ఈరోజు అప్పారావుగారి 150 వ జన్మదినం సందర్భంగా సాహిత్యప్రియులందరికి శుభాకాంక్షలు. అప్పారావుగారికి నివాళి అర్పిస్తున్నాము.
గురువారం, సెప్టెంబర్ 20, 2012
గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి
గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి } chorus
గానచతురాయ గానప్రాణాయ గానాంతరాత్మనే
గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసే
గురుపూజితాయ గురుదైవతాయ గురుకులస్థాయినే
గురువిక్రమాయ గుల్హ్యప్రవరాయ గురవే గుణ గురవే
గురుదైత్య కళక్షేత్రే గురుధర్మ సదారాధ్యాయ
గురుపుత్రపరిత్రాత్రే గురుపాఖండ ఖండకాయా
గీతసారాయ గీతతత్వాయ గీతగోత్రాయ ధీమహి
గూఢగుల్ఫాయ గంధమత్తాయ గోజయప్రదాయా ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి } chorus
{గంధర్వరాజాయా గంధాయా గంధర్వ గాన శ్రవణప్రనైమే
గాఢఅనురాగాయ గ్రంధాయా గీతాయ గ్రంధార్థ తన్మైయే
గురిలే...గుణవతే ..గణపతయే.. } chorus
గ్రంధ గీతాయ గ్రంధ గేయాయ గ్రంధాంతరాత్మనే
గీతలీనాయ గీతాశ్రయాయ గీతవాద్యపఠవే
గేయచరితాయ గాయ గవరాయ గంధర్వప్రీకృతే
గాయకాధీన విగ్రహాయ గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ గౌరీ హృదయ నందనాయ
గౌరభాను సుఖాయ గౌరీ గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ గౌరి ప్రవణాయ గౌరభావాయ ధీమహి
ఓ సహస్త్రాయా గోవర్ధనాయ గోపగోపాయ ధీమహి
గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి
ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి
{ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయాయ ధీమహి
గజేశానయ భాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి } chorus
మంగళవారం, సెప్టెంబర్ 18, 2012
చిత్ర కవితావతంసులు - జ్యోతిశ్శాస్త్ర వేత్త - విశ్రాంత తెలుగు ఉపన్యాసకులు (Rtd. Telugu lecturer)
శ్రీ చింతా రామ కృష్ణా రావు గారి చే
ఈ గణపతి నవరాత్రులు సందర్భంగా
ఉపన్యాసాంశము.
ఈగణపతి నవరాత్రులు ఉత్సవ ప్రాశస్త్యము
వరసిద్ధి వినాయక వ్రతవిదాన వివరణ.
ప్రత్యేక కార్యక్రమము మీ రేడియోజోష్ లో
సమయం: ఉదయం గం 7:00 నుండి గం 10:00 వరకు
మళ్ళీతిరిగి
సాయంత్రము గం 6:00 నుండి గం 8:00 వరకు.
వినాయకుని ఆకారంలో మనం నేర్చుకోవలసినవి ఇమిడివున్నాయి కావాలంటే మీరే చూడండి.
వినాయకుని తొండం
ఓంకారాన్ని పోలి వుంటుంది.
ఏనుకు తల జ్ణానానికి , యోగ మునకు గుర్తు.
మానవశరీరము మాయ కు ప్రకృతికి సంకేతము.
చేతిలో పరసు అజ్ణానాన్ని పారద్రోలేది.
మరోచేతిలో కత్తి విఘ్నాలను పోగొట్టే సాధనం.
విరిగిన దంతం త్యాగానికి గుర్తు.
మాల జ్ణానాన్ని సంపాదించేది.
పెద్దచేవులు అందరి మాటలు జాగ్రత్తగా వినాలి.
బొజ్జమీద నాగబందం శక్తికి,కుండలినికి గుర్తులు.
ఎలుక వాహనం అన్ని జీవులను సమానంగా ప్రేమించగలగాలి.
చూసారా మరి వినాయకుని ఆకారం లో ఎంత గొప్ప జ్ణానం దాగివుందో.
|
!! Om Sri Ganeshaya Namah !! |
విఘ్ననాయకుని రూపం ఇల
శిరస్సు - విశ్వ విజ్ఞానాన్ని మేధస్సున గ్రహిస్తుంది
కళ్ళు - విశ్వాన్ని ఆకాశంలా కరుణతో తిలకిస్తుంది
చెవులు - విశ్వంలో ప్రతి సూక్ష్మ శబ్దాన్ని గమనిస్తుంది
తొండం - శ్వాసను గమనిస్తూనే ఎరుకతో ధ్యానిస్తుంది
దంతం - అజ్ఞానం కష్టమైనా వదిలించుకో
నోరు - ఎవరు ఎంత దూరమున్నా ఆదుకో
శరీర దేహము - విశ్వ విజ్ఞానాన్ని ఎంతైనా స్వీకరించండి
ఎలుక - ప్రతి జీవికి ఒకే శ్వాస ఒకే ప్రాణమే
సంపూర్ణ రూపము గురువుగా భోదిస్తూనే ఉంటుంది
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ